Posts

Showing posts from May, 2021

అకీరా నా హీరో.. బండ్ల ట్వీట్ వైరల్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత బండ్ల గణేష్ కు ఉన్న బంధం గురించి తెలిసిందే. పవన్ ని దేవుడిలా కొలుస్తుంటారు బండ్ల గణేష్. ఎప్పటికప్పుడు పవన్ పై తనకున్న అభిమానాన్ని చాటేలా పోస్ట్ లు చేస్తుంటారు. పవన్ కి సంబంధించిన ప్రతీ ఈవెంట్ లో బండ్ల గణేష్ ఉండాల్సిందే. ‘వకీల్ సాబ్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో పవన్ ను ఉద్దేశిస్తూ.. బండ్ల గణేష్ ఇచ్చిన స్పీచ్ ను అభిమానులు అంత సులువుగా మర్చిపోలేరు. పవన్ రీ ఎంట్రీలో వరుస సినిమాలు అంగీకరిస్తుండడంతో బండ్ల గణేష్ కూడా ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నా దేవుడు తో నా హీరో ⁦ @PawanKalyan ⁩ pic.twitter.com/AblSazzyJQ — BANDLA GANESH. (@ganeshbandla) May 31, 2021 ఇదిలా ఉండగా.. పవన్ తనయుడు అకీరా నందన్ ను బండ్ల గణేష్ లాంచ్ చేస్తారా..? అనే విషయం ఇప్పుడు ట్విట్టర్ లో చర్చనీయాంశంగా మారింది. దానికి కారణం ఏంటంటే.. ఈరోజు పవన్ కళ్యాణ్, అకీరా కలిసి తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తండ్రిని మించిపోయిన అకీరా హైట్ ను చూసుకుంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. పలు కామెంట్స్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ ఫోటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి...

ఫ్యామిలీ మ్యాన్-2 సైలెంట్ ఎటాక్

భారతీయ ప్రేక్షకులు అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్-2’. రెండేళ్ల కిందట వచ్చిన తొలి సీజన్‌ అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకోగా.. సెకండ్ సీజన్‌కు సమంత ఆకర్షణ కూడా తోడవడంతో అంచనాలు మరింత పెరిగాయి. దీన్ని ఇప్పటిదాకా బాగా ప్రమోట్ చేస్తూ కూడా వచ్చారు. ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. ఐతే ప్రిమియర్లకు రెండు వారాల ముందే ప్రమోషన్లు హోరెత్తించిన ‘ఫ్యామిలీ మ్యాన్-2’ టీం.. విడుదలకు మూడు రోజుల ముందు సైలెంటుగా ఉండటం గమనార్హం. ముందు అనుకున్న ప్రణాళికల ప్రకారం అయితే ఈపాటికి ప్రమోషన్లు ఓ రేంజిలో జరుగుతుండాలి. సమంత మీడియాలో హల్‌చల్ చేస్తుండాలి. కానీ ఆమె సహా టీంలోని ఎవ్వరూ ఈ సిరీస్‌ను ప్రమోట్ చేయట్లేదు. నిజానికి ఈ సిరీస్ గురించి ఇప్పుడు వార్తలు రాకపోవడమే మంచిదన్న అభిప్రాయంతో దీని టీం ఉంది. ఇందుకు కారణం కరోనా ఏమీ కాదు. ‘ఫ్యామిలీ మ్యాన్-2’ చుట్టూ ముసురుకున్న వివాదం. ఇందులో సమంత పోషించిన పాత్ర తమిళ టైగర్లను పోలి ఉండటంతో దుమారం రేగిన సంగతి తెలిసిందే. తమిళ జనాలు ట్రైలర్ చూసి బాగా హర్టయ్యారు. తమ మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్న ఈ సిరీస్‌ను బ్యాన్ చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఈ మేరకు ఏకంగా రా...

రామ్ చరణ్ నిర్మాత.. రవితేజ హీరో

మలయాళంలో రెండేళ్ల కిందట మంచి విజయం సాధించిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ చిత్రం తెలుగులో రీమేక్ కాబోతున్నట్లు ఏడాది కిందటే వార్తలొచ్చాయి. కానీ ఇప్పటిదాకా ఆ దిశగా అడుగులు ముందుకు పడలేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా ‘డ్రైవింగ్ లైసెన్స్’ రీమేక్ హక్కులు కొన్నట్లుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. రీమేక్‌లో చరణే నటిస్తాడని కూడా అన్నారు. ఒరిజినల్లో పృథ్వీరాజ్ చేసిన సినిమా స్టార్ పాత్రను చరణ్ ఇక్కడ చేస్తాడని వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఒక దశలో ఈ పాత్రకు పవన్ కళ్యాణ్ పేరు కూడా వినిపించింది. కానీ ఇప్పటిదాక ఏ అధికారిక సమాచారం బయటికి రాలేదు. ఐతే ఇటీవల ఈ సినిమాకు రవితేజ పేరు వినిపించింది. పృథ్వీరాజ్ పాత్రను అతనే చేయబోతున్నట్లుగా ఇండస్ట్రీలో కూడా చెప్పుకున్నారు. ఇది వాస్తవమే అని.. మాస్ రాజా ప్రధాన పాత్రలో రామ్ చరణ్ ‘డ్రైవింగ్ లైసెన్స్’ రీమేక్‌ను ప్రొడ్యూస్ చేయబోతుండటం ఖరారైందని ఇండస్ట్రీలో కొంచెం గట్టిగానే వినిపిస్తోంది. ఈ వార్త నిజమే అయితే.. మాస్ రాజా డేరింగ్ డెసిషన్ తీసుకున్నట్లే. ఎందుకంటే.. ‘డ్రైవింగ్ లైసెన్స్’ రవితేజ ఎక్కువగా చేసే మాస్ మసాలా సినిమాల టైపు కాదు. మాస్ రాజా ఎప్పుడు ప్రయోగాల బాట పట్టి...

పిక్ టాక్: పవర్ స్టార్‌తో జూనియర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ముడిపడ్డ ఏ విషయమైనా సోషల్ మీడియాకు ఎక్కిందంటే నెటిజన్ల హంగామా మామూలుగా ఉండదు. పవన్‌ సినీ, వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొత్త కబురేదైనా వినిపించినా.. ఏదైనా అరుదైన ఫొటో కనిపించినా ట్విట్టర్ హోరెత్తిపోతుంటుంది. పవన్ తాజా ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఐతే ఆ ఫొటోలో అసలైన విశేషం పవన్ కాదు.. అతడి కొడుకు అకీరా నందన్. చాలా ఏళ్ల నుంచి పుణెలో తల్లి రేణు దేశాయ్‌ దగ్గరే పెరిగిన అకీరా.. మీడియాలో కనిపించడం చాలా తక్కువ. అతడి వ్యక్తిగత ఫొటోలు కూడా పెద్దగా బయటికి రావు. ఎప్పుడో ఒక ఫొటో బయటికి వచ్చిందంటే.. ఆ రోజు అది ట్రెండింగ్‌లో ఉండాల్సిందే. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. అకీరా తండ్రితో కలిసి ఉన్న అరుదైన ఫొటో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అకీరా ఎంత పొడగరో ఇంతకుముందే అందరూ చూశారు. గత ఏడాది నిహారిక పెళ్లికి వచ్చినప్పటి ఎయిర్ పోర్ట్ ఫొటోల్లో అతడి ఎత్తు చూసి అందరూ షాకయ్యారు. ఆరడగుల బుల్లెట్ అంటూ కామెంట్లు చేశారు. ఇప్పుడు పవన్ పక్కన అకీరాను చూస్తే తండ్రి కన్నా పొడవుగా కనిపిస్తున్నాడు. గతంతో పోలిస్తే అతడి లుక్ కూడా బాగుంది. కుర్రతనం తగ్గి పెద్దవాడవుతున్న ఛాయ...

సీక్రెట్ గా హీరోయిన్ పెళ్లి.. ఫోటోలు వైరల్!

Image
‘అత్తారింటికి దారేది’ సినిమాతో బాపు బొమ్మగా గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రణీత సుభాష్ ఇప్పుడు సైలెంట్ గా పెళ్లి చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. బెంగుళూరుకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజుని ప్రణీత ప్రేమ వివాహం చేసుకున్నారు. అతి తక్కువ మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో బెంగుళూరులో ఈ వివాహ వేడుక జరిగింది. కరోనా కారణంగా ప్రణీత ఇంట్లోనే వివాహం జరిపించినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ వివాహం గత ఆదివారం జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ పెళ్లికి హాజరైన ఓ స్నేహితుడు పెళ్లి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడం విషయం బయట పడింది. కరోనా కారణంగా ఎవరికి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. తాజాగా ఈ పెళ్లి వార్తలపై ప్రణీత స్పందించారు. ఇది లవ్ కమ్ ఎరేంజ్డ్ మ్యారేజ్ అని స్పష్టం చేశారు. నితిన్ తనకు చాలా కాలంగా తెలుసునని.. తమ బంధాన్ని పెళ్లితో మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్న తరువాత ఇంట్లో విషయం చెప్పామని.. వాళ్లు కూడా తమ నిర్ణయాన్ని గౌరవించారని చెప్పుకొచ్చారు. తన వ్యక్తిగత విషయాలను బయటపెట్టడం ఇష్టం ఉండదని అన్నారు. తన పెళ్లి ఎలా జరగాలని కలలు కన్నానో అలానే జరిగిందని.. కరోనా కారణంగా ఎక్కువ...

చిన్న సినిమాల జాతర షురూ కానుందా..?

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలన్నీ కూడా హోల్డ్ లో పెట్టారు. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో షూటింగ్ లకు కూడా పర్మిషన్లు దొరకడం లేదు. జూన్ రెండో వారం నుండి షూటింగ్ లు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ రెండో వారానికి లాక్ డౌన్ లో సడలింపులు వస్తాయని భావిస్తున్నారు. ఆ విధంగానే షూటింగ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ముందుగా ప్యాచ్ వర్క్ లు, గ్రాఫిక్స్ వర్క్, పాటల షూటింగ్ బ్యాలెన్స్ ఉన్న సినిమాలు ఆ పనులన్నీ చక చకా పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమయ్యే అవకాశం ఉంది.  ఆ విధంగా చూసుకుంటే లిస్ట్ పెద్దదనే చెప్పాలి. కానీ థియేటర్లు ఆగస్టులో తెరుచుకుంటాయని అంటున్నారు. సమయం ఉంది కాబట్టి మరికొన్ని సినిమాలు ఆగస్టు నాటికి రెడీ అయ్యే ఛాన్స్ ఉంది. చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలు మొత్తం కలిపి ఇరవై నుండి ముప్పై వరకు ఉంటాయని అంచనా. ఇవన్నీ కూడా ఆగస్టుకి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే సినిమా టికెట్ రేట్లు, యాభై శాతం ఆక్యుపెన్సీ ఓకే అనుకునేవారు మాత్రమే తమ సినిమాలను రిలీజ్ చేసే సాహసం చేస్తారు. లేదంటే మళ్లీ హోల్డ్ లో పెట్...

‘కేజీఎఫ్2’ లేటెస్ట్ అప్డేట్!

కన్నడ హీరో యష్ ని స్టార్ హీరోగా చేసింది ‘కేజీఎఫ్’ సినిమా. దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తోన్న ఈ సినిమా సెకండ్ చాప్టర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు కానీ ఇప్పుడు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. మొదటి చాప్టర్ లో ముఖాలు చూపించకుండా కొన్ని క్యారెక్టర్ లను సస్పెన్స్ గా ఉంచారు. ఇప్పుడు రెండో చాప్టర్ లో ఆ పాత్రలను రివీల్ చేయనున్నారు. సినిమా రిలీజ్ కు ముందు ఒక్కో క్యారెక్టర్ కు సంబంధించిన పోస్టర్స్ ను రివీల్ చేస్తూ మరింత హైప్ పెంచుతున్నారు. ఈరోజు మరో పోస్టర్ ను రివీల్ చేశారు. ఈ సినిమాలో ఇనాయత్ ఖలీల్ అనే పాత్రలో బాలకృష్ణ అనే నటుడు కనిపించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్. పేపర్ కట్టింగ్స్ తో ఉన్న ఈ పోస్టర్ లో.. ఇనాయత్ ఇండియాలో గుర్తుతెలియని ప్రాంతంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారని క్యాప్షన్ ఉంది. దుబాయ్ లో ఉంటూ నరాచీను దక్కించుకోవాలనుకునే డాన్ గా ఇనాయత్ ఖలీల్ రోల్ ఉండబోతుంది. ఇంతకీ ఈ పాత్రలో కనిపిస్తోన్న బాలకృష్ణ ఎవరో తెలుసా....

దేవరకొండ ప్రొడక్షన్ లో మూడో సినిమా!

టాలీవుడ్ కుర్ర హీరోల్లో విజయ్ దేవరకొండకి ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అతడి తక్కువ సమయంలో స్టార్ స్టేటస్ అందుకున్నారు. యూత్ లో విజయ్ సినిమాలకు క్రేజ్ మాములుగా ఉండదు. అయితే ఈ మధ్యకాలంలో విజయ్ కి సరైన సినిమా పడలేదు. దీంతో తన తదుపరి సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తోన్న ‘లైగర్’ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తరువాత సుకుమార్ తో ఓ సినిమా కమిట్ అయ్యారు ఈ సెన్సేషనల్ హీరో. నటుడిగా ఓ పక్క సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ నిర్మాతగా కూడా తన బాధత్యలు నెరవేరుస్తున్నారు. ‘కింగ్ ఆఫ్ ది హిల్’ అనే బ్యానర్ మొదలుపెట్టి తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో ‘మీకు మాత్రమే చెప్తా’ అనే సినిమాను నిర్మించారు విజయ్ దేవరకొండ. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కానప్పటికీ పెట్టిన డబ్బులు రిటర్న్ వచ్చేశాయని అప్పట్లో విజయ్ తండ్రి గోవర్ధన్ వెల్లడించారు. ఇదే బ్యానర్ లో రెండో సినిమా తన తమ్ముడు ఆనంద్ దేవరకొండను హీరోగా పెట్టి తీస్తున్నారు విజయ్ దేవరకొండ. ‘పుష్పక విమానం’ అనే టైటిల్ తో ...

ఒక్కమగాడు ఎందుకు పోయిందంటే..

అది 2007. ‘దేవదాసు’ సినిమాతో భారీ విజయాన్నందుకున్న వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ‘ఒక్కమగాడు’ అనే పవర్ ఫుల్ టైటిల్‌తో సినిమా అనౌన్స్ చేయగానే నందమూరి అభిమానుల్లో ఎక్కడ లేని ఉత్సాహం. సినిమా మేకింగ్ దశలో, రిలీజ్ ముంగిట ఈ సినిమా గురించి ఎంతో చర్చ. ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తుందనే అంచనాల మధ్య తర్వాతి ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ మార్నింగ్ షో పడగానే అంతటా హాహాకారాలు. నందమూరి అభిమానులకు దిమ్మదిరిగిపోయింది. పూర్తి సినిమా చూడలేక అల్లాడిపోయారు. వైవీఎస్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఇలా చేశాడేంటంటూ అతడికి శాపనార్థాలు పెట్టారు. బాలయ్య కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిందా చిత్రం. సినిమా రిలీజయ్యాక చౌదరి నోటికి తాళం పడిపోయింది. ‘ఒక్క మగాడు’ గురించి మాట్లాడ్డానికే భయపడ్డాడు. ఐతే ఈ మధ్య మరీ సైలెంట్ అయిపోయిన చౌదరి.. ఈ మధ్య తన పుట్టిన రోజు సందర్భంగా, తర్వాత ఎన్టీఆర్ జయంతి నేపథ్యంలో మీడియాతో మాట్లాడి వార్తల్లో నిలిచాడు. తాజాగా ఆయన ట్విట్టర్లో ఎన్టీఆర్ మీద పెట్టిన ఒక స్పేస్‌లోనూ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ‘ఒక్కమగాడు’ గురించి ఆయనకు ప్రశ్న ఎ...

నేను కథలు రాయలేను!

ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు కథల కోసం రైటర్లపై ఆధారపడుతుంటారు. కానీ ఆ విషయాలను బయటకు చెప్పరు. పేరున్న బడా బడా దర్శకులు సైతం కొన్ని సన్నివేశాల కోసం ఇతర రైటర్ల సహాయం కోరుతుంటారు. కానీ వారి బలహీనతలను బయటకు చెప్పరు. కానీ దర్శకుడు వంశీ పైడిపల్లి అలా కాదు. టాలీవుడ్ లో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో సినిమాలు తీశారాయన. ఇప్పుడు తన కెరీర్ లో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా తీయడానికి సిద్ధమవుతున్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ తో ఓ క్రేజీ ప్రాజెక్ట్ ను సెట్ చేశారు వంశీ పైడిపల్లి. దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమాను పరిస్థితులు చక్కబడిన తరువాత మొదలుపెడతారు. తాజాగా ఈ విషయాన్ని వంశీ పైడిపల్లి అధికారికంగా వెల్లడించారు. ఈ క్రమంలో తన సినిమా, సినిమాకి మధ్య గ్యాప్ ఎందుకు వస్తుందనే విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. స్వభావ రీత్యా తను కథకుడిని కాదని.. సొంతంగా కథలు తయారు చేసుకోలేనని చెప్పారు. కథల కోసం ఇతర రైటర్ల మీద ఆధారపడుతుంటానని.. ఆ కారణంగానే సినిమాలు చేయడంలో ఆలస్యం జరుగుతుందని తెలిపారు. ఒక ప్రాజెక్ట్ పూర్తి చేసిన తరువాత కథ కోసం వెతకడం మొదలుపెడితే చాలా సమయం పట్టేస్త...

చిన్మ‌యి పెళ్లిలో వైర‌ముత్తు.. కొత్త వివాదం

త‌మిళ‌, తెలుగు ప‌రిశ్ర‌మ‌ల్లో మంచి పేరున్న గాయ‌ని, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మ‌యి శ్రీపాద‌.. త‌మిళ లెజెండ‌రీ లిరిసిస్ట్ వైర‌ముత్తు మీద మూడేళ్ల కిందట చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు ఎంతగా సంచలనం రేపాయో తెలిసిందే. వైరముత్తు మీద ఆమె అప్పట్నుంచి అలుపులేని పోరాటం చేసింది. వైరముత్తుపై ఆమె కేసులు కూడా పెట్టగా.. ఇప్పటిదాకా అయితే ఆయనపై ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. బహుశా ఎన్నో ఏళ్ల కిందట జరిగిన విషయాలకు సంబంధించి ఇప్పుడు చిన్మయి ఆధారాలు ఇవ్వలేకపోవడం వల్ల ఈ కేసులు నిలవలేకపోయి ఉండొచ్చు. ఐతే వైరముత్తు ప్రతిష్ఠను దెబ్బ తీయడంలో మాత్రం చిన్మయి విజయవంతం అయిందనే చెప్పాలి. తాజాగా కేరళకు చెందిన ఓఎన్వీ అకాడమీ వైరముత్తుకు సాహిత్య పురస్కారం ప్రకటించడంపై ఎంత వివాదం నడుస్తోందో తెలిసిందే. చివరికి తనకీ అవార్డు వద్దంటూ వైరముత్తు వెనక్కిచ్చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ వివాదం ఇలా ఉంటే.. మరో వైరముత్తు-చిన్మయిలకు సంబంధించి గొడవ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. వైరముత్తుపై ఇన్ని ఆరోపణలు చేసిన చిన్మయి.. తన పెళ్లికి ఆయన్ని స్వయంగా ఆహ్వానించడమే కాక.. ఆయన వచ్చినపుడు ఆశీర్వాదాలు తీసుకోవడం ఏంటనే ప్రశ్న ఆమెకు ...

బాలును చంపేశారంటున్న ఆయన

గత ఏడాది దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను తీవ్రంగా కలచివేసింది. కరోనా సోకి ఆసుపత్రిలో చేరాక కూడా చాలా హుషారుగా మాట్లాడి, తాను బాగున్నానని, త్వరలోనే తిరిగి ఇంటికి వచ్చేస్తానని చెప్పిన ఆయన.. ఆ తర్వాత విషమ స్థితిలోకి వెళ్లడం.. చివరికి మృత్యువుతో పోరాడి ఓడిపోవడం.. అభిమానులను విషాదంలోకి నెట్టడం తెలిసిందే. కరోనా నెగెటివ్ వచ్చాక కూడా ఆయన కోలుకోకపోవడం.. పోస్ట్ కొవిడ్ కాంప్లికేషన్లతో ప్రాణాలు వదలడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఐతే బాలుకు చికిత్స అందించడంలో పొరబాట్లు జరిగాయని.. కొవిడ్‌ను కట్టడి చేయడంలో స్టెరాయిడ్లను విపరీతంగా వాడటంతో ఆయన శరీరం తట్టుకోలేకపోయిందని.. అందువల్లే అవయవాలు దెబ్బ తిని ప్రాణాలు కోల్పోయాయని కొందరు వైద్యులు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఇదే విషయమై ‘కీటో డైట్’తో పాపులర్ అయిన వీరమాచనేని రామకృష్ణ మాట్లాడారు. బాలు కరోనాతో చనిపోలేదని.. ఆయన్ని వైద్యులు చంపేశారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయుర్వేదం, ఇతర వైద్యాల విషయంలో సవాలక్ష ప్రశ్నలు వేసే అలోపతి వైద్యులు.. కరోనా చికిత్సలో ఎన్ని తప్పులు చేశారో ప్రపంచం గుర్తించాలని ఆయన అన్నా...

విజయ్‌తో సినిమా.. కన్ఫమ్ చేసిన వంశీ

సూపర్ స్టార్ మహేష్ బాబుతో వంశీ పైడిపల్లి రూపొందించిన సూపర్ హిట్ మూవీ ‘మహర్షి’ విడుదలై రెండేళ్లు దాటిపోయింది. దీని తర్వాత మహేష్‌తోనే వంశీ మరో సినిమా చేయాల్సి ఉండగా.. అది క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత చాలామంది తెలుగు స్టార్లను ట్రై చేసి విఫలమయ్యాడు వంశీ. ‘మహర్షి’ లాంటి భారీ చిత్రం తీసి, విజయం కూడా అందుకున్నాక వంశీ పరిస్థితి ఇలా అయ్యిందేంటి అనుకున్నారంతా. ఐతే కొంచెం గ్యాప్ వస్తే వచ్చింది కానీ.. తమిళ సూపర్ స్టార్ విజయ్‌తో వంశీ సినిమా ఖరారు చేసుకుని వారెవా అనిపించాడు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమా గురించి మీడియాలో వార్తలు వచ్చాయి కానీ.. ఇప్పటిదాకా అధికారిక ప్రకటన అయితే లేదు. ఐతే ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు అధికారికంగా ఖరారైంది. వంశీనే స్వయంగా తాను విజయ్‌తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ.. విజయ్‌తో తాను సినిమా చేయబోతున్న మాట వాస్తవమే అని, తన కెరీర్లోనే ఇది అతి పెద్ద ప్రాజెక్టని చెప్పాడు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం సరైన సమయం కాదని ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించలేదని వంశీ తెలిపాడు. కొవిడ్ తగ్గాక ఈ సినిమా మొదలవుతుందన్నాడు. మీడియాలో ప్రచార...

ప్రధానే మమతను వెయిట్ చేయించారా ?

ప్రధానమంత్రి నరేంద్రమోడి-సీఎం మమతబెనర్జీ మధ్య పరిస్దితులు వాతావరణం రోజు రోజుకు మరింతగా దిగజారిపోతున్నాయి. యాస్ తుపాను బాధిత ప్రాంతాలను చూడటానికి పశ్చిమ బెంగాల్ వచ్చిన నరేంద్రమోడిని మమతబెన్జీరీ 30 నిముషాల పాటు వెయిట్ చేయించారనే వార్తలపై సీఎం మండిపోయారు. తనకు వ్యతిరేకంగా కావాలనే అబద్ధాలను ప్రధానమంత్రి కార్యాలయం ప్రచారం చేస్తోందన్నారు. ప్రధాని బసచేసిన చోటుకు తాను, ప్రధాన కార్యదర్శి వెళ్ళినట్లు ఆమెచెప్పారు. అయితే తమను మోడిని కలవనీయకుండా 20 నిముషాల పాటు పీఎంవో ఉన్నతాధికారులు నిలిపేసినట్లు ఆరోపించారు. తాను ప్రధానిని వెయిట్ చేయించటం కాదని తననే మోడి వెయింట్ చేయించారని ఆమె చెప్పారు. కొద్దిసేపటి తర్వాత ఓ అధికారి వచ్చి మోడి కాన్ఫరెన్సు హాలులో ఉన్నారని చెప్పి తమను తీసుకెళ్ళినట్లు మమత తెలిపారు. అయితే అక్కడ బీజేపీ ఎంఎల్ఏలు, నేతలతో మోడి మాట్లాడుతున్నది చూసి తాను ఆశ్చర్యపోయాయనన్నారు. ప్రధానమంత్రి సమీక్షంటే ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులు ఉండాలి కానీ ప్రతిపక్ష బీజేపీ ఎంఎల్ఏలు, నేతలుండటం ఏమిటంటే గట్టిగానే నిలదీశారు. గుజరాత్ , ఒడిస్సాలో పర్యటించనపుడు బెంగాల్లో చేసినట్లే బీజేపీ లేదా ప్రతిపక్ష ఎంఎల్ఏలు, నేతల...

చిరు డైరెక్టర్ మారలేదు.. ఇదిగో క్లారిటీ!

ఈ మధ్యకాలంలో ఏ సినిమా మీద రానన్ని రూమర్స్ చిరంజీవి 153వ సినిమాపై వచ్చాయి. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో నటిస్తోన్న చిరు తన తదుపరి చిత్రంగా ‘లూసిఫర్’ రీమేక్ లో నటించాలనుకున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగు నేటివిటీకు తగ్గట్లుగా రూపొందించనున్నారు. ఈ సినిమా కోసం ముందుగా వినాయక్, సుజీత్ లాంటి దర్శకులను అనుకొని ఫైనల్ గా మోహన్ రాజాను ఫిక్స్ చేశారు. అయితే సినిమాను లాంచ్ చేసి చాలా కాలం అవుతున్నప్పటికీ షూటింగ్ మాత్రం మొదలుకాలేదు. పైగా ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో రకరకాల పుకార్లు మొదలయ్యాయి. మోహన్ రాజా చేసిన మార్పులు చిరుకి నచ్చలేదని.. దీంతో ఆయన కొన్నాళ్లు ఈ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టనున్నారని వార్తలొచ్చాయి. ఇది కాకుండా.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చిరు సినిమాల షూటింగ్ లకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు కాబట్టి ‘లూసిఫర్’ రీమేక్ ఇప్పట్లో రాదంటూ మరికొన్ని వార్తలు వినిపించాయి. ఇప్పటివరకు వీటిపై మెగా కాంపౌండ్ స్పందించింది లేదు. కానీ ఈరోజు మోహన్ రాజా పుట్టినరోజు సందర్భంగా ఈ రూమర్లకు చెక్ పెట్టింది. కొణిదెల ప్రొడక్షన్స్, మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థలు మోహన్ రాజాకు బర్త్ డే విషెస్ తెల...

‘మెగా’ హీరోలపై సి.కళ్యాణ్ అసంతృప్తి

తెలుగు సినీ పరిశ్రమలో దీర్ఘ కాలంగా ఉన్న పెద్ద నిర్మాతల్లో సి.కళ్యాణ్ ఒకరు. కాకపోతే ఆయనదంతా ఓల్డ్ స్కూల్ వ్యవహారం. ఔట్ డేట్ అయిపోయిన సీనియర్ డైరెక్టర్లను నమ్ముకుని ఎదురు దెబ్బలు తింటుంటాడు. అందుకే ఆయన కెరీర్లో హిట్ల కంటే ఫ్లాపులు, డిజాస్టర్లే ఎక్కువ. చివరగా నందమూరి బాలకృష్ణతో చేసిన ‘రూలర్’ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. అంతకుముందు బాలయ్యతోనే తీసిన ‘జై సింహా’ పర్వాలేదనిపించింది. ఇక మెగా ఫ్యామిలీ యువ కథానాయకులు వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్‌లతో తీసిన ‘లోఫర్’; ‘ఇంటిలెజెంట్’ కూడా డిజాస్టర్లవడం తెలిసిందే. ఈ రెండు చిత్రాల విషయంలో కళ్యాణ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పరోక్షంగా ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘‘నేను మెగా హీరోల్లో వరుణ్ తేజ్‌తో సినిమా చేశా. నాగబాబు అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో అనుబంధం ఉ:ది. వరుణ్‌ను నా కొడుకు అనుకుని సినిమా చేశా. ‘లోఫర్’ సినిమాకు అవసరమైనదానికంటే ఎక్కువ ఖర్చు పెట్టా. కానీ ఆ సినిమాకు ఏడు కోట్ల నష్టం వచ్చింది. ఆ సినిమాకు ముందు వరుణ్ తీసుకున్న పారితోషకం కంటే నేను ఎక్కువ ఇచ్చా. సినిమా ఆడకపోవడంతో ఇంకో సినిమా చేయడానికి వాళ్ల ను...

ఎన్టీఆర్ మీద వైవీఎస్ డాక్యుమెంటరీ

సీనియర్ దర్శకుడు వైవీఎస్ చౌదరికి సీనియర్ ఎన్టీఆర్ అంటే ఎంత అభిమానమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక చోట ఎన్టీఆర్ రెఫరెన్స్ ఉండేలా చూసుకుంటూ ఉంటాడు చౌదరి. అలాగే తన సినిమాల టైటిల్స్‌కు ముందు కూడా ఎన్టీఆర్ ఫొటో పెట్టి ఆయనకు నివాళి అర్పిస్తాడు. ఏటా ఎన్టీఆర్ జయంతికి క్రమం తప్పకుండా పత్రికా ప్రకటనలు ఇవ్వడం, ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి నివాళులు అర్పించడం చౌదరి క్రమం తప్పకుండా చేసే పనులు. ఇక మీడియా వాళ్లు ఎన్టీఆర్ గురించి అడిగితే తీవ్ర ఉద్వేగంతో మాట్లాడేస్తుంటాడు చౌదరి. ఈ అభిమానంతోనే ఎన్టీఆర్ మీద ఒక బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నాడు ఈ వీరాభిమాని. 2022లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరగనున్న నేపథ్యంలో ఇప్పట్నుంచే అందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వైవీఎస్ వెల్లడించాడు. ఎన్టీఆర్‌పై తాను తీయనున్న డాక్యుమెంటరీ గురించి కూడా ఇందులో చౌదరి వివరించాడు. ‘‘ఎన్టీఆర్ బంధు మిత్రులు, సన్నిహితులు, ఆయనతో కలిసి పని చేసిన వారు అనేకమంది ఉన్నారు. వీళ్లందరికీ ఎన్టీఆర్ మీద ఎనలేని అభిమానం ఉంది. ఆయనతో వారికి ఉణ్న అనుబంధం గురించి ఇంటర్వ్యూలు చేయాలనుకుంటున్నాం. కొందరు యాంకర్...

పారితోష‌కాల‌కే 200 కోట్లు?

ప్రస్తుతం ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ అంటే ప్ర‌భాసే. కేవ‌లం అత‌ణ్ని న‌మ్ముకుని వంద‌ల కోట్లు బ‌డ్జెట్లు పెడుతున్నారు. అంత‌కు మించి బిజినెస్ కూడా జ‌రుతుతోంది ఆ చిత్రాల‌కు. రాధేశ్యామ్ త‌ర్వాత ప్ర‌భాస్ లైన్లో పెట్టిన మూడు సినిమాల బ‌డ్జెట్ క‌లిపితే వెయ్యి కోట్ల‌కు పైమాటే అంటే అత‌డి రేంజ్ ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. ముఖ్యంగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ నిర్మించ‌నున్న చిత్రం ఇండియ‌న్ ఫిలిం హిస్ట‌రీలోనే అత్య‌ధిక బ‌డ్జెట్లో తెర‌కెక్క‌నున్న చిత్రం కానున్న‌ట్లుగా సంకేతాలు అందుతున్నాయి. ముందు ఈ సినిమా బ‌డ్జెట్ రూ.300 కోట్ల‌న్నారు కానీ.. ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న స‌మాచారం ప్ర‌కారం ఖ‌ర్చు రూ.500 కోట్ల దాకా ఉండ‌బోతోంద‌ని తెలుస్తోంది. కాగా ఈ 500 కోట్ల‌లో 40 శాతం బ‌డ్జెట్ కేవ‌లం పారితోష‌కాల‌కే పోనుంద‌ట‌. ఈ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా ప‌దుకొనే న‌టించ‌నుండ‌గా.. బిగ్-బి అమితాబ్ బ‌చ్చ‌న్ ఓ కీల‌క పాత్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వీళ్ల పారితోష‌కాలు భారీగానే ఉంటాయి. ఇక ప్ర‌భాస్ రేంజ్ గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ అత్య‌ధిక స‌మ‌...

హీరోయిన్లు మీ నుండి దూరంగా పారిపోతున్నారు..

చెన్నైలో పీఎస్బీబీ అనే స్కూల్ లో పని చేస్తోన్న ఓ టీచర్ విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నాడనే విషయం బయటకు రావడంతో తమిళనాట విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. సెలబ్రిటీలు సైతం ఈ విషయంపై స్పందిస్తూ సదరు టీచర్ ను విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కూడా ఈ విషయంపై స్పందించారు. ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. స్కూల్ మూతపడేలా చర్యలు తీసుకోవాలంటూ స్కూల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ను కోరారు. Being in cinema industry first condemn the sexual predators and harassments. @VishalKOfficial . Look at what’s happening with new entry girls. Look at the harassment on female lead actors. You and your friends come from same clout to use and throw.many women affected by you people — Gayathri Raguramm (@BJP_Gayathri_R) May 29, 2021 కాసేపటికే ఈ పోస్ట్ వైరల్ కాగా నటి, కొరియోగ్రాఫర్ గాయత్రి రఘురామ్.. విశాల్ తీరుపై మండిపడ్డారు. ముందు సినిమా ఇండస్ట్రీలో జరుగుతోన్న లైంగిక వేధింపులను ఖండించమని సలహా ఇచ్చారు. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చ...

వ్యాక్సిన్ కోసం ఫేక్ ఐడీ.. చిక్కుల్లో పడ్డ హీరోయిన్!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా రోజుకి లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెప్పడంతో జనాలు వ్యాక్సిన్ కోసం ఎగబడుతున్నారు. అయితే సెలబ్రిటీలకు, రాజకీయనాయకులకు దొరికినంత తేలికగా వ్యాక్సిన్ లు సామాన్య ప్రజలకు దొరకడం లేదనే విషయంపై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. తాజాగా నటి మీరా చోప్రా ఫేక్ ఐడీతో వ్యాక్సిన్ వేయించుకోవడం విమర్శలకు దారితీసింది. తెలుగులో ‘బంగారం’ అనే సినిమాలో నటించిన మీరాచోప్రా ఆ తరువాత ‘మారో’, ‘వాన’ వంటి సినిమాల్లో కనిపించారు. తెలుగుతో పాటు తమిళంలో అలానే హిందీ సినిమాల్లో నటించారు. ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ట్విట్టర్ లో ఎప్పటికప్పుడు రాజకీయ అంశాలపై స్పందిస్తుంటారు. తాజాగా మీరా చోప్రా వ్యాక్సిన్ వేయించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని పోస్ట్ పెట్టింది. అయితే ఆమె ఫ్రంట్లైన్ వారియర్ కోటాలో ఫేక్ ఐడీతో వ్యాక్సిన్ వేయించుకున్నారని తెలియడంతో బీజేపీ ప్రభుత్వం మండిపడుతోంది. మీరాచోప్రా థానేలోని పార్కింగ్ ప్లాజా ...

కుర్రాడు జాక్ పాట్ కొట్టేశాడు

‘గోల్కొండ హైస్కూల్’ సినిమాలో స్కూల్ జ‌ట్టు కెప్టెన్ పాత్రలో నటించిన కుర్రాడిని చూసి.. ఇత‌నెవ‌రో చాలా స‌హ‌జంగా భ‌లే న‌టిస్తున్నాడే అనిపిచింది ప్రేక్ష‌కుల‌కు. ఆ తర్వాత న‌వ‌దీప్-స్వాతి జంట‌గా న‌టించిన‌ ‘బంగారు కోడిపెట్ట’ అనే సినిమాలోనూ ఆ కుర్రాడు ఆకట్టుకున్నాడు. అప్ప‌టి వ‌ర‌కు ఈ కుర్రాడి పేరు సంతోష్ శోభ‌న్ అని, అత‌ను దివంగ‌త ద‌ర్శ‌కుడు శోభ‌న్ త‌న‌యుడని జ‌నాల‌కు తెలియ‌దు. కానీ ‘తను నేను’ అనే సినిమాతో క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నపుడు సంతోష్ నేప‌థ్యం అంద‌రికీ తెలిసిందే. ఎందుకంటే ప్ర‌భాస్, మ‌హేష్‌, క‌ష్ణ‌వంశీ, త్రివిక్ర‌మ్ లాంటి ప్ర‌ముఖులు శోభ‌న్ మీద అభిమానంతో సంతోష్‌ను ప్ర‌మోట్ చేశారు. ఐతే ఆ సినిమా స‌రిగా ఆడ‌లేదు. ఆ త‌ర్వాత సంతోష్ హీరోగా చేసిన పేప‌ర్ బాయ్ సైతం నిరాశ‌కే గురి చేసింది. దీంతో సంతోష్ కెరీర్ ఇక పుంజుకోద‌నే అంతా అనుకున్నారు. ఐతే దాదాపు మూడేళ్ల గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఏక్ మిని క‌థ సినిమాతో ప‌ల‌క‌రించాడు సంతోష్‌. ఈ గ్యాప్‌లో అత‌ను త‌న లుక్ మార్చుకున్నాడు. న‌ట‌న కూడా మెరుగుప‌రుచుకున్నాడు. ఈసారి ఆషామాషీ సినిమా చేస్తే లాభం లేద‌ని.. యువి క్రియేష‌న్స్ లాంటి పెద్ద బేన‌ర్లో, మేర్ల‌పాక...

అవార్డు వెన‌క్కిచ్చేస్తున్న వైర‌ముత్తు

ఒక‌టి రెండు కాదు ఏకంగా ఏడు జాతీయ అవార్డులు.. ప‌ద్మ‌శ్రీ, ప‌ద్మ‌భూష‌ణ్ పురస్కారాలు.. ఇంకా కేంద్ర సాహిత్య అకాడ‌మీ అవార్డు.. త‌మిళ లెజెండ‌రీ లిరిసిస్ట్ వైర‌ముత్తు ఘ‌న‌త‌లివి. ఇంకా మ‌రెన్నో గౌర‌వాలు పొందిన ఆయ‌న మీద గాయ‌ని చిన్మ‌యి, మ‌రికొంద‌రు లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు చేయ‌డం ఒక సంచ‌ల‌నం. మూడేళ్ల నుంచి ఈ గొడ‌వ న‌డుస్తూనే ఉంది. వైర‌ముత్తు మీద చేసిన ఆరోప‌ణ‌లకు రుజువులు లేకున్నా, ఎలాంటి చ‌ర్య‌లూ చేప‌ట్ట‌కున్నా.. ఆయ‌న ఇమేజ్ మాత్రం బాగా డ్యామేజ్ అయిన మాట వాస్త‌వం. తాజాగా వైర‌ముత్తుకు కేర‌ళ‌కు చెందిన ఓఎన్వీ అకాడ‌మీ ఇచ్చే ప్ర‌తిష్టాత్మ‌క సాహిత్య పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించ‌గా.. దాని మీద పెద్ద గొడవే జ‌రుగుతోంది. రెండంకెల సంఖ్య‌లో అమ్మాయిలు లైంగింక వేధింపుల ఆరోప‌ణ‌లు చేసిన వ్యక్తికి ఇలాంటి పుర‌స్కారం ప్ర‌క‌టించ‌డం ఏంట‌నే ప్ర‌శ్న‌లు తలెత్తాయి. చిన్మ‌యి మాత్ర‌మే కాదు.. ఎంతోమంది గాయ‌కులు, ర‌చ‌యిత‌లు ఈ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌ట్టారు. జ్యూరీ నిర్ణ‌యాన్ని ప్ర‌శ్నించారు. ఈ విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో వైర‌ముత్తు స్పందించారు. ఓన్‌వీ అకాడ‌మీ పుర‌స్కారాన్ని తాను వెన‌క్కి ఇచ్చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వివాదం గురించి...

ఇంతకీ ఎవరీ ‘హనుమాన్’?

‘అ!’ లాంటి ప్రయోగాత్మక సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. ఆ తర్వాత కల్కి, జాంబి రెడ్డి డిఫరెంట్సి మూవీస్ తీసిన తీసిన యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ.. తాజాగా ‘హనుమాన్’ అనే సోషియో ఫాంటసీ మూవీని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో ఇదే తొలి సూపర్ హీరో సినిమా అని ప్రశాంత్ అంటున్నాడు. ఐతే కొన్ని దశాబ్దాల కిందటే సీనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో ‘సూపర్ మ్యాన్’ అనే సినిమా రావడం ప్రశాంత్‌కు తెలిసి ఉండకపోవచ్చు. ఐతే తన సినిమాలకు ఓ రేంజిలో ఎలివేషన్ ఇచ్చుకుంటూ ప్రశాంత్‌కు మొదట్నుంచి ఇలా ఘనమైన ప్రకటనలు ఇవ్వడం అలవాటే. నిజానికి అతడి తొలి మూడు చిత్రాల్లో పూర్తి స్థాయిలో ఏదీ ప్రేక్షకులను మెప్పించలేదు. ‘అ!’ మూవీని మంచి ప్రయోగంగా పేర్కొన్నవాళ్లూ ఉన్నారు. అదే సమయంలో అదొక వేస్ట్ మూవీ అన్న వాళ్లూ లేకపోలేదు. ‘కల్కి’ అయితే పూర్తిగా నిరాశకు గురి చేసింది. ‘జాంబి రెడ్డి’ మిక్స్‌డ్ ఫీలింగ్ ఇచ్చింది. మరి భారీ బిల్డప్‌తో అనౌన్స్ చేసిన ‘హనుమాన్’ సంగతేంటో చూడాలి. ఇంతకీ ప్రశాంత్ చెబుతున్న ప్రకారం తెలుగులో తొలి సూపర్ హీరోగా కనిపించబోయే నటుడెవరన్న ఆసక్తి అందరిలోనూ మొదలైంది. కొన్ని రోజుల కిందట ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో త్వరలోనే తన...

కాజల్.. ‘సీత’ తర్వాత ఇంకోటి

దాదాపు దశాబ్దంన్నర నుంచి కథానాయికగా కొనసాగుతోంది కాజల్ అగర్వాల్. ఇటు తెలుగు, అటు తమిళంలో పెద్ద హీరోలు చాలామందితో జట్టు కట్టిన ఆమె.. సౌత్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. ఐతే మిగతా స్టార్ హీరోయిన్లతో పోలిస్తే ఆమె పెద్దగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయలేదు. పుష్కరానికి పైగా కథానాయికగా కొనసాగాక.. రెండేళ్ల కిందట ‘సీత’ చిత్రంలో నటించింది. అదే ఆమె తొలి లేడీ ఓరియెంటెడ్ మూవీ. కానీ ఆ చిత్రం ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఈ దెబ్బతో మళ్లీ ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయదనే అనుకున్నారు. ఐతే ఇటీవల ‘లైవ్ టెలికాస్ట్’ అనే వెబ్ సిరీస్‌లో ఆమె లీడ్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చందమామ మళ్లీ ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేయనున్నట్లు సమాచారం. ‘లైవ్ టెలికాస్ట్’ తరహాలోనే హార్రర్ జానర్లో ఈ సినిమా ఉండబోతోందట. సంపత్ నంది నిర్మాణంలో సంతోష్ శోభన్ హీరోగా ‘పేపర్ బాయ్’ అనే సినిమా తీసిన జయశంకర్.. కాజల్‌ ప్రధాన పాత్రలో ఓ సినిమా తీయనున్నాడట. ‘పేపర్ బాయ్’ నిరాశపరిచినప్పటికీ.. ఇటీవల ఒక ఓటీటీలో వచ్చిన ‘విటమిన్-షీ’ షోతో జయశంకర్ ఆకట్టుకున్నాడు. దీని తర్వాత అతను ఒక డిఫరెంట్ హార్రర్ థ్రిల్లర...

జగపతిబాబు ఏడేళ్ల తర్వాత..

జగపతి బాబును తలుచుకోగానే.. ఆయన సాల్ట్ అండ్ పెప్పర్ లుక్కే గుర్తుకొస్తుంది అందరికీ. హీరో వేషాలు పక్కన పెట్టేసి విలన్, క్యారెక్టర్ రోల్స్ మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన ఆ లుక్కే మెయింటైన్ చేస్తున్నారు. ఎప్పుడూ గడ్డంతోనే కనిపిస్తున్నారు. ఆయన్ని చివరగా ఎప్పుడు క్లీన్ షేవ్ లుక్‌తో చూశామో కూడా జనాలకు గుర్తు లేదు. కొన్ని సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్‌లో గడ్డం తగ్గించి.. జుట్టుకు, గడ్డానికి రంగేసుకుని కనిపించారు కానీ.. క్లీన్ షేవ్‌లో మాత్రం గత కొన్నేళ్లలో ఎప్పుడూ కనిపించింది లేదు. ఐతే ఇప్పుడాయన గడ్డం తీసేసి సరికొత్త లుక్‌లోకి మారారు. ఏడేళ్ల తర్వాత తాను క్లీన్ షేవ్ చేసుకున్నది ఇప్పుడే అంటూ కొన్ని ఫొటోలను ఇన్‌స్టా‌గ్రామ్‌లో షేర్ చేశారు. ఈ కొత్త లుక్‌లో జగపతిబాబును చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ అన్నీ ఆగిపోవడం, కనీసం ఇంకో నెల రోజులు చిత్రీకరణలు పున:ప్రారంభం అయ్యే అవకాశం లేకపోవడంతో గడ్డం తీసేయడానికి జగపతికి ఇబ్బంది లేకపోయి ఉండొచ్చు. ఏడేళ్లుగా గడ్డం మెయింటైన్ చేస్తున్నాడంటే.. బహుశా ‘లెజెండ్’ సినిమా కోసం విలన్ అవతారం ఎత్తి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లోకి మారాక జగపతి ఎప్పుడూ క్లీ...

ముగ్గురు హీరోలు నో చెప్పాక.. కళ్యాణ్ రామ్ తో!

చాలా ఏళ్లుగా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కావాలని చూస్తున్నారు మల్లిడి వేణు. గతంలో హీరో నితిన్, రామ్ లాంటి వాళ్లకు కథలు చెప్పారు. కానీ వర్కవుట్ కాలేదు. 2016లో అల్లు శిరీష్ హీరోగా మల్లిడి వేణు దర్శకత్వంలో ఓ సినిమాను లాంచ్ కూడా చేశారు. గీతాఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించాలనుకున్నారు. కానీ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే ఆగిపోయింది. దానికి బడ్జెట్ సమస్యలే కారణమని సమాచారం. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తీయాలనుకున్నారు. ఏడెనిమిది వందల ఏళ్ల కిందటి నేపథ్యంలో కథ ఉంటుందని అప్పట్లో అల్లు శిరీష్ చెప్పారు ముందుగా అల్లు శిరీష్ మార్కెట్ పరిధుల్లో ఈ సినిమాను తెరకెక్కించాలనుకున్నారు. సినిమా కోసం ఓ భారీ దర్బార్ సెట్ కూడా వేయాలనుకున్నారు. కానీ అనుకున్నదానికంటే బడ్జెట్ దాటిపోయే అవకాశం ఉందని భావించిన అల్లు అరవింద్ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక ప్రాజెక్ట్ ను క్యాన్సిల్ చేశారు. అప్పటినుండి మల్లిడి వేణు హీరోల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఫైనల్ గా కళ్యాణ్ రామ్ ప్రాజెక్ట్ ఓకే అయింది. వశిష్ట్ గా పేరు మార్చుకొని సినిమా అనౌన్స్ చేశారు మల్లిడి వేణు. అదే ‘బింబిసార’. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యా...

నిర్మాతలకు శర్వా లీగల్ నోటీసులు?

తెలుగులో దర్శక నిర్మాతలతో చాలా చక్కగా వ్యవహరిస్తాడని పేరున్న కథానాయకుల్లో శర్వానంద్ ఒకడు. అతడి చుట్టూ ఇప్పటిదాకా దాదాపు ఎలాంటి వివాదాలు లేవు. శర్వా గురించి అతడి పరోక్షంలోనూ అందరూ చాలా బాగా మాట్లాడతారు. నిర్మాతలు అతణ్ని ఆకాశానికెత్తేస్తుంటారు. అలాంటి నటుడికి ఇప్పుడు ఇద్దరు ప్రముఖ నిర్మాతలతో వివాదం నెలకొందని.. తనకు రావాల్సిన పారితోషకం పెండింగ్ పెట్టడంతో లీగల్ నోటీసులు ఇచ్చే వరకు పరిస్థితి వెళ్లిందని వార్తలొస్తున్నాయి. శర్వా చివరి సినిమా ‘శ్రీకారం’ను నిర్మించిన 14 రీల్స్ ప్లస్ అధినేతలు రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంటలతోనేనట ఈ వివాదం. ఉదాత్తమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కి మంచి రివ్యూలు కూడా తెచ్చుకున్న ‘శ్రీకారం’ కమర్షియల్‌గా ఆశించిన ఫలితాన్నందుకోలేకపోయింది. నిర్మాతలకు కాస్త ఎక్కువగానే నష్టాలు తెచ్చిపెట్టింది. పెట్టుబడిలో సగం కూడా వెనక్కి రాలేదని సమాచారం. కాగా శర్వాకు ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన రెమ్యూనరేషన్లో రూ.2 కోట్లు పెండింగ్ పెట్టారట నిర్మాతలు. రిలీజ్ తర్వాత ఈ డబ్బులు ఇవ్వాలని అనుకుని ఉండొచ్చు. ఐతే సినిమా కమర్షియల్‌ సక్సెస్ కాక 14 రీల్స్ అధినేతలకు బాగా నష్టాలు తేవడంతో శర్వ...

మాజీ మంత్రిపై నటి సంచలన ఆరోపణలు

చాందిని అనే చిన్న స్థాయి తమిళ నటి వ్యవహారం ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశంగా మారింది. అన్నాడీఎంకే సారథ్యంలో మంత్రిగా పని చేసిన మణికందన్ అనే నాయకుడిపై ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ఐదేళ్లకు పైగా తనతో సహజీవనం చేసిన మణికందన్.. తనను అన్ని రకాలుగా వాడుకుని ఇప్పుడు వదిలేశాడని ఆమె ఆరోపించింది. మీడియా ముందుకొచ్చి తమ బంధం గురించి ఫొటో ఆధారాలు చూపించి మరీ ఆమె ఈ ఆరోపణలు చేసింది. తెలుగులోకి ‘శంభో శివ శంభో’ పేరుతో రీమేక్ అయిన తమిళ సినిమా ‘నాడోడిగల్’ సహా కొన్ని సినిమాల్లో చాందిని నటించింది. గత కొన్నేళ్లలో ఆమె అంత లైమ్ లైట్లో ఏమీ లేదు. కాగా మంత్రి మణికందన్‌ను ఒక కార్యక్రమంలో భాగంగా కలిశానని.. తర్వాత తమ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని.. తమ మధ్య శారీరక సంబంధం కూడా మొదలైందని.. తరచుగా ఆయన బంగ్లాకు వెళ్లి వస్తుండేదాన్ననని చాందిని వెల్లడించింది. ఐతే తర్వాత ఇద్దరం ఒక ఇల్లు అద్దకు తీసుకుని అందులో సహజీవనం చేశామని.. భార్యతో తనకు సరైన సంబంధాలు లేవని, ఇబ్బందులున్నాయని.. కాబట్టి నిన్ను పెళ్లి చేసుకుంటానని మణికందన్ చెప్పాడని.. దీంతో ఆయనతో ఇన్నేళ్లుగా కలిసి ఉన్నానని.. కానీ ఇప్పుడు ఆయన అడ్డం తిరిగాడని చాందిని ఆరోపించింది. ...

ఎక్స్ క్లూజివ్ : వెంకీతో మహా!

స్టార్ హీరోలు చిన్న దర్శకులతో కలిసి పని చేయడానికి చాలా ఆలోచిస్తారు. చెప్పినట్లుగా కథను హ్యాండిల్ చేయగలరా..? అనే సందేహంతో ఉంటారు. రిస్క్ తీసుకోవడం ఎందుకని.. స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేసుకుంటూ పోతారు. అందుకే చిన్న దర్శకులకు అంత త్వరగా అవకాశాలు రావు. కానీ ఇప్పుడు విక్టరీ వెంకటేష్ లాంటి పేరున్న హీరో ఓ చిన్న దర్శకుడితో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ‘కేరాఫ్ కంచరపాలెం’ అనే సినిమాతో వెండితెరకు పరిచయమైన దర్శకుడు వెంకటేష్ మహాకి వెంకీ పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వీరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందంట. అయితే ఇది థియేట్రికల్ రిలీజ్ కోసం మాత్రం కాదట. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. అమెజాన్ ప్రైమ్ మంచి బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. పాండమిక్ పరిస్థితులు చక్కబడిన తరువాత దీనికి సంబంధించిన అధికార ప్రకటన రానుంది. ఇటీవల వెంకీ ‘నారప్ప’ షూటింగ్ ను పూర్తి చేశారు. అలానే ‘దృశ్యం2’, ‘ఎఫ్2’ లాంటి సినిమాలు లైన్లో...

బ్రహ్మాజీ ‘హ్యాంగ్‌మ్యాన్’.. ఓటీటీ రిలీజ్!

తెలుగు సినిమా ప్రేక్షకులను పరిచయం అక్కర్లేని పేరు బ్రహ్మాజీ. సరికొత్త పాత్రలు, మేనరిజమ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా రకరకాల పాత్రలు పోషించి టాలీవుడ్ లో తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేయగలిగాడు. చాలా కాలంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తోన్న ఆయన కొన్నాళ్లక్రితం ‘హ్యాంగ్‌మ్యాన్’ అనే సినిమాలో మెయిన్ లీడ్ గా నటించబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా వదిలారు. ఈ ఫస్ట్ లుక్ లో చేతిలో పెద్ద చేప పట్టుకొని.. కాస్త నెరసిన జుట్టుతో కనిపించి ఆశ్చర్యపరిచాడు బ్రహ్మాజీ. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ఇప్పుడు డబ్బింగ్ పనులు షురూ చేశారు. బ్రహ్మాజీ ప్రస్తుతం తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే ముందుగా ఈ సినిమాను ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి పంపించాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఆ విధంగా సినిమాకు బజ్ తీసుకురావాలని భావిస్తున్నారు. ఆ తరువాత సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థతో డీల్ కుదుర్చుకోవాలని చర్చలు జరుపుతున్నారు. క్రైమ్ డ్రామా జ...

‘కర్ణన్’ రీమేక్ లో రావు రమేష్..?

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో రీమేక్ ల పరంపర కొనసాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలు కూడా రీమేక్ కథల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇతర భాషల్లో సక్సెస్ అయిన కథలను తీసుకొని వాటిని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేసి ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది హీరోలు సక్సెస్ లు కూడా అందుకున్నారు. ఇప్పుడు కుర్ర హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఓ రీమేక్ కథలో నటించడానికి సిద్ధమవుతున్నారు. కోలీవుడ్ లో ధనుష్ హీరోగా తెరకెక్కిన ‘కర్ణన్’ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా రీమేక్ రైట్స్ బెల్లంకొండ సురేష్ తీసుకున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. అయితే ఈ సినిమాలో కీలక పాత్ర కోసం ప్రముఖ నటుడు రావు రమేష్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. తమిళంలో ధనుష్ కి తాత వరసయ్యే పాత్రలో మలయాళ నటుడు లాల్ కనిపించారు. ఈ సినిమాలో లాల్ పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉంటుంది. హీరోకు అండగా నిలబడి, మార్గనిర్దేశనం చేసే ముసలి స్నేహితుడిగా లాల్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ పాత్ర కోసమ...

అక్షయ్ సినిమాలో తెలుగు నటుడు

టాలీవుడ్లో చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. చాలా కష్టపడి ఎదిగి ఒక స్థాయిని అందుకున్న నటుల్లో సత్యదేవ్ ఒకడు. ‘మిస్టర్ పర్ఫెక్ట్’; ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి చిత్రాల్లో పెద్దగా గుర్తింపు లేని హీరో ఫ్రెండు పాత్రలతో మొదలైంది అతడి నట ప్రస్థానం. ఐతే స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అతడి జీవితాన్ని మార్చేశాడు. ఇంకా చిన్న చిన్న పాత్రలే చేస్తున్న సమయంలో సత్యతో ‘జ్యోతిలక్ష్మి’లో ఛార్మి సరసన నటింపజేశాడు. ఈ సినిమా సరిగా ఆడకపోయినా సరే.. సత్యదేవ్‌కు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత తనకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకుని ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరోల్లో ఒకడిగా గుర్తింపు సంపాదించాడు. గత ఏడాది ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’తో ఆకట్టుకున్న సత్యదేవ్… ప్రస్తుతం గుర్తుందా శీతాకాలం, తిమ్మరసు చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలు తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్తాయని అతను ఆశిస్తున్నాడు. కాగా సత్యదేవ్ ఇప్పుడు ఓ భారీ బాలీవుడ్ సినిమాలో అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘రామ్ సేతు’లో సత్యదేవ్‌కు ఒక కీలక పాత్ర దక్కిందట...

‘హరిహర వీరమల్లు’పై నిర్మాత అప్‌డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కుతున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా మొదలైనపుడు ఏమో అనుకున్నారు కానీ.. ఈ మధ్యే రిలీజైన టీజర్ చూశాక అందరూ విస్మయానికి గురయ్యారు. పవన్ కెరీర్లో ‘బాహుబలి’ లాంటి సినిమా అవుతుందన్న అంచనాలు రేకెత్తించింది ఆ టీజర్. విలక్షణ దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా.. ‘ఖుషి’తో పవన్‌కు మరపురాని విజయాన్నందించి సీనియర్ ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నాడు. మధ్యలో చాలా ఏళ్లు టాలీవుడ్‌కు దూరమైన రత్నం.. మళ్లీ ఈ చిత్రంతో లైమ్ లైట్లోకి రావాలనుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ‘హరిహర వీరమల్లు’ గురించి వీలు చిక్కినపుడల్లా మీడియాతో మాట్లాడుతున్నాడు. ఆయన మరోసారి ఈ సినిమా గురించి మీడియాతో కొన్ని విశేషాలు పంచుకున్నాడు. షూటింగ్, రిలీజ్ గురించి అప్‌డేట్స్ ఇచ్చాడు. పవన్ కెరీర్లోనే అత్యంత భారీ చిత్రంగా ‘హరిహర వీరమల్లు’ను తీర్చదిద్దుతున్నామని.. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తయిందని రత్నం వెల్లడించాడు. చివరగా చేసిన షెడ్యూల్లో భాగంగా ఏప్రిల్ 6వ తేదీ వరకు షూటింగ్ జరిపామని.. తర్వాత పవన్ కరోనా బారిన పడటం, అలాగే లాక్ డౌన్ కారణంగా కొత్త షెడ్యూల్ మొదలుపెట్...

సోనూ సూద్ మెగా పాన్ ఇండియా ప్రాజెక్ట్

పాన్ ఇండియా అనగానే ఇదేదో సినిమా కబురు అనుకుంటున్నారేమో. కాదు కాదు. ఏడాది కిందట కరోనా కారణంగా లాక్ డౌన్ తలెత్తినప్పటి నుంచి అనితర సాధ్యమైన రీతిలో సేవా కార్యక్రమాలు చేపడుతూ పాన్ ఇండియా లెవెల్లో రియల్ హీరోగా అవతరించిన సోనూ సూద్.. ఇప్పుడు తన ఛారిటీని మరో స్థాయికి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యాడు. కరోనా సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ అందక దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. దీంతో ఇటు ప్రభుత్వం, అటు స్వచ్ఛంద సంస్థలు.. ఇకపై ఆక్సిజన్ అందక ప్రాణాలు పోకూడదన్న సంకల్పంతో ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. గత రెండు నెలల్లో వేలాది మందికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, సిలిండర్లు అందజేసి ప్రాణాలు నిలబెట్టిన సోనూ.. ఇప్పుడు ఈ విషయంలో మరో గొప్ప ప్రయత్నం చేస్తున్నాడు. ఇక పై ఆక్సిజన్ కాన్సంట్రేటర్ కావాలంటే సోనూ టీంకు ఫోన్ చేసి దాని కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. ఈ మార్గంలో అందరికీ సాయం చేయడం సాధ్యం కాదని భావించి.. సోనూ టీం ప్రణాళికాబద్ధమైన అడుగు వేసింది. www.umeedsonusood.com పేరుతో ఒక వెబ్ సైట్ ఓపెన్ చేసి. అత్యవసర స్థితిలో ఉన్నవాళ్లు అందులో తమ వివరాలు సమర్పించి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అడిగితే చాల...

కళ్యాణ్ రామ్.. మళ్లీ అదే తప్పు చేస్తున్నాడా?

టాలీవుడ్లో సాహసాలకు పెట్టింది పేరు నందమూరి కళ్యాణ్ రామ్. కాకపోతే అతను చేసే రిస్క్‌లు కొంచెం క్యాల్కులేటెడ్‌గా ఉంటే బాగుంటుందని అభిమానులు అనుకుంటూ ఉంటారు. తన మార్కెట్ పరిధికి మించి బడ్జెట్లతో సినిమాలు చేసి చేతులు కాల్చుకోవడం అతడికి అలవాటు. గతంలో హరే రామ్, ఓం అనే సినిమాలతో అతను ఇలాగే దారుణంగా దెబ్బ తిన్నాడు. ముఖ్యంగా ‘ఓం’ సినిమా కోసం చేసిన సాహసం కళ్యాణ్‌రామ్‌ను ముంచేసిందనే చెప్పాలి. యాక్షన్ సినిమాను త్రీడీలో చేయడమేంటో.. దాని మీద అప్పట్లోనే 25 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టడమేంటో ఎవరికీ అర్థం కాలేదు. దాని మీద పెట్టిన ఖర్చు మొత్తం బూడిదలో పోసిన పన్నీరే అయింది. దానికి ముందు తర్వాత కూడా ఇలాంటి ఎదురు దెబ్బలే తిన్నాడు ఈ నందమూరి హీరో. రవితేజ హీరోగా తన ప్రొడక్షన్లో తీసిన ‘కిక్-2’కు సైతం అవసరానికి మించి ఖర్చు చేసి భారీ నష్టం చవిచూశాడు. ఇప్పుడిక హీరోగా తన కెరీర్ ఏమంత బాగా లేని స్థితిలో ఒక భారీ పీరియడ్ ప్రాజెక్టును నెత్తికెత్తుకున్నాడు. అదే.. బింబిసర. శుక్రవారం సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేశాడు కళ్యాణ్ రామ్. అది చూస్తే చరిత్రలోకి వెళ్లి ఒక అన్ టోల్డ్ స్టోరీని చె...

పాపం.. తరుణ్ పరస్థితి ఎలా అయ్యిందంటే

బాలనటుడిగా గొప్ప పేరు సంపాదించి.. హీరోగా తొలి చిత్రం ‘నువ్వే కావాలి’తో బ్లాక్ బస్టర్ అందుకుని.. ఆపై ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను లాంటి సూపర్ హిట్లతో ఊపు మీద కనిపించాడు తరుణ్ ఒకప్పుడు. యూత్‌లో అతడికి మంచి ఫాలోయింగ్ వచ్చింది. తరుణ్ పెద్ద స్టార్ అవుతాడని అంతా అనుకున్నారు. కానీ తర్వాత సరైన సినిమాలు ఎంచుకోక గాడి తప్పాడు ఈ యంగ్ హీరో. వరుసగా ఫ్లాపుల మీద ఫ్లాపులు ఇచ్చి ఫేడవుట్ అయిపోయాడు. గత దశాబ్ద కాలంలో అతను రెండో మూడో సినిమాలు చేశాడు. అవి రిలీజైనట్లు కూడా జనాలకు తెలియదు. చివరగా ‘ఇది నా లవ్ స్టోరీ’ అనే సినిమా చేయగా.. అది చూసిన ప్రేక్షకులకు తలలు బొప్పి కట్టాయి. ఈ దెబ్బతో అతడి కెరీర్ క్లోజ్ అయిపోయింది. తరుణ్ హీరోగా మొదలైన కొన్ని సినిమాలు మధ్యలో ఆగిపోగా.. కొత్తగా అతడితో సినిమా చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. జనాలు పూర్తిగా తరుణ్‌ను మరిచిపోయిన ఈ సమయంలో అతను కొత్త అవతారం ఎత్తాడు. ఆశ్చర్యకరంగా తరుణ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అవతారం ఎత్తడం విశేషం. అది కూడా ఏదో ఒక పెద్ద తమిళ సినిమాకైనా ఓకే అనుకోవచ్చు. ‘ఆహా’ ఓటీటీలో రిలీజైన ‘అనుకోని అతిథి’ చిత్రంలో ఫాహద్ ఫాజిల్ చేసిన లీడ్ రోల్‌కు తరుణ్ డబ్బింగ్ చెప్ప...

తండ్రి దర్శకుడిగా పనికి రాడనేసిన రాజమౌళి

భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమక కమర్షియల్ సినిమా రైటర్లలో ఒకడిగా పేరు సంపాదించారు విజయేంద్ర ప్రసాద్. తెలుగులో బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి, సింహాద్రి, మగధీర, బాహుబలి లాంటి చిత్రాలతో ఆయన కీర్తి ఏ స్థాయికి చేరిందో తెలిసిందే. హిందీలో భజరంగి, భాయిజాన్, మణికర్ణిక లాంటి సినిమాలతో బాలీవుడ్లోనూ ఆయన సత్తా చాటుకున్నారు. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ పాన్ ఇండియా మూవీతో పాటు హిందీలో ‘సీత’ అనే ప్రెస్టీజియస్ ప్రాజెక్టుకు కూడా ఆయనే రచయిత. ఐతే రైటర్‌గా ఇంత గొప్ప ట్రాక్ రికార్డున్న విజయేంద్ర.. దర్శకుడిగా మాత్రం సఫలం కాలేకపోయారు. ఆయన డైరెక్ట్ చేసిన తొలి సినిమా ‘శ్రీకృష్ణ 2006’ ఫ్లాప్ అయింది. తర్వాత నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ‘రాజన్న’ పర్వాలేదనిపించింది. చివరగా ఆయన తీసిన ‘శ్రీవల్లి’ పెద్ద డిజాస్టర్ అయింది. దీంతో మళ్లీ ఆయన మెగా ఫోన్ పట్టలేదు. కాగా దర్శకుడిగా తండ్రి చివరి సినిమాను చూసిన రాజమౌళి.. ఆయన దర్శకత్వం చేయడానికి పనికి రాడు అనేశాడట. ‘ఆలీతో సరదాగా’ ప్రోగ్రాంలో ఆయనీ విషయాన్ని వెల్లడించాడు. ‘రాజన్న’ సినిమా చూసి.. తెలుగులో టాప్ డైరెక్టర్లకు దీటుగా ఈ చిత్రాన్ని డీల్ చేశారంటూ విజయేంద్...

ఆనందయ్య మందును నమ్ముతా-బాలయ్య

కరోనా నివారణ, చికిత్స కోసం ఆయుర్వేద మందు తయారు చేసి రోగులకు ఉచితంగా అందజేస్తున్న నెల్లూరు కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య గురించి గత రెండు మూడు వారాలుగా ఎంత చర్చ నడుస్తోందో తెలిసిందే. ఆయన మందు అద్భుతంగా పని చేస్తోందంటూ ఎంతో మంది వీడియోలు పెడుతున్నారు. కొందరు రాజకీయ నేతలు ఆయనకు మద్దతుగా ప్రకటనలు ఇస్తున్నారు. అదే సమయంలో శాస్త్రీయత లేకుండా, ఎలాంటి పరీక్షలు లేకుండా, నిపుణులు నిర్ధారించకుండా ఇలా ఇష్టానుసారం మందులిచ్చేయడం ఏంటి అనే ప్రశ్నలు సంధిస్తున్నారు మిగతా వాళ్లు. ప్రస్తుతం ఆనందయ్య మందుపై పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఆనందయ్యకు నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మద్దతు పలకడం విశేషం. ఆయన మందుపై తనకు నమ్మకం ఉందంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. శుక్రవారం ఎన్టీఆర్ జయంతి అన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించిన ఆయన.. ఆనందయ్య మందు గురించి మీడియా వాళ్లు అడిగితే సమాధానం చెప్పాడు. తనకు ఆనందయ్య మందు మీద నమ్మకం ఉందని, ఆయుర్వేదాన్ని తాను నమ్ముతానని బాలయ్య అన్నాడు. భారత దేశ ఆయుర్వేదానికి గొప్ప చరిత్ర ఉందని.. క్రీస్తు పూర్వంలోనే సుశ్రుతుడు అనే శస్త్రచికిత్స న...

పాత వీడియో వైరల్.. చిక్కుల్లో ఆ నటుడు

బాలీవుడ్లో విభిన్న పాత్రలతో ఆకట్టుకున్న నటుడు రణదీప్ హుడా. ఇటీవలే విడుదలైన సల్మాన్ ఖాన్ సినిమా ‘రాధె’లో అతను విలన్ పాత్రలో ఆకట్టుకున్నాడు. అంతకుముందు వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబయి, సాహెబ్ బివి ఔర్ గ్యాంగ్ స్టర్, హైవే లాంటి సినిమాలతో అతను మెప్పించాడు. ఈ నటుడు ఇప్పుడు అనుకోని విధంగా పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. అతణ్ని అరెస్ట్ చేయలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమం నడుస్తుండటం గమనార్హం. ఇందుక్కారణం గతంలో జరిగిన ఒక కామెడీ టాక్ షోలో భాగంగా అతను మాయావతి మీద జోక్ పేల్చడమే. అది కామెడీ షో కావడంతో రణదీప్.. ఒక సెక్సిస్ట్ జోక్ వేశాడు. కొంచెం వల్గారిటీ ఉన్న ఆ జోక్‌ను ఇక్కడ ప్రస్తావించడానికి ఇబ్బందే. ఐతే రణదీప్ జోక్ పేల్చింది ఒక కామెడీ షోలో కాబట్టి దీన్ని ఆ కోణంలోనే చూడాలి. అన్నింటికీ మించి ఇది కొత్త వీడియో కాదు. ఐతే ఎవరో ఒక నెటిజన్.. ఈ వీడియోను బయటికి తీసి ఇప్పుడు పోస్ట్ చేస్తూ ట్విట్టర్లో విరుచుకుపడింది. దాన్ని మిగతా వాళ్లు వైరల్ చేశారు. చూస్తుండగానే ఆ వీడియో ట్విట్టర్లో ట్రెండ్ అయిపోయింది. అంతే కాక.. #Arrestrandeephooda అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టారు. అది ఇండియాలో టాప్‌లో ట్రెండ్ అవుతుండటం గమన...

పిక్ టాక్: కాజల్ రివర్స్ ఎటాక్

హీరోయిన్లు 30 ప్లస్‌లో పడ్డాక గ్లామర్ మెయింటైన్ చేయడం అంత తేలిక కాదు. 20-25 ఏళ్ల మధ్య కళ్లు చెదిరే అందంతో ఆకట్టుకునే హీరోయిన్లు.. ఆ తర్వాత ఉన్నట్లుండి గ్లో కోల్పోతుంటారు. షేపవుట్ అవుతుంటారు. పేర్లెందుకు కానీ.. టాలీవుడ్లో చాలామంది స్టార్ హీరోయిన్లు ఇలా ఒక వయసు దాటాక ఆకర్షణ కోల్పోయిన వాళ్లే. ఐతే 30 ప్లస్‌లోకి వచ్చాక కూడా గ్లామర్ మెయింటైన్ చేస్తూ కుర్రాళ్లకు కిక్కిస్తున్న హీరోయిన్లు కొద్దిమందే. అందులో కాజల్ అగర్వాల్ కచ్చితంగా ఉంటుంది. మరీ చందమామ, మగధీర సినిమాల్లో మాదిరి ఆమె మెరిసిపోతోంది అనలేం కానీ.. ఇప్పటికీ తోటి హీరోయిన్లతో పోలిస్తే పర్ఫెక్ట్ ఫిగర్ మెయింటైన్ చేస్తూ వావ్ అనిపిస్తూనే ఉంది. ఈ మధ్య బ్లూ కలర్ మిడ్డిలో ఆమె ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలోకి వచ్చాయి. అందులో కాజల్ అందానికి అభిమానులు ఫిదా అయిపోయారు. పెళ్లవుతున్న టైంలో కాజల్ కొంచెం ఆకర్షణ కోల్పోయినట్లు కనిపించింది. ఐతే అది లాక్ డౌన్ టైం. సినిమాల్లో చేయట్లేదు. అందుకే కొంచెం మెయింటైనెన్స్ తగ్గించిందేమో. కానీ గత కొన్ని నెలల్లో మళ్లీ కాజల్ అందం పెరుగుతూ వస్తోంది. తాజాగా చందమామ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్‌ చల్ చేస్తోంది. ఇందులో కాజల్‌న...

వైరముత్తూ.. ఇదేం పని?

ఇంతకుముందు వైరముత్తు పేరెత్తితే తమిళులు అంత గొప్ప కవి, గేయ రచయిత తమ వాడని గర్వపడేవాళ్లు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి మారిపోయింది. ‘మీ టూ’ మూమెంట్ మొదలయ్యాక గాయని చిన్మయి, తదితరులు వైరముత్తు మీద చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆయన ఇమేజ్ బాగానే డ్యామేజ్ అయింది. వైరముత్తు మీద కేసులేమీ నమోదు కాలేదు. ఆయనపై ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. అయినా సరే.. జనాల దృష్టిలో ఆయన బాగానే చెడు అయ్యారు. ఒకరో ఇద్దరో అయితే ఓకే కానీ.. రెండంకెల సంఖ్యలో అమ్మాయిలు ఆయనపై ఆరోపణలు చేశారు. చిన్మయి తన వాదనల్ని చాలా బలంగానే వినిపించింది.ప్రతి దానికీ సాక్ష్యాలు తెచ్చి చూపించలేదు కానీ.. తను చెప్పిన ఉదంతాల గురించి వింటుంటే వైరముత్తులో జనాలకు తెలియని కోణం ఉందనే అనిపించింది చాలామందికి. ఇదిలా ఉంటే.. ఇప్పుడు వైరముత్తు చేసిన చేపట్టిన ఒక ప్రాజెక్టు విమర్శల పాలవుతోంది. ‘నాట్పదు తెరల్’ పేరుతో వంద పాటల ప్రాజెక్టులో వైరముత్తు భాగమయ్యారు. ఇందులో భాగంగా ఆయన వంద ప్రేమ గీతాలు రాస్తారు. ప్రతి పాటలోనూ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ నేపథ్యంలో వీడియో సాంగ్ రూపొందించి రిలీజ్ చేస్తారు. ఈ క్రమంలో ముందుగా ‘ఎన్ కాదలా’ పేరుతో ఒక వీడియో సాంగ్ రిలీజ్ చేశా...

చిరు వెర్సస్ ఎన్టీఆర్.. ఆక్సిజన్ వార్

కరోనా సెకండ్ వేవ్‌లో చాలామంది వైరస్ బాధితులకు ఆక్సిజన్ అత్యవసరమైంది. కానీ ఆసుపత్రుల్లో ఉన్న నిల్వలు బాధితులకు ఏమాత్రం సరిపోలేదు. చాలా చోట్ల సమయానికి ఆక్సిజన్ దొరక్క ప్రాణాలు పోయాయి. ఎన్నో ఘోరాలు చూశాం. ప్రభుత్వాల వైఫల్యం కారణంగా దేశవ్యాప్తంగా ఎన్నో దారుణాలు జరిగాయి. ఐతే కొంచెం ఆలస్యంగా అయినా ప్రభుత్వాలు మేలుకొన్నాయి. అలాగే స్వచ్ఛందం సంస్థలు, సెలబ్రెటీలు ముందుకొచ్చి పెద్ద ఎత్తున ఆక్సిజన్ ట్యాంకర్లు, కాన్సంట్రేటర్లను సిద్ధం చేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెట్టేలా వివిధ ప్రాంతాల్లో ఆక్సిజన్ ట్యాంకుల నిర్మాణం జరుగుతోంది. ఆక్సిజన్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి తన వంతుగా ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నారు. ఆయన్ని చూసి వేరే వాళ్లు కూడా కదులుతున్నారు. ఐతే ఈ విషయంలో కూడా మేం గొప్ప అంటే మేం గొప్ప అని ఫ్యాన్ వార్స్ తప్పట్లేదు సామాజిక మాధ్యమాల్లో. చిరు చేస్తున్న మంచి పనిని పొగడకుండా.. ఆయన ఎక్కువ ప్రచారం చేసుకుంటున్నాడని, పెడుతున్న ఖర్చును ఎక్కువ చేసి చూపిస్తున్నారని యాంటీ ఫ్యాన్స్ నెగెటివిటీని స్ప్రెడ్ చేసే ప్ర...

కుర్ర కమెడియన్ కుమ్మేశాడు

తెలుగు ప్రేక్షకులకు దశాబ్దాల నుంచి అలవాటైన సంప్రదాయ తెలుగు యాసలతో కామెడీ చేస్తే ఇప్పుడు నవ్వులు పండట్లేదు. ఇప్పటిదాకా తెలుగు సినిమాల్లో పెద్దగా ఎవరూ ఎక్స్‌పోజ్ చేయని యాసను తీసుకొస్తే ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తోంది. ఇలాంటి యాసకు మంచి కామెడీ టైమింగ్ కూడా తోడైతే ఫన్ గ్యారెంటీ. సప్తగిరి నెల్లూరు, చిత్తూరు జిల్లాల యాసలో కామెడీ చేస్తే చాలా కొత్తగా అనిపించి ప్రేక్షకులు బాగా ఎంటర్టైన్ అయ్యారు. ఇక రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి లాంటి వాళ్లు అర్బన్ తెలంగాణ యాసతో మెప్పించారు. ఈ కోవలో భలేగా నవ్విస్తున్న యువ కమెడియన్ సుదర్శన్. పైన చెప్పుకున్న కమెడియన్లతో పోలిస్తే ఇతనంత పాపులర్ కాదు. చేసిన సినిమాలు మరీ ఎక్కువేమీ కాదు. పేరు ఇంకా నోటెడ్ అవ్వలేదు. ఐతే తనకు చిన్న పాత్ర ఇచ్చినా.. నెల్లూరు యాసలో డైలాగులు చెబుతూ, నేచురల్‌గా యాక్ట్ చేస్తూ భలేగా నవ్విస్తాడు సుదర్శన్. ఈ యంగ్ కమెడియన్‌కు ఇప్పుడు కెరీర్లోనే బెస్ట్ అనదగ్గ రోల్ పడింది. అతను తాజాగా అమేజాన్ ప్రైమ్‌లో రిలీజైన ‘ఏక్ మిని కథ’లో కీలక పాత్ర చేశాడు. హీరో తర్వాత అంత స్క్రీన్ టైం ఉన్న క్యారెక్టర్ ఇది. తొలి సన్నివేశంతో మొదలుపెడితే.. చివరి వరకు సుదర్శన్.. బ...

ఆ హీరోను మళ్లీ తీసేశారు

ప్యార్ కా పంచనామా, సోనూ కే టిటు కీ స్వీటీ లాంటి చిత్రాలతో బాలీవుడ్లో మంచి గుర్తింపు సంపాదించిన యువ కథానాయకుడు కార్తీక్ ఆర్యన్.. ఈ మధ్య ఓ నెగెటివ్ అప్‌డేట్‌తో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. కరణ్ జోహార్ నిర్మాణంలో ‘దోస్తానా 2’ లాంటి భారీ చిత్రం నుంచి అతను అనూహ్యంగా తప్పుకున్నాడు. ఈ సినిమాకు సంబంధించి అతడిపై 20 రోజులకు పైగా షూటింగ్ జరిపారు. ఐతే స్క్రిప్టు విషయంలో అభ్యంతరాలు చెప్పడం, మరేవో కారణాలతో అతణ్ని ఈ చిత్రం నుంచి సాగనంపేశాడు కరణ్. సినిమా మధ్యలో ఇలా హీరోను తప్పించడం వల్ల కోట్లు నష్టం వాటిల్లుతున్నప్పటికీ.. కరణ్ తగ్గలేదు. కార్తీక్ తీరు పట్ల ఆయనకు అంతగా కోపం వచ్చింది. అదేదో అనుకోకుండా జరిగిపోయింది, కార్తీక్ ఇక జాగ్రత్తగా ఉంటాడని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు మరో పెద్ద సినిమా నుంచి అతను బయటికొచ్చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. షారుఖ్ ఖాన్ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బేనర్లో తెరకెక్కుతున్న ‘ఫ్రెడ్డీ’ సినిమాకు కూడా కార్తీక్ ఆర్యన్ దూరమయ్యాడు. ఈ సినిమా నుంచి అతణ్ని తప్పించారా.. తనే బయటికొచ్చేశాడా అన్నదానిపై స్పష్టత లేదు. ఈ సినిమా స్క్రిప్టు విషయంలోనూ కార్తీక్ అభ్యంతరాలు చెప్పడ...

ఆమె రేంజ్ ఇలా పడుతోందేంటి?

మూడేళ్ల కిందట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘అజ్ఞాతవాసి’, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో ‘నా పేరు సూర్య’ లాంటి భారీ చిత్రాల్లో నటించిన కథానాయిక అను ఇమ్మాన్యుయెల్. తెలుగులో చిన్న సినిమాలతో ప్రయాణం మొదలుపెట్టినప్పటికీ.. తక్కువ వ్యవధిలో బడా స్టార్ల సరసన భారీ చిత్రాల్లో నటించిందామె. ఆ రెండు చిత్రాల మీదా భారీ అంచనాలుండటంతో అవి హిట్టయితే అను రేంజే మారిపోతుందని అంతా అనుకున్నారు. కానీ ‘అజ్ఞాతవాసి’, ‘నా పేరు సూర్య’ పెద్ద డిజాస్టర్లయి అనుకు నెగెటివ్ ఇమేజ్ తెచ్చిపెట్టాయి. నాగచైతన్య సరసన చేసిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ సైతం నిరాశకు గురి చేసింది. ఆ తర్వాత ఆమెను తమ సినిమాల్లోకి తీసుకోవడానికి దర్శక నిర్మాతలు జడిశారు. దీంతో ఈ మలయాళ కుట్టి కెరీర్ తలకిందులు అయిపోయింది. కనీసం మిడ్ రేంజ్ స్టార్లకు జోడీగా కూడా ఆమెకు అవకాశాలు దక్కలేదు. చాలా తక్కువ వ్యవధిలో ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. చివరగా అను తెలుగులో చేసిన సినిమా ‘అల్లుడు అదుర్స్’. అందులో హీరో బెల్లంకొండ శ్రీనివాస్. పవన్, బన్నీ లాంటి స్టార్ల సరసన చేసిన రెండేళ్లకే అను.. శ్రీనివాస్‌కు జోడీగా చేయాల్సి రావడం, పైగా ఆ సినిమాలో ఆమె లీడ్ హీరో...

ఒక సినిమాకు 13 టీజ‌ర్లా?

బ్ర‌హ్మాస్త్ర‌.. బాలీవుడ్‌కు ఓ బాహుబ‌లి కాగ‌ల‌ద‌ని అంచ‌నాలున్న భారీ చిత్రం. క‌ర‌ణ్ జోహార్ నిర్మాణంలో అయాన్ ముఖ‌ర్జీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. రెండు భాగాలుగా తెర‌కెక్కనున్న ఈ సినిమాకు దాదాపు రూ.300 కోట్ల బ‌డ్జెట్ కేటాయించిన‌ట్లు వార్త‌లొచ్చాయి. రెండేళ్ల కింద‌టే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్ల‌గా.. చిత్రీక‌ర‌ణ‌లో జాప్యం, క‌రోనా, ఇత‌ర కార‌ణాల వ‌ల్ల ఫ‌స్ట్ పార్ట్ రిలీజ్ ఆల‌స్య‌మైంది. ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఈ ఏడాది చివ‌ర్లో లేదా వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్ధంలో బ్ర‌హ్మాస్త్ర‌-1ను రిలీజ్ చేయాల‌నుకుంటున్నారు. కొవిడ్ ఉద్ధృతి త‌గ్గాక రిలీజ్ డేట్ ప్ర‌క‌టించాల‌నుకుంటున్నారు. కాగా సినిమా పూర్తి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉండ‌గా.. కొంచెం ముందుగానే ప్ర‌మోష‌న్ హ‌డావుడి మొద‌లుపెట్టాల‌నుకుంటున్నారు. బాలీవుడ్లో సినిమాల ప్ర‌మోష‌న్ కోసం ఒక బ‌డ్జెట్ కేటాయించి, ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం ప‌బ్లిసిటీ చేస్తారు. బ్ర‌హ్మాస్త్ర విష‌యంలో ఈ ప్ర‌ణాళిక‌లు భారీగానే ఉన్నాయ‌ట‌. ఏకంగా ఈ సినిమా కోసం 13 షార్ట్ టీజ‌ర్లు సిద్ధం చేస్తున్నార‌ట‌. సినిమా రిలీజ‌య్యేలోపు స‌మ‌యానుకూలంగా ఈ టీజ‌ర్ల‌ను రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ట...

మ‌హేష్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్

మే 31వ తేదీని చాలా ప్ర‌త్యేకంగా భావిస్తాడు మ‌హేష్ బాబు. ఎందుకంటే అది అత‌డి తండ్రి, సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. తాను హీరో అయిన ద‌గ్గ‌ర్నుంచి తండ్రి పుట్టిన రోజు నాడు త‌న సినిమాల‌కు సంబంధించి ఏదో ఒక కానుక ఇవ్వ‌డం మ‌హేష్‌కు అల‌వాటు. గ‌త ఏడాది మ‌హేష్‌ కొత్త చిత్రం స‌ర్కారు వారి పాట అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ప్రి లుక్ రిలీజ్, టైటిల్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. ఐతే క‌రోనా కార‌ణంగా ఈ సినిమా ప‌ట్టాలెక్క‌డంలో ఆల‌స్యం జ‌రిగింది. ఈ ఏడాది కృష్ణ పుట్టిన రోజుకు క‌నీసం టీజ‌ర్ అయినా వ‌ద‌లాల‌ని అనుకుంది చిత్ర బృందం. గ‌త నెల‌లోనే ఈ దిశ‌గా నిర్ణ‌యం జ‌రిగింది. కంటెంట్ కూడా రెడీ చేసే ప్ర‌య‌త్నం జ‌రిగింది. కానీ మేలో క‌రోనా ఉద్ధృతి బాగా పెరిగిపోవ‌డం.. వైర‌స్ ప్ర‌భావం కొంచెం త‌గ్గిన‌ప్ప‌టికీ ప‌రిస్థితులు ఆశాజ‌న‌కంగా ఏమీ లేక‌పోవ‌డంతో చిత్ర బృందం ఆలోచ‌న మార్చుకుంది. ఈ నెల 31న స‌ర్కారు వారి పాట టీం నుంచి ఎలాంటి కానుకలూ ఉండ‌బోవ‌ని తేలిపోయింది. ఈ మేర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న కూడా ఇచ్చేశారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో స‌ర్కారు వారి పాట గురించి అప్ డేట్స్ ఇవ్వ‌డం స‌రి కాద‌ని చిత్ర బృందం నిర్ణ‌యించింద‌ని.. కాబ‌ట్టి మే 3...

స‌ల్మాన్ కేసు వేసింది రివ్యూపై కాద‌ట‌

బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్.. క‌మ‌ల్ ఆర్.ఖాన్ అనే క్రిటిక్ మీద ప‌రువు న‌ష్టం దావా వేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే జీ5, జీప్ల‌స్ ఓటీటీ ద్వారా విడుద‌లైన‌ త‌న కొత్త చిత్రం గురించి క‌మ‌ల్ ఇచ్చిన వీడియో రివ్యూ చూసి ఆగ్ర‌హించి స‌ల్మాన్ అత‌డికి నోటీసులు ఇచ్చిన‌ట్లుగా మీడియాలో వార్త‌లొచ్చాయి. ఐతే సినిమాకు స‌మీక్ష ఇవ్వ‌డంలో త‌ప్పేముంది, ఆ మాత్రానికే ప‌రువు న‌ష్టం దావానా అన్న సందేహాలు రావ‌డం స‌హ‌జం. ఆ మాట‌కొస్తే రాధె సినిమా మీద చాలామంది క్రిటిక్స్ నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు. సినిమాను ఏకిప‌డేశారు. మ‌రి క‌మ‌ల్ ఆర్.ఖాన్ మీద మాత్ర‌మే స‌ల్మాన్ టీం ఇలా దావా వేయ‌డం ఏంట‌న్న‌ది ప్ర‌శ్న‌. దీనికి స‌మాధానం స‌ల్మాన్ స‌న్నిహిత వ‌ర్గాలు మీడియాకు వెల్ల‌డించాయి. క‌మల్.ఆర్.ఖాన్ బాలీవుడ్ స్టార్ల గురించి త‌న స‌మీక్ష‌ల్లో ఇష్టానుసారం వ్యాఖ్య‌లు చేస్తుంటాడు. మొద‌ట్నుంచి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తోనే అత‌ను సోష‌ల్ మీడియాలో ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. సినిమా స‌మీక్ష‌ల్లోనూ హీరోల‌ను వ్య‌క్తిగ‌తంగా దూషించ‌డం అత‌డికి అల‌వాటు. రాధె రివ్యూలో కూడా స‌ల్మాన్‌ను ఉద్దేశించి చోర్ అనడం అత‌డి టీం గుర్తించ...

సమీక్ష – ఏక్ మినీ కథ

కాన్సెప్ట్ వుంటే చాలు కథ అల్లేయచ్చు అని అనుకోవడం ఈ మధ్య సినిమా జనాలకు బాగా అలవాటైపోయింది. కానీ ఆ కాన్సెప్ట్ చుట్టూ కథ కన్నా కథనం తయారు చేయడం అన్నది మాత్రం కత్తి మీద సాము. పైగా ఆ కాన్సెప్ట్ కాస్త ‘అడల్ట్’ వ్యవహారం అయితే ఇక చెప్పనక్కరలేదు. ఇక్కడ ఇంకో సమస్య కూడా వుంది. అడల్ట్ మూవీని కేవలం ఎ సర్టిఫికెట్ సినిమాగా తీసేయాలి అనుకుంటే సమస్య యేమీ లేదు. అలా కాకుండా ఫ్యామిలీలు కూడా చూడాలి. భళ్లున కొందరు, ముసిముసిగా మరి కొందరు నవ్వుకోవాలి అంటే మాత్రం ఇంకా సమస్యే. ఇన్ని విషయాలను ఒకే సారి డీల్ చేయడం అంత వీజీ కాదు. యువి కాన్సెప్ట్ బ్యానర్ మీద వంశీ, విక్రమ్ నిర్మించిన ‘ఏక్ మినీ కథ’ గురించే ఇదంతా. దర్శకుడు మేర్లపాక గాంధీ తన స్టయిల్ లో తయారు చేసిన స్క్రిప్ట్ ఇది. ఈ స్క్రిప్ట్ ఎలా వుందీ అంటే గోచీకి పెద్ద..పంచెకు చిన్న అన్నట్లుగా. ఓ కుర్రాడు సంతోష్ (సంతోష్ శోభన్) తన అంగం చిన్నదిగా వుంది అని చిన్నప్పటి నుంచి ఫీలవుతూ వుంటాడు. దాని వల్ల రాబోయే విపరిణామాలు ఎలా వుంటోయో అని చిలవలు పలవలుగా ఊహించుకుని ఫీలైపోతూ వుంటాడు. ఇవన్నీ ఎందుకోచ్చిన తంటాలు అని పెళ్లికి దూరంగా వుందాం అనుకుంటాడు. కానీ అనుకోకుండా ఓ అమ్మాయి (కావ...

క‌ళ్యాణ్ రామ్ సైలెంట్ స్ట్రోక్

ఒక అడుగు ముందుకేస్తే.. నాలుగ‌డుగులు వెన‌క్కి అన్న‌ట్లు సాగుతోంది నంద‌మూరి క‌ళ్యాణ్ కెరీర్ ఆరంభం నుంచి అత‌నొక్క‌డే, ప‌టాస్, 118.. ఇవి మాత్ర‌మే క‌ళ్యాణ్ రామ్ కెరీర్లో పెద్ద హిట్లు. ఈ సినిమాల‌కు ముందు, త‌ర్వాత అత‌డిది ప‌రాజ‌య ప‌రంప‌రే. ఒక హిట్టు కొట్టాడ‌ని సంతోషించే లోపు రెండు మూడు డిజాస్ట‌ర్లు డెలివ‌ర్ చేస్తాడు. రెండేళ్ల కింద‌ట‌ 118తో స‌క్సెస్ సాధించాక గ‌త ఏడాది ఎంత మంచివాడ‌వురాతో గ‌ట్టి ఎదురు దెబ్బ తిన్న సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత కొత్త సినిమా మొద‌లుపెట్ట‌డానికి చాలా టైం తీసుకున్నాడ‌త‌ను. ఈ మ‌ధ్య మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాణంలో రాజేంద్ర అనే కొత్త ద‌ర్శ‌కుడితో కొన్ని నెల‌ల కింద‌ట ఓ సినిమాను మొద‌లుపెట్టిన సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం క‌ళ్యాణ్ రామ్ చేతిలో ఉన్న సినిమా ఇదొక్క‌టే అని అంతా అనుకుంటున్నారు. కానీ ఉన్న‌ట్లుండి క‌ళ్యాణ్ రామ్ నుంచి కొత్త చిత్రం ప్ర‌క‌ట‌న వ‌చ్చిందిప్పుడు. ఐతే ఈ సినిమా త్వ‌ర‌లో మొద‌లు కాబోయేది కాదు. ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న చిత్ర‌మిది. క‌ళ్యాణ్ రామ్ సొంత సంస్థ నంద‌మూరి తార‌క‌రామారావు ఆర్ట్స్ బేన‌ర్లో ఇది తెర‌కెక్కింది. వ‌శిష్ఠ్ అనే కొత్త ద...

దృశ్యం-2.. ప్లాన్ మారిపోయిందా?

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో శరవేగంగా సినిమాలు చేసుకుపోయే వాళ్లలో విక్టరీ వెంకటేష్ పేరు ముందుగా చెప్పుకోవాలి. ఆయన కొన్ని నెలల్లోనే సినిమాలు అవగొట్టేస్తుంటారు. తరచుగా రీమేక్స్ చేయడం వల్ల కూడా ఈ స్పీడు చూపించగలుగుతుంటారు వెంకీ. తాజాగా ఆయన మలయాళ చిత్రం ‘దృశ్యం-2’ రీమేక్‌ను నెలన్నర రోజుల్లో ముగించేసిన సంగతి తెలిసిందే. దీనికి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి కావస్తున్నాయి. ఐతే దీని కంటే ముందు ‘నారప్ప’ పూర్తయిన నేపథ్యంలో ముందు దాన్ని రిలీజ్ చేసి, ఆ తర్వాత ‘దృశ్యం-2’ సంగతి చూడాలని నిర్మాత సురేష్ బాబు అనుకున్నాడు. మధ్యలో ‘దృశ్యం-2’ ఓటీటీలో వస్తుందన్న ప్రచారం జరగ్గా అలాంటిదేమీ లేదని కూడా ఆయన స్పష్టం చేశాడు. ఐతే థియేటర్లలోనే రిలీజ్ చేయాలనుకుని, తర్వాత ఆలోచన మార్చుకుని ఓటీటీల్లో విడుదల చేసిన సినిమాలు లేకపోలేదు. వి, నిశ్శబ్దం లాంటి సినిమాలే ఇందుకు ఉదాహరణ. ‘దృశ్యం-2’ విషయంలోనూ ఇప్పుడు సురేష్ బాబు ఆలోచనలు మారుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. థియేటర్లు ఆగస్టుకు కానీ తెరుచుకునే అవకాశం లేకపోవడం, పైగా 100 శాతం ఆక్యుపెన్సీకి ఇంకా సమయం పట్టేలా ఉండటం, ‘నారప్ప’ను రిలీజ్ చేసి గ్యాప్ ఇచ్చి ‘దృశ్...

ఆ హీరోయిన్ అందం తిరిగొచ్చింది

రైజా విల్సన్.. నెల కిందట సోషల్ మీడియాలో మార్మోగిన పేరు. ఈ తమిళ నటి తన అందానికి మెరుగులు దిద్దుకునేందుకు ఒక డెర్మటాలజిస్టును సంప్రదించడం.. ఆమె చేసిన ఓ చర్మ చికిత్స వికటించి రైజా విల్సన్ అంద విహీనంగా తయారు కావడం తెలిసిందే. కంటి కింది భాగం వాచిపోయి.. ముఖారవిందం దెబ్బ తిన్న స్థితిలో రైజా పోస్ట్ చేసిన వీడియో సంచలనం రేపింది. తనకు సదరు డెర్మటాలజిస్టు చేసిన చికిత్స వల్లే ఇలా జరిగిందంటూ ఆమె బోరున విలపించింది. అవసరం లేకపోయినా ఆ వైద్యురాలు ఒత్తిడి చేసి ఈ చికిత్స చేశారని, ఫలితంగా తాను అందవిహీనంగా మారినట్టు చెప్పుకొచ్చింది. తనకు జరిగిన నష్టానికి కోటి రూపాయల నష్టపరిహారంతో చికిత్సకు తీసుకున్న డబ్బును కూడా తిరిగి చెల్లించాలని ఆమె డిమాండ్ చేసింది. దీనిపై ఆ లేడీ డాక్టర్‌ కూడా దీటుగానే స్పందించింది. తన పేరును దెబ్బ తీసినందుకు రైజాపై రూ.5 కోట్లకు పరువునష్టం దావా వేసింది. ఈ వ్యవహారంలో తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఇద్దరూ రాజీకి వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు జనాలు. ఐతే ఈ గొడవ తర్వాత నెల రోజులకు పైగా కనిపించకుండా పోయిన రైజా.. ఎట్టకేలకు మళ్లీ సోషల్ మీడియాలోకి వచ్చింది. రైజా విల్సన్‌ ముఖం ఇప్పుడు పూర్వస్థితిక...

ఆర్ఆర్ఆర్ డీల్ వెనుక అస‌లు క‌థ‌

బాహుబ‌లి త‌ర్వాత ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి రూపొందిస్తున్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్ డిజిట‌ల్ హ‌క్కుల డీల్ పూర్త‌యింద‌ని, రూ.325 కోట్ల రికార్డు రేటుకు జీ నెట్ వ‌ర్క్ వాళ్లు రైట్స్ తీసుకున్నార‌ని ఇటీవ‌ల ఓ వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఐతే ఇప్ప‌టిదాకా అది ప్ర‌చారం మాత్ర‌మే కాగా.. ఇప్పుడు ఈ డీల్ గురించి అధికారిక స‌మాచారం బ‌య‌టికి వ‌చ్చింది. ఐతే సోష‌ల్ మీడియాలో జ‌రిగిన ప్ర‌చారం కొంత వ‌ర‌కే నిజం. ఈ డీల్ పూర్తి విశేషాలు ఇప్పుడు వెల్ల‌డ‌య్యాయి. ఆర్ఆర్ఆర్ హిందీ వెర్ష‌న్ థియేట్రిక‌ల్ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్న పెన్ మూవీస్ సంస్థ‌నే డిజిట‌ల్, శాటిలైట్ హ‌క్కుల‌న్నింటినీ క‌లిపి హోల్‌సేల్‌గా కొనేసింది. ఐతే వాళ్లు త‌ర్వాత ఆయా భాష‌ల‌కు, ఏరియాల‌కు తగ్గ‌ట్లు వేర్వేరుగా ఓటీటీలు, టీవీ ఛానెళ్ల‌తో ఒప్పందాలు చేసుకున్నారు. ఆ విశేషాల‌ను ఒక వీడియో ద్వారా బ‌య‌ట‌పెట్టారు. ఆర్ఆర్ఆర్ తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, కన్న‌డ వెర్ష‌న్ల‌ను జీ 5 ఓటీటీలో రిలీజ్ చేయ‌బోతున్నారు. కాగా హిందీ వెర్ష‌న్ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది. ఇక శాటిలైట్ హ‌క్కుల‌ను కూడా వేర్వేరు భాష‌ల్లో వేర్వేరు ఛానెళ్ల‌కు ఇచ్చ...

నాగార్జున‌.. 5 వేల ఏళ్ల వెన‌క్కి

హిందీలో ఎక్కువ సినిమాలు చేసి ఉత్తరాదిన మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న తెలుగు కథానాయకుల్లో నాగార్జున పేరు ముందుగా చెప్పుకోవాలి. గత రెండు దశాబ్దాల్లో ఆయన బాలీవుడ్లో పెద్దగా సినిమాలు చేయలేదు కానీ.. 90ల్లో ‘శివ’ సినిమాతో మొదలుపెట్టి ఖుదా గవా, ద్రోహి, అంగారే, క్రిమినల్ లాంటి హిందీ సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఐతే 2002లో ‘అగ్నివర్ష’ చేశాక నాగ్ మళ్లీ బాలీవుడ్ వైపు చూడలేదు. సుదీర్ఘ విరామం తర్వాత ఆయన ఇప్పుడు అక్కడ ‘బ్రహ్మాస్త్ర’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆయనది ఫుల్ లెంగ్త్ రోల్ కాదు. అరగంట నిడివితో ఆయన పాత్ర ఉంటుంది. ఈ సినిమా గురించి, తన పాత్ర గురించి ఇంతకుముందే మీడియాకు కొన్ని విశేషాలు వెల్లడించాడు నాగ్. ఇప్పుడు తాజాగా ఒక బాలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘బ్రహ్మాస్త్ర’ గురించి మరికొన్ని ముచ్చట్లు చెప్పాడు. ‘బ్రహ్మాస్త్ర’ 5 వేల ఏళ్ల కిందటి నేపథ్యంలో సాగే సినిమా అని నాగ్ చెప్పడం విశేషం. ఎంత పీరియడ్ మూవీ అయినా సరే.. కొన్ని వందల ఏళ్ల వెనుకటి నేపథ్యాన్ని తీసుకుంటూ ఉంటారు దర్శకులు. కానీ ఏకంగా 5 వేల ఏళ్ల కిందటి బ్యాక్ డ్రాప్ అంటే ప్రేక్షకులను దర్శకుడు అయాన్ ముఖర్జీ ఓ కొత్...

షారుఖ్ ఖాన్ సినిమా మధ్యలో సల్మాన్

సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్‌ల అభిమానులు బయట, సామాజిక మాధ్యమాల్లో తెగ కొట్టేసుకుంటూ ఉంటారు కానీ.. నిజానికి ఈ ఇద్దరు సూపర్ స్టార్లు చాలా సన్నిహితంగా ఉంటారు. సినిమాల పరంగా ఒకరికొకరు సాయం కూడా చేసుకుంటూ ఉంటారు. ఒకప్పుడు ఇద్దరూ కలిసి మల్టీస్టారర్ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత ఒకరి సినిమాల్లో ఒకరు క్యామియోలు కూడా చేశారు. చివరగా సల్మాన్ నటించిన ‘ట్యూబ్ లైట్‌’లో షారుఖ్ క్యామియో చేస్తే.. షారుఖ్ చిత్రం ‘జీరో’లో సల్మాన్ మెరిశాడు. ఈ ఒరవడిని కొనసాగిస్తూ షారుఖ్ కొత్త సినిమా ‘పఠాన్’లో మరోసారి తళుక్కుమనబోతున్నాడట సల్మాన్. ఐతే ఈసారి అతడి పాత్ర రంగప్రవేశం చేసే వ్యవహారమే చాలా వేరుగా ఉండబోతోందట. సల్మాన్ ప్రస్తుతం ‘టైగర్-3’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై సినిమాలకు ఇది కొనసాగింపు చిత్రమన్న సంగతి తెలిసిందే. ‘టైగర్’ చిత్రాల ఫ్రాంఛైజీ యశ్ రాజ్ ఫిలిమ్స్ వాళ్లదే అన్న సంగతి తెలిసిందే. ఆ సంస్థలోనే షారుఖ్ సినిమా ‘పఠాన్’ కూడా తెరకెక్కుతోంది. ‘వార్’తో బ్లాక్ బస్టర్ అందుకున్న సిద్దార్థ్ ఆనంద్ రూపొందిస్తున్న చిత్రమిది. అతను యశ్ రాజ్ ఫిలిమ్స్‌కు ఆస్థాన దర్శకుడి లాంటి వాడు. దీంతో అదే సంస్థలో త...

13 ఏళ్ల ముందు నాటి యాడ్.. ఇప్పుడు వైరల్

Image
శర్వానంద్ హీరోగా మారుతి తీసిన ‘మహానుభావుడు’ సినిమాలో హీరో పాత్ర దేన్ని ముట్టుకున్నా వెంటనే చేతులకు శానిటైజర్ రాసేసుకోవడం అందరికీ చిత్రంగా అనిపించింది. కానీ మూడేళ్లు తిరిగాక ఇండియాలో ప్రతి ఒక్కరూ ఇలా శానిటైజర్ రాసుకునే పరిస్థితి వచ్చింది. మారుతి అప్పుడే భవిష్యత్ దర్శనం చేయించాడంటూ అందరూ ‘మహానుభావుడు’ సినిమాలోని సన్నివేశాలను గుర్తు చేసుకోవడం చూశాం. కాగా ఇలాగే 13 ఏళ్ల ముందు వచ్చిన అడ్వర్టైజ్మెంట్లో ఇప్పుడు చూస్తున్న పరిస్థితులను చూపించడం విశేషం. అభిషేక్ బచ్చన్ మీద అప్పట్లో ఐడియా వాళ్లు తీసిన ‘వాట్ ఎన్ ఐడియా సర్ జీ’ యాడ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. అందులో ఒక యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం విశేషం. సరిగ్గా ఇప్పుడు చూస్తున్న పరిస్థితులే అప్పుడు ఆ యాడ్‌లో కనిపించడం విశేషం. ఆ యాడ్‌లో అభిషేక్ టీచర్ పాత్రలో కనిపిస్తాడు. ఓ పల్లెటూరి పేద అమ్మాయికి స్కూల్లో అడ్మిషన్ దొరక్క వెనక్కి వెళ్లిపోతుంటే.. ఆ అమ్మాయి ఉండే పల్లెటూరిలోని పిల్లలందరికీ మొబైల్ ఇంటర్నెట్ ద్వారా ఆన్ లైన్ పాఠాలు చెప్పించడం.. ఆ తర్వాత ఆ అమ్మాయి బెస్ట్ స్టూడెంట్‌గా అవార్డు అందుకోవడం.. ఈ ప్రకటనలో చూస్తాం. మధ్యలో ఇంట...

ఈషా రెబ్బా.. ఇది నెక్స్ట్ లెవెల్

తెలుగ‌మ్మాయి ఈషా రెబ్బా కెరీర్ ఆరంభంలో చేసిన అంత‌కుముందు ఆ త‌రువాత‌, బందిపోటు లాంటి సినిమాల్లో క‌నిపించిన లుక్స్‌కు, ప్ర‌స్తుతం ఆమె లుక్స్‌కు అస‌లేమాత్రం పోలిక క‌నిపించ‌దు. అప్ప‌టికి తెలుగు హీరోయిన్లంటే మ‌రీ ట్రెడిష‌న‌ల్ అనే ముద్ర‌కు త‌గ్గ‌ట్లే ఆమె క‌నిపించింది. కానీ త‌ర్వాతి కొన్నేళ్ల‌లో ఆమె అప్పీయ‌రెన్స్ మారుతూ వ‌చ్చింది. ఇప్పుడు ఉత్త‌రాది నుంచి దిగుమ‌తి అయిన‌ స్టార్ హీరోయిన్ల‌కు దీటుగా గ్లామ‌ర్ విందు చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈషా. సినిమాలను మించి బ‌య‌ట ఫొటో షూట్ల‌తో ఈషా త‌న సోష‌ల్ మీడియా ఫాలోవ‌ర్ల‌ను అల‌రిస్తూ ఉంటుంది. ఆమె ట్విట్ట‌ర్ అకౌంట్ ఫాలో అయ్యేవాళ్ల‌కు త‌ర‌చుగా గ్లామ‌ర్ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. ఆమె ఫొటో షూట్లు కొన్ని చూసి స్టార్ హీరోయిన్ల‌కు ఏం త‌క్కువ అంటూ కామెంట్లు చేస్తుంటారు నెటిజ‌న్లు. తాజాగా ఈషా షేర్ చేసిన ఫొటోలు చూస్తే గ్లామ‌ర్ డోస్ విష‌యంలో ఆమె నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లిపోయినట్లే క‌నిపిస్తోంది. లింగ‌రీ వేసుకుని క్లీవేజ్ అందాల‌ను ఆర‌బోస్తూ పార్కులో ప‌డుకున్న పోజుల‌తో ఉన్న ఈ ఫొటోలు ఈషా ఫాలోవ‌ర్ల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటున్నాయి. ఇప్పటిదాకా ఈషా చేసిన ఫొటో షూట్...

ఫ్యామిలీ మ్యాన్-2.. సెంటిమెంటును బ్రేక్ చేస్తుందా?

అటు ఇటుగా ఇంకో వారం రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది ‘ఫ్యామిలీ మ్యాన్-2’. ఇండియాలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన వెబ్ సిరీస్ ఇది అనడంలో సందేహం లేదు. రాజ్-డీకేల దర్శకత్వంలో అమేజాన్ ప్రైమ్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌‌ తొలి సీజన్ స్ట్రీమ్ అయిన కొన్ని నెలల నుంచి సెకండ్ సీజన్ గురించి ఊరిస్తూ వస్తున్నారు. కరోనా సహా కొన్ని కారణాల వల్ల ఆలస్యమైన రెండో సీజన్.. ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఐతే తమిళ టైగర్లను చెడుగా చూపించారని ఆరోపిస్తూ ఈ సిరీస్‌ను బ్యాన్ చేయాలనే డిమాండ్లు తమిళుల నుంచి వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి ఈ మేరకు లేఖలు కూడా వెళ్లాయి. మరి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఈ అడ్డంకులను అధిగమించి అనుకున్న ప్రకారమే జూన్ 4న ప్రైమ్‌లో ‘ఫ్యామిలీ మ్యాన్-2’ స్ట్రీమ్ అవుతుందనే అభిమానులు ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే ‘ఫ్యామిలీ మ్యాన్’ రెండో సీజన్ మీద ఉన్న అంచనాలను రాజ్-డీకే ఏ మేరకు అందుకుంటారన్నది ఇప్పుడు ప్రశ్న. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సీక్వెల్స్ అనుకున్న మేర ఆడిన దాఖలాలు తక్కువ. మెజారిటీ సీక్వెల్స్ అంచనాలను అందుకోలేదు. వెబ్ సిరీస్‌ల విషయంలోనూ ఇదే జరిగింది. ‘మీర్జాపూర్’ అం...

డబ్బులెక్కడివని సోనూ సూద్‌ను అడిగితే..

కరోనా టైంలో ఇండియాలోని సూపర్ స్టార్లందరినీ మించి పోయి రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూ సూద్. గత ఏడాది లాక్ డౌన్ పెట్టాక అష్ట కష్టాలు పడుతున్న వలస కార్మికులను వారి గమ్య స్థానాలకు చేర్చడంతో మొదలుపెట్టి అతను అనితర సాధ్యమైన స్థాయిలో సేవా కార్యక్రమాలు చేపట్టాడు. ఈ ఏడాది సెకండ్ వేవ్ టైంలో మరింతగా సేవా కార్యక్రమాలను విస్తరించాడు సోనూ. దేశవ్యాప్తంగా లక్షల మంది సాయం కోసం ప్రభుత్వాలను అడగడం మానేసి సోనూకు విజ్ఞప్తులు పెడుతుండటం గమనార్హం. అందులో సాధ్యమైనంత మందిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు సోనూ. మందులిస్తున్నాడు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఇస్తున్నాడు. ఏకంగా ఆక్సిజన్ ప్లాంటులే ఏర్పాటు చేస్తున్నాడు. అన్నీ కూడా ఉచితమే. ఐతే ఒక్క సోనూ ఇంతమందిని ఎలా ఆదుకోగలుగుతున్నాడు.. అతడి దగ్గర అన్ని డబ్బులెక్కడివి అనే సందేహాలు అందరినీ వెంటాడుతున్నాయి. ఓ ఇంటర్నేషనల్ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాడు సోనూ. తాను గత ఏడాది చేసిన సేవా కార్యక్రమాలు చూసి ఎంతోమంది స్ఫూర్తి పొందారని, వారిలో చాలామంది తనను సంప్రదించారని.. తాము ఇందులో భాగస్వాములవుతామని చెప్పారని సోనూ వెల్లడించాడు. తన మీద నమ్మకం...