Posts

Showing posts from July, 2021

పవన్ కోసం ‘దేవర’ టైటిల్

పవన్ కళ్యాణ్ పేరెత్తితే చాలు బండ్ల గణేష్‌కు పూనకాలు వచ్చేస్తాయి. స్టేజ్ ఎక్కినా.. మీడియా ముందు మాట్లాడినా.. అతను ఉద్వేగాన్ని ఆపుకోలేడు. మరీ అతి చేస్తాడు అని.. అంతగా భజన చేయాలా అని కామెంట్లు చేసినా అతను పట్టించుకునే రకం కాదు. తన అభిమానం తనది అంటాడు. గతంలో ‘గబ్బర్ సింగ్’ ఆడియో వేడుకలో పవన్‌ను ఆకాశానికెత్తేస్తూ బండ్ల చేసిన ప్రసంగం ఎంత వైరల్ అయిందో తెలిసిందే. పవన్ సైతం కడుపు చెక్కలయ్యేలా నవ్వాడు ఆ ప్రసంగం వింటూ. ఈ మధ్య ‘వకీల్ సాబ్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో అలాంటి స్త్రోత్రమే మరొకటి చేశాడు. ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా అంటూ బండ్ల ఇచ్చిన ఎలివేషన్లకు అభిమానుల నుంచి అదిరిపోయే స్పందన వచ్చింది. ఈ సందర్భంగా పవన్ నా ‘దేవర’ అంటూ కొత్త మాటను ప్రయోగించాడు బండ్ల. ఈ మధ్య ఎక్కడ చూసినా అదే మాట అంటున్నాడు. ఐతే పవన్ అభిమానులకు ‘దేవర’ అనే పదం బాగా నచ్చేసి.. దాన్ని పవన్‌తో బండ్ల చేయబోయే సినిమాకు టైటిల్‌గా పెట్టాలని డిమాండ్ చేస్తుండటం విశేషం. ట్విట్టర్లో బండ్లను ట్యాగ్ చేస్తూ వందల మంది అభిమానులు ‘దేవర’ టైటిల్ కోసం డిమాండ్ చేస్తున్నారు. సినిమా ఎప్పుడు తీస్తావో ఏంటో.. ముందు దాన్ని రిజిస్టర్ చేయించేయ్ అంటూ బండ్...

‘రీమేక్‌’ మోజుపై వెంకీని అడిగితే..

టాలీవుడ్లో రీమేక్‌కు పెట్టింది పేరైన స్టార్ హీరోల లిస్టు తీస్తే రాజశేఖర్ ముందు వరుసలో నిలుస్తారు. ఆ తర్వాత ఎక్కువగా రీమేక్‌ల్లో నటించి, ఘనవిజయాలు అందుకున్న హీరో విక్టరీ వెంకటేష్. చంటి, సుందరకాండ, సూర్యవంశం, రాజా, దృశ్యం, గురు లాంటి సూపర్ హిట్స్ చాలానే ఉన్నాయి వెంకీ కెరీర్లో. ఇప్పుడు ఆయన పూర్తి చేసిన రెండు చిత్రాలూ (నారప్ప, దృశ్యం-2) కూడా రీమేక్‌లే అన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడైతే తెలుగులో కథల కొరత ఉండేది. వైవిధ్యమైన కథలూ వచ్చేవి కావు. కానీ గత కొన్నేళ్లలో టాలీవుడ్ ఎంతో పురోగతి సాధించింది. ఒకప్పుడు మనవాళ్లు కథల కోసం ఎక్కువగా ఆధారపడ్డ కోలీవుడ్ వెనుకబడిపోతే.. మనోళ్లు వాళ్లను దాటి ముందుకెళ్లిపోయారు. వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నారు. మరి ఇలాంటి టైంలో కూడా రీమేక్‌లు చేయడమేంటి అనే ప్రశ్నలు తలెత్తుతుంటాయి. ‘నారప్ప’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన వెంకీ ముందు విలేకరులు ఇదే ప్రశ్న ఉంచితే ఆయన ఏమన్నారంటే.. ‘‘రీమేక్‌ల్లో నటించడానికి ప్రత్యేకమైన కారణం అంటూ ఏమీ లేదు. సినిమా నాకు బాగా నచ్చి ఉండొచ్చు. అలాగే అలాంటి పాత్రల్లో నటించే అవకాశం అంతకుముందు నాకు రాకపోవడం, ప్రేక్షకులకు మంచి కథ అందించాలని అన...

గోపిచంద్ సినిమాలో సీనియర్ హీరో!

ఒకప్పుడు హీరోగా ఎన్నో సినిమాలు చేసిన నటుడు రాజశేఖర్ ఆ తరువాత జోరు తగ్గించారు. ఆయన నటించిన సినిమాలన్నీ ప్లాప్ అవుతుండడంతో కాస్త బ్రేక్ తీసుకున్నారు. ‘గరుడ వేగ’ సినిమాలో హీరోగా నటించి హిట్టు సినిమా తన ఖాతాలో వేసుకున్నారు. ‘కల్కి’ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. ఏవరేజ్ అనిపించుకుంది. ఇదిలా ఉండగా.. మంచి పాత్ర దొరికితే మల్టీస్టారర్ సినిమాలతో పాటు విలన్ పాత్రలు చేయడానికి కూడా తను సిద్ధమని గతంలో రాజశేఖర్ ప్రకటించారు. హీరోగా మార్కెట్ పడిపోయిన సమయంలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రయత్నించాలనుకున్నారు. కానీ అలాంటి అవకాశాలు రాలేదు. నిజానికి ‘అఖండ’ సినిమాలో ముందుగా రాజశేఖర్ ను విలన్ గా తీసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ బోయపాటి తన ఫేవరెట్ యాక్టర్ జగపతిబాబునే తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఓ సినిమా కోసం రాజశేఖర్ ను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. హీరో గోపీచంద్-శ్రీవాస్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ పాత్ర కోసం రాజశేఖర్ ను తీసుకోవాలనుకుంటున్నారు. ఇది విలన్ రోల్ మాత్రం కాదట. కథను మలుపు తిప్పే కీలకపాత్రలో రాజశేఖర్ ను తీసుకోవాలనుకుంటున్నారు. కానీ రాజశేఖర్ హీర...

కాజల్, రెజీనా.. ఓ మల్టీస్టారర్

కెరీర్లో చాలా లేటుగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల మీద దృష్టిపెట్టింది కాజల్ అగర్వాల్. రెండేళ్ల కిందట తేజ దర్శకత్వంలో ఆమె ‘సీత’ అనే హీరోయిన్ ప్రధాన సినిమా చేసిన సంగతి తెలిసిందే. కానీ అది ఆశించిన ఫలితాన్నివ్వలేదు. మరోవైపు బాలీవుడ్ మూవీ ‘క్వీన్’ తమిళ రీమేక్‌లోనూ కాజల్ లీడ్ రోల్ చేసింది. కానీ ఆ సినిమా విడుదలకే నోచుకోకుండా ఆగిపోయింది. ఐతే కాజల్ కొంచెం బ్రేక్ తీసుకుని ఇప్పుడు మరో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఐతే అందులో లీడ్ రోల్ చేస్తున్నది కాజల్ మాత్రమే కాదు. ఇంకో ముగ్గురు హీరోయిన్లు కూడా ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. అంటే ఇది లేడీ మల్టీస్టారర్ అన్నమాట. ఇందులో మరో స్టార్ హీరోయిన్ రెజీనా కసాండ్రా కూడా నటిస్తోంది. తమిళంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అక్కడి హీరోయిన్ జనని మరో లీడ్ రోల్ చేసింది. ఇంకో కొత్తమ్మాయి కూడా నటించింది. ఈ చిత్రానికి ‘కరుంగాపియం’ అనే టైటిల్ ఖరారు చేశారు. దీని ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. లీడ్ రోల్స్ చేస్తున్న నలుగురు అమ్మాయి ముఖాలను సైడ్ నుంచి వరుస క్రమంలో చూపించారు. అందరిలోకి ఎక్కువ ఆకర్షిస్తున్నది కాజలే. ఎందుకంటే ఆమె తన శైలికి భిన్నంగా పక్...

తన క్రెడిట్ ఏం లేదంటున్న జక్కన్న

Image
రెండు రోజుల కిందట రిలీజ్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ మేకింగ్ వీడియో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. నిజానికిది ప్రేక్షకులకు పెద్ద సర్ప్రైజ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడీ మేకింగ్ వీడియో రాబోతోందని కొన్ని రోజుల ముందు వరకు ఎలాంటి సంకేతాలు లేవు. కొత్త సినిమాల విడుదలపై ఎక్కడలేని సందిగ్ధత నెలకొన్న ఏ చిత్ర బృందం నుంచి అప్‌డేట్స్, ప్రమోషనల్ వీడియోలు ఆశించట్లేదు జనాలు. ఐతే ‘ఆర్ఆర్ఆర్’ టీం ఊహించని విధంగా మేకింగ్ వీడియో రిలీజ్ చేసింది. అది ఒక రేంజ్‌లో ఉండటంతో ప్రేక్షకులు థ్రిల్లయిపోయారు. ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను మరింత హెచ్చు స్థాయికి తీసుకెళ్లిపోయింది ఈ వీడియో. రాజమౌళి మార్కు భారీతనం.. అదిరిపోయే సెట్టింగ్స్.. ఒళ్లు గగుర్పొడిచే స్టంట్స్.. హీరోలిద్దరి గూస్ బంప్ షాట్స్.. అలాగే లొకేషన్లో రాజమౌళికి ఎలివేషన్ ఇస్తున్న షాట్స్.. ఇంకా స్టన్నింగ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ వీడియోకు అదిరిపోయే స్పందన తెచ్చిపెట్టాయి. ఈ వీడియో చూసి అందరూ రాజమౌళిని ఆకాశానికెత్తేస్తున్నారు. మేకింగ్ వీడియోలో కూడా జక్కన్న తన మార్కు చూపించాడంటూ పొగిడేస్తున్నారు. ఐతే రాజమౌళి మాత్రం ఈ క్రెడిట్ తనకు దక్కాల్సింది కాదన్నాడు. గత...

ఎన్టీఆర్ సినిమాకు 200 కోట్లు?

రాజమౌళితో ‘బాహుబలి’ చేశాక ప్రభాస్ ఫాలోయింగ్, మార్కెట్ ఎంతలా పెరిగిపోయిందో తెలిసిందే. ఇప్పుడు రాజమౌళి కొత్త చిత్రం ‘ఆర్ఆర్ఆర్’లో లీడ్ రోల్స్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల మార్కెట్ కూడా అమాంతం పెరుగుతుందనే అంచనాలే ఉన్నాయి. ‘బాహుబలి’కి దీటుగా ఈ చిత్రం వసూళ్ల మోత మోగించడం ఖాయంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా తారక్, చరణ్ మంచి పాపులారిటీ సంపాదించాక వాళ్లు భవిష్యత్తులో చేయబోయే సినిమాల రేంజే వేరుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. పారితోషకాలు పెరుగుతాయి. కథల స్థాయి పెరుగుతుంది. కాస్ట్ అండ్ క్రూ రేంజ్ ఎక్కువుంటుంది. బహు భాషల్లో రిలీజ్ ఉంటుంది. అలాంటపుడు సినిమాల బడ్జెట్ పెరగకుండా ఎలా ఉంటుంది? ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేసిన ‘సాహో’ను ముందు రూ.50 కోట్లలో తీయాలనుకున్నారు. కానీ చివరికి దాని బడ్జెట్ రూ.300 కోట్లను దాటింది. తారక్, చరణ్‌‌ల సినిమాల రేంజ్ ఈ స్థాయిలో కాకున్నా పెరగడం మాత్రం పక్కా. ఆల్రెడీ శంకర్ దర్శకత్వంలో చరణ్ చేయబోతున్న కొత్త చిత్రం బడ్జెట్ రూ.200 కోట్ల పైమాటే అంటున్నారు. ఇప్పుడు తారక్ కూడా అదే క్లబ్బులో అడుగు పెట్టనున్నట్లు సమాచారం. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తారక్.. కొరటాల శివ దర్శకత్వంల...

తిమ్మరసు భలే వెరైటీగా చేశాడే

Image
కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత థియేటర్లలోకి రాబోతున్న తొలి చిత్రం.. తిమ్మరసు. టాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో ‘కిరాక్ పార్టీ’ దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి రూపొందించిన చిత్రమిది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బేనర్ మీద మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించాడు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్ల జోరు పెంచింది. స్టార్ హీరోయిన్ సమంత చేతుల మీదుగా ఒక పాటను రిలీజ్ చేసింది. అది ఇన్‌స్టంట్‌గా జనాలకు నచ్చేస్తోంది. ఐతే అది రెగ్యులర్ పాటేమీ కాదు. ఈ పాట సినిమాలో కూడా ఉండదు. బాలీవుడ్ స్టయిల్లో చేసిన ప్రమోషనల్ సాంగ్ ఇది. దీని ఇంట్రో భలే ఫన్నీగా ఉండి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. హీరో హీరోయిన్లు సత్యదేవ్, ప్రియాంక జవాల్కర్‌లతో పాటు ఈ సినిమాలో కీలక పాత్రలు చేసిన బ్రహ్మాజీ, వైవా హర్ష కలిసి ఈ ఇంట్రోను వినోదాత్మకంగా మార్చారు. బ్లాక్ సూట్లేసుకుని కళ్లజోళ్లు పెట్టుకుని కెమెరాను ఫేస్ చేస్తూ ప్రియాంక జవాల్కర్, బ్రహ్మాజీ, హర్ష నిలబడి ఉంటే.. వెనుక నుంచి సత్యదేవ్ వచ్చి.. ‘తిమ్మరసు’ సినిమాలో నిజానికి ఒక లవ్ సాంగ్ ఉందని.. కానీ లెంగ్త్ దృష్ట్యా దాన్ని తీసేశామని.. ఐతే ఈవిడ (ప్రియాంక) ...

పవన్ సినిమా.. రీషూట్ ప్లాన్!

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా కొంత భాగం షూటింగ్ జరిగింది. అయితే ఇప్పుడు సడెన్ గా ఈ సినిమా ను కెమెరామెన్ ప్రసాద్ మూరెళ్ల తప్పుకున్నారు. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి సైడ్ అయిపోయారని సమాచారం. ఆయన స్థానంలో రవి కె చంద్రన్ ను తీసుకొచ్చారు. అయితే సినిమాలో ఇప్పటివరకు ప్రసాద్ మూరెళ్ల చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలను పక్కన పెట్టాలని చూస్తున్నారట. మరోసారి ఆ సన్నివేశాలను రీషూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఇన్సైడ్ వర్గాల సమాచారం. ప్రసాద్ మూరెళ్లకు, దర్శకుడికి మధ్య పొసగలేదని.. కొన్ని సన్నివేశాలను చూసిన పవన్ కూడా కథ టెంపో మారిపోయినట్లుగా ఉందని చెప్పినట్లు సమాచారం. ఇప్పుడు ప్రసాద్ మూరెళ్ల చిత్రీకరించిన సన్నివేశాలను వాడుకుంటే కెమెరామెన్ గా ఆయనకు కూడా క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుంది. అందుకే ఆయన తీసిన సన్నివేశాలను రీషూట్ చేయాలని భావిస్తున్నారు. ఈ లెక్కన చూస్తే ఈ సినిమా షూటింగ్ ఆలస్యమయ్యేల...

‘నారప్ప’ ఓటీటీ రిలీజ్ కు కారణమతడే!

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుందో అందరికీ తెలిసిందే. కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉండగా.. మరికొన్ని ఫస్ట్ కాపీతో రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. కానీ థియేటర్ వ్యవస్థ ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో చాలా మంది నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. చిన్న సినిమాలు మాత్రమే కాదు.. భారీ బడ్జెట్ తో నిర్మించిన పెద్ద సినిమాలను సైతం ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆందోళనకు దిగారు. అయినప్పటికీ ఓటీటీ రిలీజ్ లు ఆగడం లేదు. తాజాగా ‘నారప్ప’ లాంటి పెద్ద సినిమా కూడా ఓటీటీలో రాబోతుంది. ఎగ్జిబిటర్ల రిక్వెస్ట్ ను కన్సిడర్ చేసి సురేష్ బాబు కొన్నాళ్లు ఆగుతారేమో అనుకున్నారు కానీ అలా జరగడం లేదు. ఈ నెల 20న ‘నారప్ప’ అమెజాన్ ప్రైమ్ లో రానుంది. అయితే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి గల కారణాలను తాజాగా ఆయన చెప్పుకొచ్చారు. ‘అసురన్’ సినిమా ఫస్ట్ హాఫ్ చూసిన వెంటనే నిర్మాత కళైపులి థానుకి ఫోన్ చేసి రైట్స్ అడిగిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు సురేష్ బాబు. అయితే ఆ సమయంలో థాను కూడా సినిమా నిర్మాణంలో భాగం అవుతానని చెప్పడంతో.. సినిమా ఓకే అయిం...

తెలుగు వెబ్ సిరీస్‌ల్లో ఇదే ‘ది బెస్ట్’

నెట్ ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్, హాట్ స్టార్ లాంటి స్ట్రీమింగ్ జెయింట్స్ ఇండియన్ మార్కెట్ మీద దృష్టిపెట్టాక.. ప్రధానంగా వాటి టార్గెట్ బాలీవుడ్డే అయింది. అక్కడి ఫిలిం మేకర్స్, నటీనటులతో పెద్ద ఎత్తున వెబ్ సిరీస్‌లు మొదలుపెట్టారు. పదుల సంఖ్యలో అక్కడ ఒరిజినల్స్ వచ్చాయి. ప్రముఖ నటీనటులు, దర్శకులు వాటి కోసం పని చేశారు. ఐతే తెలుగులో వెబ్ సిరీస్‌ల సంస్కృతి ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. గత ఏఢాది లాక్ డౌన్ టైం నుంచే వెబ్ సిరీస్‌ల సంఖ్య పెరిగింది. ఐతే ఇప్పటిదాకా రెండంకెల సంఖ్యలో సిరీస్‌లు వచ్చాయి కానీ.. వాటిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నవి చాలా తక్కువ. హిందీలో వచ్చే సిరీస్‌ల ప్రమాణాలకు మనవి చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయని అంగీకరించాల్సిందే. బాలీవుడ్ వాళ్లు తీసిన సిరీస్‌ల్లో ఉన్న వైవిధ్యం, ఉత్కంఠ, బిగి మన వాటిలో పెద్దగా కనిపించలేదు. ముఖ్యంగా వెబ్ సిరీస్‌ల్లో ఎక్కువ ఆకర్షణ ఉన్న థ్రిల్లర్ జానర్లో మన వాళ్లు సరైన సిరీస్‌లు తీయలేదు. ఇది తెలుగు ప్రేక్షకులకు నిరాశ కలిగించే విషయమే. ఇంగ్లిష్, హిందీ సిరీస్‌లను చూస్తూ మన దగ్గర ఇలాంటివి రావట్లేదే అనుకుంటున్నారు మన ఆడియన్స్. ఐతే ఎట్టకేలకు ఆ లోటును తీరుస్తూ.. ఒక వెబ్...

అనవసరంగా సిద్ధును లాగారే..

సోషల్ మీడియాలో చాలా అగ్రెసివ్‌గా ట్వీట్లు వస్తూ.. విమర్శలు చేసే వాళ్లకు చురుక్కుమనిపించేలా జవాబులు ఇస్తుంటాడు తమిళ నటుడు సిద్దార్థ్. చాలామంది ఫిలిం సెలబ్రెటీలు ప్రభుత్వ అధినేతల గురించి చిన్న కామెంట్ చేయడానికి కూడా చాలా భయపడిపోతుంటారు కానీ.. సిద్ధు మాత్రం ప్రధాన మంత్రిని కూడా ఘాటుగా విమర్శించడానికి వెనుకాడడు. ఇక సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసే నెటిజన్లను వెతికి వెతికి వాయించేస్తుంటాడతను. అందులోనూ తనకు సంబంధం లేని విషయాల్లో లాగే వాళ్లను సిద్ధు అంత తేలిగ్గా వదలడు. ఈ మధ్యే ఆంధ్రా భాజపా నేత విష్ణువర్ధన్ రెడ్డికి సిద్ధు ఇచ్చిన పంచ్ ఎంత వైరల్ అయిందో తెలిసిందే. ఇప్పుడు ఒక నెటిజన్ సిద్ధు ఆగ్రహాన్ని చవిచూశాడు. సంబంధం లేకుండా ఒక వివాదంలోకి సిద్ధు పేరును లాగడమే ఇందుక్కారణం. దీని వెనుక ఒక ఆసక్తికర కథ ఉంది. టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కొత్త చిత్రం ‘నారప్ప’ ఇంకో నాలుగు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ సినిమాలోంచి ‘ఓ నారప్ప’ అనే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటకు సంబంధించిన పోస్టర్లో వెంకీతో పాటు అమ్ము అభిరామి ఉంది. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసో...

సూపర్ స్టార్ కి పోటీగా అజిత్!

ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతుందంటే దాదాపు సోలో రిలీజ్ ఉండేలా చూసుకుంటారు. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒకేసారి ఇద్దరు హీరోల సినిమాలు రిలీజైతే కలెక్షన్స్ షేర్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఎవరూ కూడా తొందరపడడం లేదు. నిదానంగా తమ సినిమాలను రిలీజ్ చేసుకోవాలనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోల దృష్టి ఒకే డేట్ పై పడిందని తెలుస్తోంది. కోలీవుడ్ లో స్టార్ హీరోలుగా చెలామణి అవుతోన్న సూపర్ స్టార్ రజినీకాంత్, అజిత్ కుమార్ బాక్సాఫీస్ వద్ద పోటీకి రెడీ అవుతున్నారని సమాచారం. తమిళనాట దీపావళి, సంక్రాంతి పెద్ద పండుగలు. గతంలో దీపావళికి రెండు సినిమాలు విడుదలైన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అలానే పోటీ పడాలనుకుంటున్నారు. రజినీకాంత్ నటించిన ‘అన్నాత్తే’ సినిమాను నవంబర్ 4న విడుదల చేయనున్నారు. అలానే అజిత్ ‘వాలిమై’ కూడా అదే డేట్ కి వస్తుందని అంటున్నారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా.. అది సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది. ఇప్పుడు ఈ సినిమాను రజినీకాంత్ సినిమాకి పోటీగా తీసుకురావాలనుకుంటున్నారు. హెచ్.వినోత్ డైరెక్ట్ చేస్తోన్న ‘వాలిమై’ చిత్రాన్ని బోనీకపూర్ నిర్మించారు....

సూర్య-వెట్రిమారన్.. రచ్చ రచ్చన్నమాట

భాషతో సంబంధం లేకుండా దక్షిణాదిన అభిమానించే నటుల్లో సూర్య ఒకడు. ఎప్పుడూ కొత్తదనం కోసం ప్రయత్నిస్తూ, పాత్రల కోసం ఎంతో కష్టపడుతూ అతను ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాడు. ఇక అతడి నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సూర్యతో సినిమా చేయడానికి పేరున్న దర్శకులు లైన్లో ఉంటారు. గత కొన్నేళ్లలో అతను వరుస ఫ్లాపుల వల్ల కొంచెం వెనుకబడ్డప్పటికీ.. ‘సూరారై పొట్రు’ (తెలుగులో ఆకాశం నీ హద్దురా) చిత్రంతో తిరిగి ఫామ్ అందుకున్నాడు. ప్రస్తుతం అతను పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఐతే దాన్ని మించి ఆ తర్వాత చేయనున్న సినిమా మీద ప్రేక్షకుల్లో అమితాసక్తి నెలకొంది. ఎందుకంటే దాని దర్శకుడు వెట్రిమారన్ మరి. పొల్లాదవన్, ఆడుగళం, విసారణై, వడ చెన్నై, అసురన్.. ఇలా వెట్రిమారన్ తీసిన ప్రతి సినిమా ఒక క్లాసిక్కే. ఈ చిత్రాలతో అతను కుప్పలు కుప్పలుగా అవార్డులు పోగేసుకున్నాడు. వెట్రి చేసిన ఐదు సినిమాల్లో నాలుగింట్లో ధనుషే హీరోగా నటించాడు. ఇంకో సినిమాలో హీరో అంటూ ఎవరూ ఉండరు. ఐతే వెట్రితో సినిమా చేయాలని చాలామంది హీరోలు ఆశపడుతుంటారు. ఐతే అతను సూర్యను ఎంచుకున్నాడు. మేటి నటుడిగా పేరు తెచ్చుకున్న సూర్యతో.. గొప్ప దర్శకుడి...

అల్లు వారి లేడీస్ స్పెషల్

టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఆధ్వర్యంలో గత ఏడాది మొదలైన ‘ఆహా’ మొదట్లో చిన్న చిన్న అడుగులే వేసింది. ఎక్కువగా తమ దగ్గరున్న సినిమాలు, డబ్బింగ్ చిత్రాలు.. అలాగే కొన్ని చిన్న స్థాయి వెబ్ సిరీస్‌లు మాత్రమే అందుబాటులో ఉంచింది. కానీ తర్వాత నెమ్మదిగా కొత్త కంటెంట్ పెంచుతూ వచ్చింది. సొంతంగా పెద్ద ఎత్తున వెబ్ సిరీస్‌ల నిర్మాణం చేపట్టి సబ్‌స్క్రైబర్లను పెంచుకునే ప్రయత్నంలో పడింది. తాజాగా ఆహాలో విడుదలైన ‘కుడి ఎడమైతే’ వెబ్ సిరీస్ మంచి స్పందన రాబట్టుకుంటున్న సంగతి తెలిసిందే. యువ దర్శకులు, నిర్మాతల సహకారంతో మరిన్ని వెబ్ సిరీస్‌లను ఆహా ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నంలో ఉంది. తాజాగా ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ ఆహా కోసం ఓ వెబ్ సిరీస్‌ను రూపొందిస్తుండటం దీనికి ‘అన్యాస్ ట్యుటోరియల్’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. శుక్రవారం అల్లు అరవింద్, శోభు యార్లగడ్డతో పాటు ఈ వెబ్ సిరీస్ టీం ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి అనౌన్స్ చేశారు. మహిళలు ప్రధాన పాత్రలు పోషించడంతో పాటు ఓ మహిళే దర్శకత్వం వహించిన సిరీస్ ఇది కావడం విశేషం. పల్లవి గంగిరెడ్డి అనే కొత్త దర్శకురాలు ఈ సిరీస్‌ను రూపొందించింది. ఇందులో రెజీనా...

హాట్ న్యూస్: నెట్ ఫ్లిక్స్ బాహుబలిలో నయన్

స్ట్రీమింగ్ జెయింట్ నెట్ ఫ్లిక్స్ ‘బాహుబలి’ పూర్వ కథతో ఓ భారీ వెబ్ సిరీస్ తీయాలని కొన్నేళ్ల నుంచి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి’లో బాగా హైలైట్ అయిన శివగామి పాత్ర‌ను ఆధారంగా చేసుకుని ర‌చ‌యిత ఆనంద్ నీల‌కంఠ‌న్ రాసిన ‘ది రైజ్ ఆఫ్ శివ‌గామి’ ఆధారంగా ఈ సిరీస్ తీయాలని నాలుగేళ్ల కింద‌ట స‌న్నాహాలు మొద‌లుపెట్టింది. కానీ ఒక ప‌ట్టాన ఈ సిరీస్ ప‌ట్టాలెక్క‌లేదు. ప్ర‌వీణ్ స‌త్తారు, దేవా క‌ట్టా ఈ ప్రాజెక్టు కోసం కొంత కాలం ప‌ని చేసి బ‌య‌టికి వ‌చ్చేశారు. త‌ర్వాత వేరే టీంను పెట్టుకుని స‌రికొత్త‌గా బాహుబ‌లి సిరీస్ తీయ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది నెట్ ఫ్లిక్స్. ఐతే ఇందులో కీల‌క‌మైన శివ‌గామి పాత్రకు ‘భలే మంచి రోజు’ ఫేమ్ వామికా గబ్బి ఎంపికైనట్లు ఇటీవల వార్తలొచ్చాయి. అంత కీలకమైన పాత్రకు వామిక ఎలా సూటవుతుందనే సందేహాలు వ్యక్తమయ్యాయి జనాల నుంచి. ఇలాంటి కాస్టింగ్‌తో ఈ సిరీస్‌కు ఏం ఊపు వస్తుందో అన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి. ఐతే ఈ ప్రాజెక్టుకు మంచి క్రేజ్ తీసుకొచ్చే అప్‌డేట్ బయటికి వచ్చిందిప్పుడు. నెట్‌ఫ్లిక్స్ వారి బాహుబలి సిరీస్ కోసం సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ నయనతారను ఎంచుకున్నారట. ఆమె పాత్ర ఏంటి అన్నది వ...

‘ఐస్‌క్రీమ్’ సిరీస్‌లో ఇంకో సినిమా

దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ పతనానికి పునాది పడ్డ చిత్రాల్లో ఒకటిగా ‘ఐస్ క్రీమ్’ను చెబుతారు చాలామంది. అంతకుముందే ఆయన స్థాయి పడిపోయింది కానీ.. మరీ పేలవంగా అయితే ఉండేవి కావు ఆయన చిత్రాలు. కచ్చితంగా ఎంతో కొంత ఎఫర్ట్ కనిపించేది. ఫ్లాప్ సినిమాల్లో కూడా వర్మ ముద్ర ఉండేది. ‘ఐస్ క్రీమ్’ మాత్రం అలా కాదు. ఏమాత్రం శ్రద్ధ లేకుండా.. ఏం తోస్తే అది తీసినట్లుగా.. మరీ సిల్లీగా కనిపిస్తుందా చిత్రం. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటున్న తేజస్వి మదివాడ ఈ సినిమాతోనే కథానాయిక అయింది. నవదీప్ ఇందులో ఓ కీలక పాత్ర చేశాడు. తేజస్వి అందాలను హైలైట్ చేస్తూ రిలీజ్ చేసిన ప్రోమోలు కొంత మేర యువతనకు ఆకర్షించి దీనికి ఓపెనింగ్స్ వచ్చాయి. మరీ తక్కువ ఖర్చుతో డిజిటల్ కెమెరాతో సినిమా తీయడం ద్వారా మాత్రం వర్మ యంగ్ ఫిలిం మేకర్లకు స్ఫూర్తినిచ్చాడు. అంతకుమించి ‘ఐస్ క్రీమ్’ గురించి చెప్పడానికి ఏమీ లేదు. ‘ఐస్ క్రీమ్’ పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోయినా.. వర్మ దీనికి సీక్వెల్ తీయడం తెలిసిందే. అందులో జేడీ చక్రవర్తి, మృదుల భాస్కర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది మరీ దారుణ ఫలితాన్నందుకుంది. వర్మ ఆ తర్వాత ఇంకా స్థాయి తక్కువ సినిమాలు ఎన్నో తీశాడు. ...

రాజమౌళి వదులుకోలేని బలహీనత

దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అంటే భారీతనానికి కేరాఫ్ అడ్రస్. అందులో కష్టం మామూలుగా ఉండదు. గతంలో ‘మగధీర’ తీశాక రిలీఫ్ కోసం అన్నట్లు ‘మర్యాదరామన్న’ పేరుతో ఓ చిన్న సినిమా తీశాడు కానీ.. ‘బాహుబలి’ తర్వాత మాత్రం ఆయన అలా రేంజ్ తగ్గించుకోవడానికి అవకాశమే లేకపోయింది. జక్కన్నపై దేశవ్యాప్తంగా అంచనాలు భారీగా పెరిగిపోవడం, ఆయన సినిమా అనగానే భారీతనం ఆశిస్తుండటంతో జక్కన్నకు ఇష్టమున్నా లేకపోయినా బిగ్ కాన్వాస్‌లోనే సినిమా తీయాల్సిన పరిస్థితి నెలకొంది. ఐతే ‘ఆర్ఆర్‌ఆర్’ తొలి ప్రెస్ మీట్లో జక్కన్న మాట్లాడుతూ.. ‘బాహుబలి’లా ఇందులో గ్రాఫిక్స్‌కు అంత ప్రాధాన్యం ఉండదని, ఇది ఒక సోషల్ మూవీనే అని చెప్పాడు. చిత్ర వర్గాలు కూడా ‘ఆర్ఆర్ఆర్’లో ‘బాహుబలి’ స్థాయి భారీతనం ఉండదన్నట్లుగా చెప్పుకున్నాయి. ఇప్పటిదాకా రిలీజ్ చేసిన హీరోల టీజర్లు, ఇతర ప్రోమోల్లో కూడా మరీ భారీతనం ఏమీ కనిపించలేదు. కానీ తాజాగా రిలీజ్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ మేకింగ్ వీడియో చూశాక భారీతనంలో ఇది ‘బాహుబలి’కి ఏమాత్రం తీసిపోదని అర్థమైపోయింది. ‘బాహుబలి’కి దీటైన సెట్టింగ్స్ కనిపించాయి మేకింగ్ వీడియోలో. అలాగే యాక్షన్ ఘట్టాలు అలా ఇలా ఉండవన్న సంకేతాలు కనిపించాయి. ‘ఆర...

రాధేశ్యామ్ కథ తేల్చేయనున్న ప్రభాస్

‘బాహుబలి’ కోసం ఐదేళ్లు పెట్టిన ప్రభాస్.. ఆ తర్వాతి చిత్రం ‘సాహో’ను త్వరగానే లాగించేయాలనుకున్నాడు కానీ.. అది కూడా రెండేళ్లకు పైగా సమయాన్ని తినేసింది. ‘రాధేశ్యామ్’ను అయినా సాధ్యమైంత వేగంగా పూర్తి చేద్దామనుకుంటే.. కరోనా మహమ్మారి పుణ్యమా అని అది కూడా రెండేళ్ల ప్రాజెక్టుగా మారిపోయింది. బ్రేకులిచ్చి ఇచ్చి షూటింగ్ చేస్తూ వస్తున్నారు. ఇంకా కొంత షూట్ మిగిలే ఉంది. ఇటీవలే ‘రాధేశ్యామ్’ చిత్రీకరణ పున:ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. కథానాయిక పూజా హెగ్డే తాను ‘రాధేశ్యామ్’ చిత్రీకరణలో పాల్గొంటున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించింది కూడా. ఐతే ఈ షూట్‌లో ప్రభాస్ పాల్గొంటున్నాడా లేదా అన్నది స్పష్టత లేదు. ఐతే చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ప్రభాస్ ఇంకా సెట్లో అడుగు పెట్టలేదట. ఈ నెల 23న అతను ‘రాధేశ్యామ్’ టీంతో కలుస్తాడన్నది తాజా అప్‌డేట్. ప్రభాస్ పాత్రకు సంబంధించి సరిగ్గా రెండు వారాల చిత్రీకరణ మిగిలి ఉందని.. ప్రభాస్ విరామం లేకుండా రెండు వారాలు పని చేస్తాడని.. ఆగస్టు 5వ తేదీకి అతడి పాత్రతో పాటు సినిమా మొత్తం షూటింగ్ దాదాపుగా పూర్తయిపోతుందని సమాచారం. ఇక వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పున:ప్రారంభిస్తారని.. ఇప్...

కూతురి లవ్ ఎఫైర్ పై నటుడి కామెంట్స్!

టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి ప్రేమలో ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి పార్టీలకు, పబ్ లకు వెళ్తూ.. ఎప్పటికప్పుడు మీడియా కంట పడుతుంటారు. దీంతో వీరి మధ్య ఎఫైర్ ఉందంటూ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాహుల్ టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే అతియా, ఆమె సోదరుడు అహాన్‌ కూడా ఇంగ్లండ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల క్రికెటర్లకు తమతో పాటు తమ భాగస్వాములను తీసుకొచ్చే అనుమతిచ్చింది బీసీసీఐ సంస్థ. ఈ క్రమంలో రాహుల్ .. అతియాను తన పార్ట్నర్ గా పేర్కొంటూ పర్మిషన్ తీసుకున్నాడని టాక్. ఇదిలా ఉండగా.. అతియా శెట్టి తండ్రి ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తన కూతురు ఇంగ్లండ్ లో ఉందని చెప్పారు. అయితే ఆమె తన సోదరుడితో కలిసి వెళ్లిందని.. అక్కడే ఇద్దరూ హాలిడే ఎంజాయ్ చేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా రాహుల్-అతియా శెట్టిల జంట గురించి సునీల్ శెట్టి కొన్ని ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రముఖ ఇంటర్నేషనల్ బ్రాండ్ వీరిని అంబాసిడర్లుగా నియమించుకుంది.. నిజానికి వాళ్లిద్దరి జంట ముచ్చటగా ఉంటుందని.. అందుకే యాడ్ అంత బాగా వచ్చ...

టాలీవుడ్ స్టార్స్.. ఇది కరెక్టేనా?

ఒక స్టార్ హీరో సినిమా థియేటర్లలో కాకుండా టీవీల ద్వారా నేరుగా రిలీజవుతుందని కొన్నేళ్ల ముందు కూడా ఎవరూ ఊహించలేదు. కానీ కరోనా మహమ్మారి పుణ్యమా అని ఊహించని పరిస్థితులు వచ్చాయి. అమితాబ్ బచ్చన్, మోహన్ లాల్, సూర్య, నాని, అనుష్క లాంటి స్టార్ల సినిమాలు థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా ఓటీటీల్లో రిలీజ్ కావడం గత ఏడాది కాలంలో చూశాం. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పుడు కూడా ఆ ఒరవడి కొనసాగుతోంది. విక్టరీ వెంకటేష్ చిత్రం ‘నారప్ప’ ఇంకో ఐదు రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇంత పెద్ద సినిమా ఓటీటీలో రిలీజ్ కావడం చాలామందికి రుచించడం లేదు. ముఖ్యంగా వెంకీ అభిమానులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ చాన్నాళ్ల ముందే డీల్ అయిపోవడం, మంచి రేటు కూడా రావడంతో నిర్మాత సురేష్ బాబు వెనక్కి తగ్గాలనుకోలేదు. ఐతే సురేష్ బాబు అండ్ కో తమ నిర్ణయానికి కట్టుబడటం బాగానే ఉంది కానీ.. ఈ చిత్రానికి ప్రమోషన్లే లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కరోనా నేపథ్యంలో బయట పెద్ద పెద్ద ఈవెంట్లు చేయాలని ఎవరూ ఆశించడం లేదు కానీ.. కనీసం హీరోనో, ఇతర ముఖ్య తారలో ఒక ప్రెస్ మీట్ పెట్టడమో.. ఇంకేవైనా చిన్న ఈవెంట్లు చేయడమో చేయాలి. కనీ...

దసరాకు ఆర్ఆర్ఆర్.. కండిషన్స్ అప్లై

మొత్తానికి భారతీయ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న మేకింగ్ వీడియో రానే వచ్చింది. ‘ఆర్ఆర్ఆర్’ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఇప్పటిదాకా ఈ చిత్రంపై ఉన్న అంచనాలను ఇది మరింత పెంచేలాగే ఉంది. ‘బాహుబలి’కి ఏమాత్రం తీసిపోయి భారీ ఎంటర్టైనర్‌నే జక్కన్న ప్రేక్షకులకు అందించబోతున్నాడని స్పష్టమైంది. మేకింగ్ వీడియోలో ప్రతి మూమెంట్ ప్రేక్షకులను థ్రిల్ చేసింది. అన్నింటికంటే థ్రిల్లింగ్ విషయం ఏంటంటే.. ఈ చిత్రం ముందు అనుకున్న ప్రకారమే అక్టోబరు 13న విడుదల కానున్నట్లు ప్రకటించడం. మామూలుగానే ఆ డేట్‌ను ‘ఆర్ఆర్ఆర్’ అందుకోవడం కష్టం అనుకుంటుంటే.. కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు రెండు నెలలకు పైగా షూటింగ్ ఆగిపోయిన నేపథ్యంలో దసరా కానుకగా ‘ఆర్ఆర్ఆర్’ రావడం అసాధ్యం అని ప్రేక్షకులంతా ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఇప్పటికే రెండుసార్లు సినిమా వాయిదా పడ్డప్పటికీ.. పరిస్థితుల దృష్ట్యా మరోసారి పోస్ట్ పోన్ చేసినా ప్రేక్షకులు అర్థం చేసుకునే స్థితిలోనే ఉన్నారు. కానీ ఆశ్చర్యకరంగా ‘ఆర్ఆర్ఆర్’ను అక్టోబరు 13నే విడుదల చేస్తామని జక్కన్న అండ్ కో నొక్కి వక్కాణించడం ప్రేక్షకుల్లో అమితానందాన్ని కలిగిస్తోంది. కరోనా టైంలో పోస...

శర్వా 30.. క్లాసిక్ లోడింగ్

Image
శర్వానంద్ కెరీర్లో సక్సెస్ అయిన సినిమాల కంటే ఫెయిల్యూర్లే ఎక్కువ. కానీ అతను ఫలితాల గురించి పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు వైవిధ్యం కోసం ప్రయత్నిస్తుంటాడు. శర్వా ఫ్లాప్ సినిమాల్లోనూ చాలా క్లాసిక్స్ ఉండటం విశేషం. ఇటీవలే ‘శ్రీకారం’ లాంటి మంచి సినిమాతో అతను ప్రేక్షకులను పలకరించాడు. కానీ వివిధ కారణాల వల్ల ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. కానీ శర్వా గర్వంగా చెప్పుకునే చిత్రాల్లో అదొకడనడంలో సందేహం లేదు. దీని తర్వాత ‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతితో ‘మహాసముద్రం’ అనే సినిమాను పూర్తి చేశాడు ఇందులో సిద్దార్థ్ మరో హీరోగా నటించాడు. ఐతే ‘మహాసముద్రం’ పట్టాలెక్కడానికి ముందే శర్వా.. తమిళ, తెలుగు భాషల్లో ఓ చిత్రాన్ని మొదలుపెట్టాడు. అదే.. ఒకే ఒక జీవితం. తమిళంలో పేరున్న బేనర్ అయిన డ్రీమ్ వారియర్స్‌లో ఈ చిత్రం తెరకెక్కింది. శ్రీ కార్తీక్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఇంతకుముందు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టరే ‘ఒకే ఒక జీవితం’ చాలా స్పెషల్ మూవీ అనే సంకేతాలు ఇచ్చింది. తాజాగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్లో ఒక వైపు 90ల నాటి వస్తువులు.. మరోవ...

కీరవాణి హామీ.. పూనకాలు ఖాయం

కీరవాణి బయటి సినిమాలకు ఇచ్చే ఔట్ పుట్ వేరు. తన సోదరుడు రాజమౌళి చిత్రాలకు ఇచ్చే ఔట్ పుట్ వేరు. వేరే చిత్రాలకు ఆయనిచ్చే సంగీతం బాగోదని కాదు కానీ.. జక్కన్న సినిమా అంటే ఆయన పెట్టే శ్రమ అంతా ఇంతా కాదు. ఒక్కసారిగా శక్తులన్నీ కూడగట్టుకుని, ఎంతో కసితో జక్కన్న సినిమాకు పని చేస్తాడేమో అనిపిస్తుంది ఆయా చిత్రాల ఔట్ పుట్ చూస్తే. ‘బాహుబలి’తో భారతీయ ప్రేక్షకులందరికీ గూస్ బంప్స్ ఇచ్చారాయన. ముఖ్యంగా ‘బాహుబలి: ది కంక్లూజన్’కు ఆయనిచ్చిన పాటలు, నేపథ్య సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే జనాలకు పూనకాలు వచ్చేశాయి. ఇక సినిమా హాళ్లలో నిజంగా ప్రేక్షకులందరికీ రోమాలు నిక్కబొడుచుకున్నాయంటే అతిశయోక్తి కాదు. ఐతే ప్రతిసారీ ఇలా అంచనాలు అందుకోవడం తేలిక కాదు. ఐతే ఈ విషయంలో రాజమౌళి లాగే కీరవాణి కూడా మాస్టర్ అయినట్లే ఉన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్, మోషన్ పోస్టర్లలో కీరవాణి నేపథ్య సంగీతం ఎంతగా హైలైట్ అయిందో తెలిసిందే. తాజాగా రిలీజ్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ మేకింగ్ వీడియో స్కోర్ అయితే మరో లెవెల్ అనే చెప్పాలి. ఫస్ట్ షాట్ టైంలో వచ్చిన సౌండింగ్‌తోనే ప్రేక్షకుల్లో ఒక ఉద్వేగం కలిగ...

ప‌వ‌న్‌తో అనుకుంటే అత‌డితో చేస్తోంది

మాన‌స రాధాకృష్ణ‌న్.. పేరు చూస్తేనే ఇది తెలుగ‌మ్మాయి పేరు కాద‌ని అర్థ‌మైపోతుంది. మ‌ల‌యాళంలో చిన్న స్థాయి హీరోయిన్ ఈమె. ఐతే అనుకోకుండా ఈ అమ్మాయి పేరును తెలుగు ప్రేక్ష‌కులు ట్రెండ్ చేయ‌డం మొద‌లుపెట్టారు గ‌త ఏడాది. అందుక్కార‌ణం.. మాన‌స ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలో క‌థానాయిక‌గా చేస్తోంద‌ని జ‌రిగిన ప్ర‌చార‌మే. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ చేయ‌నున్న సినిమాలో ఈ అమ్మాయే హీరోయిన్ అంటూ గ‌ట్టిగానే ప్ర‌చారం సాగింది. కానీ అది నిజం కాద‌ని హ‌రీష్ స్వ‌యంగా వెల్ల‌డించాడు. ఆ త‌ర్వాత మాన‌స సైతం ఈ ప్ర‌చారాన్ని ఖండించింది. అంత‌టితో ఆమె పేరు ప‌క్క‌కు వెళ్లిపోయింది. ఐతే ఇప్పుడామె నిజంగానే టాలీవుడ్లో అరంగేట్రం చేస్తుండ‌టం విశేషం. కానీ ఇంత‌కుముందు అనుకున్న‌ట్లు ఆమె ఎంట్రీ ఇస్తోంది ప‌వ‌న్ సినిమాతో కాదు. విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా టాలీవుడ్లోకి అడుగు పెడుతోంది మాన‌స‌. హైవే పేరుతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం బుధ‌వార‌మే మొద‌లైంది. 118 చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారిన సీనియ‌ర్ సినిమాటోగ్రాఫ‌ర్ కేవీ గుహ‌న్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. 118 త‌ర్వాత గుహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో డ‌బ్ల్య...

ఎన్టీఆర్ షోలో రామ్ చరణ్!

టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను వదిలారు. తొలిసారి మెగా, నందమూరి హీరోలు తెరపై కనిపిస్తుండడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ కాంబినేషన్ లో ఓ షోని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కొన్నాళ్లక్రితం బుల్లితెరపై ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ అనే షోని ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. స్టార్ మాలో టెలికాస్ట్ అయిన ఈ షోని నాగార్జున, చిరంజీవి హోస్ట్ చేశారు. రేటింగులు సరిగ్గా రాకపోవడంతో షోని నిలిపివేశారు. ఇప్పుడు ఆ షో హక్కులను జెమినీ టీవీ తీసుకుంది. ఎన్టీఆర్ హోస్ట్ గా షోని ప్లాన్ చేసింది. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే పేరుతో ఈ షోని ప్రసారం చేయనున్నారు. అయితే ఈ షోలకు సామాన్యులతో పాటు అప్పుడప్పుడు సెలబ్రిటీలను కూడా తీసుకొస్తుంటారు. హాట్ సీట్ లో వాళ్లను కూర్చోపెట్టి షోకి హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. అందులో భాగంగానే రామ్ చరణ్ ను గెస్ట్ గా తీసుకురాబోతున్నారు. ఈ మేరకు ప్లాన్ చేసిన ఎ...

అలాంటి ఫీలింగ్ నాకు లేదు.. మా ఎన్నికలపై బాలయ్య

మూవీ ఆర్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు.. హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఓ వైపు ప్రకాష్ రాజ్, మరో వైపు మంచు విష్ణు తలపడుతుండటంతో.. దీనిపై తీవ్ర ఆసక్తి పెరిగింది. వీరిద్దరిలో ఎవరి మద్దుతు ఎవరికి అనే విషయం మరింత తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. కాగా.. తాజాగా.. ఈ మా ఎన్నికలపై సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. “మా” ఎన్నికల విషయంలో లోకల్, నాన్ లోకల్ అనే బేధాన్ని తాను పట్టించుకోనని ఆయన స్పష్టం చేశారు. అయితే “మా ” బిల్డింగ్ ఇంతవరకు ఎందుకు కట్టలేకపోయారన్నదే తన ప్రశ్న అని బాలయ్య పేర్కొన్నారు. తెలంగాణ సర్కార్‌తో రాసుకుపూసుకు తిరుగుతున్నారని.. ” మా ” బిల్డింగ్ కోసం అడిగితే ఒక ఎకరం ఇవ్వరా అని బాలయ్య ప్రశ్నించారు. ” మా ” బిల్డింగ్ నిర్మాణం కోసం విష్ణు ముందుకొస్తే తానూ సహకరిస్తానని బాలకృష్ణ స్పష్టం చేశారు. అందరం కలిస్తే.. ఇంద్ర భవనం నిర్మించొచ్చని ఆయన పేర్కొన్నారు. ఫండ్ రైజింగ్ కోసం ఫస్ట్‌క్లాస్‌లో అమెరికాలో తిరిగారని.. ఆ డబ్బంతా ఏం చేశారని బాలకృష్ణ ప్రశ్నించారు. మనది గ్లామర్ ఇండస్ట్రీ అని.. సమస్యలు బహిరంగంగా చర్చించడం సరికాదని ఆయన హితవు పలికారు. https://ift.tt/...

కొత్త సినిమాకు అదిరిపోయే రివ్యూలు

దేశవ్యాప్తంగా థియేటర్లు మూతపడి ఉన్నప్పటికీ.. కొత్త సినిమాల విడుదల ఏమీ ఆగట్లేదు. తెలుగులో తక్కువే కానీ.. వేరే భాషల్లో ఓటీటీల ద్వారా కొత్త చిత్రాలు బాగానే రిలీజవుతున్నాయి. కొన్ని చిత్రాలకు మంచి హైప్ కూడా వస్తోంది. అందులో ఒకటి మలయాళ చిత్రం.. మాలిక్. గత దశాబ్ద కాలంలో దేశంలోనే అత్యుత్తమ నటుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న ఫాహద్ ఫాజిల్ ఇందులో ప్రధాన పాత్ర పోషించాడు. ‘విశ్వరూపం’ సహా ఎన్నో చిత్రాలకు ఎడిటర్‌గా పని చేసి గత ఏడాదే.. ‘సీ యూ సూన్’ అనే వెరైటీ సినిమాతో దర్శకుడిగా మారిన మహేష్ నారాయణన్ దీనికి దర్శకుడు. ఈ చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్ నిన్న రాత్రి 10 గంటలకు రిలీజ్ చేసింది. ట్రైలర్ చూసి ఫాహద్ కెరీర్లో మరో మేటి చిత్రం అవుతుందన్న అంచనాలు కలిగాయి. సినిమా ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గలేదని అంటున్నారు చూసిన వాళ్లందరూ. ఇటు క్రిటిక్స్ ఇస్తున్న రివ్యూలు.. అటు నెటిజన్లు ఇస్తున్న ఫీడ్ బ్యాక్ చూస్తుంటే.. ఈ ఏడాది ఇండియాలో వచ్చిన బెస్ట్ ఫిల్మ్స్‌లో ‘మాలిక్’ ఒకటి అని అర్థమవుతోంది. గత కొన్నేళ్లలో ఓటీటీల విప్లవం కారణంగా మలయాళ సినిమాలను ఇతర భాషల వాళ్లూ విరగబడి చూస్తున్నారు. ఫాహద్ ఎంత గొప్ప నటుడో అందరికీ బాగానే అర్థమ...

రాజమౌళి బ్రాండ్ బిల్డింగ్

Image
రాజమౌళి ఇప్పుడు దేశంలోనే నంబర్ వన్ డైరెక్టర్ అంటే అతిశయోక్తి ఏమీ కాదు. రాజమౌళి కంటే గొప్పగా సినిమాలను డీల్ చేసేవాళ్లు, కొత్తదనం పంచేవాల్లు, ఉన్నతమైన కథలను తెరకెక్కించే వాళ్లు ఉండొచ్చు. కానీ మెజారిటీ ప్రేక్షకులను అలరించే సినిమాలు తీయడంలో జక్కన్న మిగతా దర్శకులందరి కంటే ముందుంటాడు. ‘బాహుబలి’తో అతడి సత్తా ఏంటో దేశం మొత్తానికి తెలిసింది. ఇప్పుడు జక్కన్న తీస్తున్న ‘ఆర్ఆర్ఆర్’పై అంచనాలు మామూలుగా లేవు. తాజాగా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో ఆ అంచనాలను రెట్టింపు చేసింది. నిజానికి ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు ఉత్తరాదిన పెద్దగా గుర్తింపు లేదు. డబ్బింగ్ సినిమాలతో ఏదో కాస్త పాపులర్ అయి ఉండొచ్చు కానీ.. వాళ్లను చూసి మిగతా భాషల ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ చుట్టూ ఇంత హైప్ నెలకొందంటే.. భాషలకు అతీతంగా ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారంటే అది రాజమౌళి వల్లే. ఐతే తనకున్న క్రేజ్‌ను ఉపయోగించుకోవడానికి, బ్రాండ్‌ను బిల్డ్ చేసుకోవడానికి రాజమౌళి కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన మేకింగ్ వీడి...

కోడి రామకృష్ణ సమర్పించు..

తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుల్లో కోడి రామకృష్ణ ఒకరు. శతాధిక చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించడం విశేషం. అంకుశం, భారత్ బంద్, అమ్మోరు సహా 80, 90 దశకాల్లో ఆయన రూపొందించిన చిత్రాలు ఎంతటి సంచలనం రేపాయో తెలిసిందే. ఇక కోడి పనైపోయిందనుకున్న సమయంలోనూ ‘అరుంధతి’లో ఆయన తన సత్తా ఏంటో చాటి చెప్పారు. ఆ తర్వాత కూడా ఆపకుండా సినిమాలు తీస్తూనే వెళ్లారు. 2019లో అనారోగ్యంతో చనిపోవడానికి కొన్ని నెలల ముందు కూడా ఆయన ఓ ప్రాజెక్టు మీద పని చేస్తూ ఉన్నారు. ఊహ తెలిసినప్పటి నుంచి సినిమాతో ముడిపడ్డ ఆయన జీవితం.. ఇప్పుడు మరణానంతరం కూడా సినిమాతోనే కొనసాగేలా చూడాలని వారి కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. కోడి రామకృష్ణ తనయురాలు కోడి దివ్య దీప్తి నిర్మాతగా పరిచయం అవుతుండటం విశేషం. ‘కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్’ పేరుతో కోడి రామకృష్ణ కుటుంబం కొత్త బేనర్ స్థాపించింది. ఈ బేనర్‌కు సమర్పుకుడు కోడి రామకృష్ణనే కావడం విశేషం. దివ్య దీప్తి నిర్మాతగా వ్యవహరించనుంది. ఈ బేనర్లో తొలి సినిమాను ‘రాజా వారు రాణి వారు’ ఫేమ్ కిరణ్ అబ్బవరపుతో రూపొందించనున్నారు. కార్తీక్ శంకర్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. మెలోడీ...

తాప్సీ కావాలనే ఆ పేరు పెట్టిందా..?

సినిమా ఇండస్ట్రీలో పని చేసే చాలా మందికి నిర్మాతలుగా మారాలని ఉంటుంది. కొందరు రిస్క్ తీసుకోవడానికి రెడీ అవుతుంటారు. కానీ సినిమా సినిమాకి భారీ రెమ్యునరేషన్లు తీసుకునే హీరో, హీరోయిన్లు మాత్రం మనకెందుకులే అనుకుంటారు. ముఖ్యంగా నిర్మాతలుగా మారిన హీరోయిన్లను చేతివేళ్ల మీద లెక్కబెట్టొచ్చు. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం హీరోయిన్లు కూడా సినిమాలపై పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతున్నారు. రీసెంట్ గా ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ లాంటి హీరోయిన్లు సైతం నిర్మాతలుగా మారారు. ఇప్పుడు తాప్సీ కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. తన స్నేహితుడు ప్రాంజల్ తో కలిసి ‘అవుట్ సైడర్స్’ అనే సంస్థను స్థాపించారు. త్వరలోనే ఈ సంస్థపై ఓ సినిమాను నిర్మించబోతున్నట్లు చెప్పారు. అయితే ఇందులో ఎవరెవరు నటిస్తారు..? ఏ భాషలో సినిమాను నిర్మించబోతున్నారనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు తాప్సీ తన బ్యానర్ కు పెట్టిన పేరు హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో నెపోటిజం ఉందనే మాటలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. బయటవాళ్లకు అవకాశాలు పెద్దగా ఇవ్వరని.. సెలబ్రిటీ కుటుంబాలకు చెందిన వారినే అందలం ఎక్కిస్తారని విమర్శలు వస్తుంటాయి. ...

డేటింగ్ తొలి రోజు ముద్దా.. నో ఛాన్స్

ఒక అమ్మాయి-అబ్బాయి డేటింగ్ అనగానే రొమాన్స్ గురించే ఆలోచనలు మెదులుతాయి చాలామందిలో. అది చాలా తప్పు అంటోంది టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్. డేటింగ్ అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడమని.. అందులో రొమాన్స్‌కు తొలి ప్రాధాన్యం ఇవ్వకూడదని ఆమె అంది. డేటింగ్ తొలి రోజు అవతలి వ్యక్తి ముద్దు అడిగితే ఇస్తారా అని ఓ ఇంటర్వ్యూలో అడిగితే.. ఛాన్సే లేదని చెప్పేసింది ప్రగ్యా. అలా అని డేటింగ్ చేసే వ్యక్తికి అసలు ముద్దే ఇవ్వరా అని అడిగితే.. అలా ఏమీ లేదంది ప్రగ్యా. కొన్ని రోజులు కలిసి జీవించి, ఇద్దరి మనసులు కలిశాక లిప్ కిస్‌కు ఓకే చెబుతుందట. మరి ప్రస్తుతం ఎవరితోనైనా డేటింగ్‌లో ఉన్నారా అని అడిగితే.. తనకు ఇప్పుడు అంత టైమ్ లేదని ప్రగ్యా అంది. ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాల మీదే అంది ఈ ఉత్తరాది భామ. తెలుగులో మొదట్లో చిన్నా చితకా సినిమాలేవో చేసింది కానీ.. ‘కంచె’ సినిమాతో ఆమెకు మంచి పేరే వచ్చింది. ఆ చిత్రంలో అందం, అభినయంతో ఆకట్టుకున్న ప్రగ్యా పెద్ద రేంజికి వెళ్తుందని అనుకున్నారు. కానీ తర్వాత అవకాశాలైతే వచ్చాయి కానీ.. కెరీర్ అనుకున్నంతగా ఊపందుకోలేదు. వరుసగా ఫ్లాపులు ఎదురు కావడం ఆమెకు చేటు చేసింది. దీంతో కెరీర్లో ...

యంగ్ హీరోకి అంతిస్తున్నారా..?

ఈ మధ్యకాలంలో చాలా మంది కోలీవుడ్ హీరోలు తెలుగులో ఎంట్రీ ఇవ్వడానికి మక్కువ చూపుతున్నారు. ఇప్పటికే ధనుష్, విజయ్ లాంటి స్టార్ హీరోల ప్రాజెక్ట్ లు కన్ఫర్మ్ అయ్యాయి. త్వరలోనే సూర్య కూడా తెలుగు స్ట్రెయిట్ సినిమాలో నటిస్తారని అంటున్నారు. ఇక రీసెంట్ గా కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్ కూడా తెలుగు డెబ్యూకి రెడీ అయినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఈ హీరో నటించిన తమిళ సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. వీటిల్లో ‘రెమో’ సినిమా బాగా క్లిక్ అయింది. ఇప్పుడు స్ట్రెయిట్ తెలుగు సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ‘జాతిరత్నాలు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనుదీప్.. శివ కార్తికేయన్ తో సినిమా చేయబోతున్నారు. ఏషియన్ సినిమాస్ సంస్థ ఈ ప్రాజెక్ట్ ను నిర్మించనున్నారు. అయితే ఈ సినిమా కోసం శివ కార్తికేయన్ కు రెమ్యునరేషన్ గా రూ.20 కోట్లు ఇవ్వబోతున్నారని సమాచారం. నిజానికి టాలీవుడ్ లో ఈ రేంజ్ లో రెమ్యునరేషన్లు అందుకునేది స్టార్ హీరోలే. వాళ్లతో పోలిస్తే శివ కార్తికేయన్ కు తెలుగులో అంత క్రేజ్ లేదు. అలాంటిది ఈ హీరోకి ఇరవై కోట్లు ఇవ్వడానికి రెడీ అవుతున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. కోలీవుడ్ లో ఈ హ...

క‌త్తి మ‌హేష్ ప్ర‌మాదంపై డ్రైవ‌రేమ‌న్నాడంటే..

ప్ర‌ముఖ క్రిటిక్ క‌మ్ సోష‌ల్ యాక్టివిస్ట్ క‌త్తి మ‌హేష్ రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డ‌టం.. రెండు వారాల పాటు ఆసుప‌త్రిలో చికిత్స పొందాక తుది శ్వాస విడ‌వ‌డం తెలిసిందే. మ‌ధ్య‌లో ఆయ‌న కోలుకున్న‌ట్లుగా వార్తలొచ్చాయి కానీ.. త‌ర్వాత హ‌ఠాత్తుగా మ‌ర‌ణ వార్త బ‌య‌టికి వ‌చ్చింది. ఐతే క‌త్తి మ‌ర‌ణంపై అనుమానాలు వ్య‌క్తం చేస్తూ మందకృష్ణ మాదిగ న్యాయ విచార‌ణ‌కు డిమాండ్ చేయ‌డం, క‌త్తి కుటుంబ స‌భ్యుల నుంచి సైతం అదే డిమాండ్ రావ‌డం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదంలో కత్తికి అంతటి తీవ్ర గాయాలు కాగా.. ఆ కారును నడుపుతున్న డ్రైవర్ సురేష్ స్వల్ప గాయాలతో బయటపడటం అనుమానాలు రేకెత్తించిన నేపథ్యంలో అతణ్ని పిలిచి పోలీసులు విచారించారు. కొవ్వూరు పోలీస్ స్టేషన్లో సీఐ ఆధ్వర్యంలో అతడిని విచారించారు. అనంతరం ఈ వివరాలను మీడియాకు కూడా వెల్లడించారు. పోలీసుల సమాచారం ప్రకారం సురేష్ ఏమన్నాడంటే.. ప్రమాదం జరగడానికి కాస్త ముందు నెల్లూరులో ఆగి విశ్రాంతి తీసుకోవాలనుకున్నామని.. కానీ ఈలోపే ఆ దుర్ఘటన జరిగిందని.. కంటైనర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని సురేష్ చెప్పాడు. యాక...

ఆ లెజెండ్ స్థానంలోకి ఇంకో లెజెండ్

భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ గ‌ర్వించ‌ద‌గ్గ న‌టుల్లో ఇర్ఫాన్ ఖాన్ ఒక‌డు. హిందీలో అత‌ను చేసిన చిత్రాల‌తో ఎంత గొప్ప పేరు సంపాదించాడో కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. ఆ పేరుతోనే హాలీవుడ్లో లైఫ్ ఆఫ్ పై, జురాసిక్ వ‌ర‌ల్డ్ లాంటి భారీ చిత్రాల్లో కీల‌క పాత్ర‌లు ద‌క్కించుకున్నాడు. వాటితోనూ స‌త్తా చాటాడు. కానీ ఈ లెజెండ‌రీ న‌టుడు గ‌త ఏడాది అర్ధంత‌రంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. కొన్నేళ్ల కింద‌ట అరుదైన క్యాన్స‌ర్ బారిన ప‌డి.. దాంతో పోరాడిన ఇర్ఫాన్ నిరుడు కొవిడ్ టైంలో త‌నువు చాలించాడు. అనారోగ్యం పాల‌య్యాక మ‌ధ్య‌లో ఆగిపోయిన అంగ్రేజీ మీడియంను పూర్తి చేశాడు కానీ.. అత‌ను అంగీకారం తెలిపిన వేరే సినిమాల‌కు ప్ర‌త్యామ్నాయాలు చూసుకోక త‌ప్ప‌లేదు. అందులో ఒక‌టి.. టికు వెడ్స్ షేరు. కంగ‌నా ర‌నౌత్ సొంత నిర్మాణ సంస్థ మ‌ణిక‌ర్ణిక ఫిలిమ్స్ నిర్మాణంలో మొదలు కావాల్సిన తొలి చిత్ర‌మిది. ఈ సినిమాను ప్ర‌క‌టించాక ఇర్పాన్ అనారోగ్యం బారిన ప‌డ‌టంతో దీన్ని ముందుకు తీసుకెళ్ల‌లేక‌పోయారు. ఇర్ఫాన్ కోలుకుని ఈ సినిమా చేస్తాడ‌ని అనుకున్నారు కానీ.. అది జ‌ర‌గ‌లేదు. దీంతో మ‌రింత టైం తీసుకుని ఎట్ట‌కేల‌కు ఈ సినిమాను ప‌ట్టాలెక్కించ‌డానికి ...

‘తోప్ టీవీ’ తాట‌ తీశారుగా..

తోప్ టీవీ.. ఈ పేరు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు వివిధ ఓటీటీ ప్లాట్ఫాంలలో లభించే కంటెంట్ను పైర‌సీ చేసి.. తోప్ టీవీ లో ఉచితంగా అందిస్తున్నారు. దీనికి లక్షల మంది యూజర్లు ఉన్నారు. అతిపెద్ద పైరేటెడ్ ఓటీటీ ప్లాట్ఫాంగా ఇటీవ‌ల దీనిపై విమ‌ర్శ‌లు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిని నిర్వ‌హిస్తోంది.. ఎక్క‌డో.. విదేశీ వ్య‌క్తికాదు.. హైద‌రాబాద్‌కు చెందిన స‌తీశ్ వెంక‌టేశ్వ‌ర్లు. ఇత‌ని వ‌య‌సు 28 ఏళ్లు. హైదరాబాద్ గుర్రంగూడకు చెందిన ఇంజినీర్ అయిన సతీశ్ గ‌త రెండేళ్లుగా తోప్ టీవీ పేరుతో రూ.కోట్లు పోగాశార‌నే వార్త‌లు ఇటీవ‌ల వినిపించాయి. అయితే.. ఈ పైర‌సీ తోప్‌ పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ప్రముఖ పైరసీ యాప్ ‘తోప్ టీవీ’ వ్యవస్థాపకుడు, సీఈఓ సతీశ్ వెంకటేశ్వర్లు(28)ను ముంబైకి చెందిన పోలీసులు గుట్టుచ‌ప్పుడు కాకుండా అరెస్టు చేశారు. హైదరాబాద్ గుర్రంగూడలోని సతీశ్ను తన నివాసంలోనే.. ముంబయి సైబర్ డిపార్ట్మెంట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు న్యాయస్థానం ఏడు రోజుల రిమాండ్ విధించింది. తోప్ టీవీపై వయాకామ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సహా పలు బ్రాడ్కాస్టింగ్ సంస్థలు పో...

స్టార్ హీరోయిన్ పై పోలీస్ కంప్లైంట్!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయంలోకి వస్తే.. ఇటీవల కరీనా తన ప్రెగ్నన్సీ అనుభవాన్ని పుస్తక రూపంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. “కరీనా కపూర్‌ ఖాన్స్‌ ప్రగ్నెన్సీ బైబిల్‌” అనే పేరుతో ఈ పుస్తకాన్ని విడుదల చేసింది. ఈ బుక్ తనకు బిడ్డతో సమానమని చెప్పింది. అలాంటిది ఇప్పుడు ఆ పుస్తకం కారణంగానే ఆమె చిక్కుల్లో పడింది. ఈ బుక్ టైటిల్ క్రిస్టియన్ల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ కరీనా కపూర్ పై శివాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మహారాష్ట్రకు చెందిన పలు క్రిస్టియన్ సంఘాలు కరీనాపై మండిపడుతున్నాయి. అల్ఫా, ఒమెగా క్రిస్టియన్‌ మహాసంగ్‌ అధ్యక్షుడు ఆశిష్‌ షిండే కరీనాపై ఫిర్యాదు చేసినట్లు బీడ్‌ లోని శివాజీ నగర్‌ పోలీస్ స్టేషన్‌ ఇంచార్జ్‌ శ్రీనాథ్‌ తంభోర్‌ మీడియాకు వెల్లడించారు. కరీనాతో పాటు ఈ బుక్ రాసిన మరో రచయిత అదితి షా భీమ్జనిపై కూడా కేసు నమోదైంది. ఈ బుక్ టైటిల్ పవిత్ర గ్రంథమైన బైబిల్ ని అవమానించేలా ఉందని ఆశిష్ షిండే తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో పోలీసులు కంప్లై...

15 కేజీలు బరువు పెరిగిన హీరోయిన్

Image
కృతి సనన్.. ప్రస్తుతం బాలీవుడ్లో హ్యాపెనింగ్ హీరోయిన్లలో ఒకరు. బాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’లో ఆమే కథానాయికగా. ప్రభాస్ ప్రధాన పాత్రలో ఓం రౌత్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో కృతి సీత పాత్ర పోషిస్తుండటం విశేషం. ఈ పాత్రకు సూటయ్యే బడా హీరోయిన్లు చాలామంది ఉండగా.. ఓం రౌత్ మాత్రం కృతికే ఆ పాత్రను కట్టబెట్టాడు. బాలీవుడ్లో చిన్న సినిమాలతో ప్రయాణం మొదలుపెట్టి ఈ స్థాయికి చేరుకోవడంలో కృతి కష్టం చాలానే ఉంది. ‘ఆదిపురుష్’ కంటే ముందు ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాతో కృతి పలకరించబోతోంది. అదే.. మిమీ. ఈ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్నట్లు కూడా చాలామంది ప్రేక్షకులకు తెలియదు. సైలెంటుగా సినిమాను పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేశారు. తాజాగా రిలీజైన ‘మిమీ’ ట్రైలర్ భలే ఫన్నీగా ఉండి ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తోంది. మంగళవారం ట్రైలర్ వచ్చినప్పటి నుంచి యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఇందులో ఒక విదేశీ జంట కోసం సరోగసీ ద్వారా బిడ్డను కనడానికి సిద్ధమయ్యే మధ్య తరగతి అమ్మాయిగా కృతి కనిపిస్తోంది. ఐతే ట్రైలర్లో చూస్తే మునుపటి సినిమాలతో పోలిస్తే కృతి కొంచెం బొద్దుగా కనిపిస్తోంది. ప్ర...

ఎక్స్ క్లూజివ్ : రాశిఖన్నా కొత్త వెబ్ సిరీస్!

టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన రాశిఖన్నా.. స్టార్ హీరోయిన్ హోదా మాత్రం అందుకోలేకపోయింది. కానీ ఆమెకి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం తెలుగులో నాగచైతన్యతో కలిసి ‘థాంక్యూ’, అలానే గోపీచంద్ తో కలిసి ‘పక్కా కమర్షియల్’ అనే సినిమాల్లో నటిస్తోంది. మరోపక్క తమిళంలో ఐదు సినిమాలు చేస్తోంది. అలానే మలయాళంలో ‘భ్రమమ్’ అనే సినిమాను పూర్తి చేసింది. వరుసగా సినిమాలు చేయడంతో పాటు వెబ్ సిరీస్ లు కూడా ప్లాన్ చేస్తోంది ఈ బ్యూటీ. ఇప్పటికే ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే రూపొందిస్తోన్న కొత్త సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో షాహిద్ కపూర్ సరసన రాశిఖన్నా కనిపించబోతుంది. తాజాగా ఆమె లీడ్ రోల్ లో ఓ వెబ్ సిరీస్ రాబోతుందని తెలుస్తోంది. ఇప్పటివరకు రాశి కమర్షియల్ హీరోయిన్ పాత్రల్లోనే కనిపించింది. కానీ తొలిసారి ఆమె చుట్టూనే తిరిగే కథ రాసుకున్నారట. సురేష్ వంగ అనే నూతన దర్శకుడు ఓటీటీ కోసం ఓ వెబ్ సిరీస్ ను ప్లాన్ చేశారు. క్రైమ్, యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సిరీస్ లో మెయిన్ లీడ్ గా రాశిఖన్నాను తీసుకున్నారు. ఇందులో ఆమె స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా కనిపించబోతుంది. ఈ సిరీ...

‘క్షణం’ మొత్తం మార్చేయమన్నారట

అడివి శేష్ కెరీర్లో గేమ్ చేంజర్‌గా నిలిచిన చిత్రం ‘క్షణం’. అప్పటిదాకా శేష్‌కు కెరీర్లో చాలా వరకు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. స్వీయ దర్శకత్వంలో తీసిన కర్మ, కిస్ చిత్రాలు దారుణమైన ఫలితాలను అందించగా.. నటుడిగా కూడా అతడికి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ‘క్షణం’తో రచయితగా, నటుడిగా అద్భుతమైన పనితనం చూపించి ప్రేక్షకుల మనసు దోచాడు శేష్. కొత్త దర్శకుడు రవికాంత్ పేరెపుతో కలిసి అతను పడ్డ కష్టానికి బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితమే దక్కింది. పెద్ద చిత్రాలకు పేరుపడ్డ పీవీపీ.. ఈ చిన్న చిత్రాన్ని ప్రోత్సహించి తన అభిరుచిని చాటుకున్నారు. ఐతే సినిమా పట్టాలెక్కడానికి ముందు మాత్రం శేష్ చాలానే కష్టపడాల్సి వచ్చిందట. ఒకపట్టాన ఈ కథకు గ్రీన్ సిగ్నల్ లభించలేదట. ఒక టైంలో ‘క్షణం’ కథ మొత్తం మార్చేయాలన్న సూచన పీవీపీ టీంలోని ఒకరి నుంచి వచ్చినట్లు శేష్ తాజాగా ఒక టీవీ కార్యక్రమంలో వెల్లడించాడు. “క్షణం కథా చర్చలు నడుస్తున్న సమయంలో ఒక రోజు పీవీపీ గారు వచ్చి నా స్నేహితులు కొందరున్నారు. వారికి కథ వినిపించండి. వాళ్లు ఓకే అంటే షూట్‌కు వెళ్లిపోదాం అన్నారు. పీవీపీ గారి ఆఫీసులో వారితో కలిసి నేను, రవికాంత్ కూర్చున్నాం. చాలా ఉత్సాహంగ...

నారప్ప.. జిరాక్స్ కాపీనే

Image
విక్టరీ వెంకటేష్ ఇంకో ఆరు రోజుల్లోనే తన కొత్త చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘నారప్ప’ ఈ నెల 20న అమేజాన్ ప్రైమ్ ద్వారా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం దీని ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం తమిళ బ్లాక్‌బస్టర్ ‘అసురన్’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. చాలా వయొలెంట్‌గా సాగే ఈ సినిమాను సున్నితమైన కుటుంబ కథా చిత్రాలకు పేరుబడ్డ శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేయడం విశేషం. అతను ఒరిజినల్‌లో కొన్నయినా మార్పులు చేర్పులు చేసి ఉంటాడని.. తనదైన టచ్ ఇచ్చే ప్రయత్నం చేసి ఉంటాడని అనుకున్నారు ప్రేక్షకులు. కానీ ట్రైలర్ చూస్తే అలాంటి ఆశలేమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టమవుతోంది. ఒరిజినల్‌ నుంచి సీన్ టు సీన్ ఉన్నదున్నట్లు దించేసినట్లుగా కనిపిస్తోంది. ట్రైలర్లో కనిపించిన ప్రతి షాట్‌ ‘అసురన్’లో చూసిందే కావడం గమనార్హం. దాంతో పోలికలను పక్కన పెట్టేసి మామూలుగా చూస్తే ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తిని రేకెత్తించేలా ఉంది ‘నారప్ప’ ట్రైలర్. ఐతే బలమైన కథాకథనాలతో తెరకెక్కిన ‘అసురన్’లో ఈ సీన్ బాలేదు అంటూ ఏదీ ఉండదు. ఫ్లాష్ బ్యాక్ ఒక్కటి కొంచెం ల్యాగ్ అనిపిస్తుందంతే....

మా సోనూ అంకుల్ నే కొడతావా..? టీవీ పగలకొట్టిన బుడ్డోడు..!

ప్రంచాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేసేసింది. ఈ కరోనా వేళ.. చాలా మంది సామాన్యులు అల్లాడిపోయారు. అలాంటి సమయంలో… బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ఏకైక హీరో సోనూసూద్. గతేడాది నుంచి ఇప్పటి వరకు.. ఆయన తనకు తోచిన సాయం చేస్తూనే ఉన్నారు. దీంతో.. ఆయన జనాల ముందు రియల్ హీరో అనిపించుకున్నారు. కాగా.. తాజాగా సోనూసూద్‌పై అభిమానం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఓ చిన్నారి చేసిన పనే అందుకు సాక్ష్యం కావడం గమనార్హం. ఇంతకీ ఏం జరిగిందంటే… న్యాల్‌కల్‌లోని ఎస్సీ కాలనీకి చెందిన పుష్పలతా సిహెచ్‌ ప్రణరుకుమార్‌ల కుమారుడు విరాట్‌ హుజూర్‌నగర్‌లోని శ్రీచైతన్య స్కూల్‌లో 3 వ తరగతి చదువుతున్నాడు. కరోనా కారణంగా పాఠశాలలు మూతపడటంతో ఇటీవల న్యాల్‌కల్‌కు వచ్చారు. సోమవారం రాత్రి ఇంట్లో మరదలు అద్విన్‌తో కలిసి విరాట్‌, టీవీలో దూకుడు సినిమా చూస్తున్నాడు. ఈ క్రమంలో హీరో మహేశ్‌బాబుకు విలన్‌ సోనూసూద్‌కు మధ్య ఫైటింగ్‌ సీన్‌ జరుగుతుంది. సోనూసూద్‌ను కొట్టడాన్ని చూసిన బుడతడు విరాట్‌కు తీవ్ర కోపం వచ్చింది. కరోనా టైంలో ఎంతో మందిని ఆదుకున్న సోనూసూద్‌ అంకుల్‌ని కొడతావా ? అంటూ వెంటనే బయటకు వెళ్లి ఓ రాయి తెచ్చి టీవీపై విసిరికొట్టాడు. ...

బ్రేకింగ్ : పవన్ సినిమా నుండి సినిమాటోగ్రాఫర్ ఔట్

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాగర్ కె చంద్ర ఈ సినిమాను రూపొందిస్తున్నారు. త్రివిక్రమ్ మాటలు-స్క్రీన్ ప్లే అందిస్తోన్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ముందుగా టాప్ సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్లను తీసుకున్నారు. గతంలో ఆయన ఎన్నో హిట్టు సినిమాలకు పని చేశారు. పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’, ‘కాటమరాయుడు’ లాంటి సినిమాలకు సైతం ప్రసాద్ మూరెళ్ల ఛాయాగ్రాహకుడిగా పని చేశారు. ఆ బంధంతోనే మరోసారి పవన్ సినిమా కోసం ఆయన్ను తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. కారణం ఏంటనేది క్లారిటీ లేనప్పటికీ.. ఆయన తప్పుకున్నారనే విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు ఆయన స్థానంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ ను తీసుకున్నట్లు సమాచారం. ఎక్కువగా తమిళ, మలయాళ సినిమాలకు పని చేసిన రవిచంద్రన్ ‘భరత్ అనే నేను’ సినిమాతో టాల...

‘రాక్షసుడు 2’లో హీరో ఎవరంటే..?

తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘రాక్షసన్’ సినిమాను తెలుగులో ‘రాక్షసుడు’ అనే పేరుతో రీమేక్ చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో దర్శకుడు రమేష్ వర్మ ట్రాక్ లో పడ్డాడు. దెబ్బకి రవితేజని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో ‘ఖిలాడి’ అనే సినిమా రాబోతుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ‘రాక్షసుడు’ సినిమాకి సీక్వెల్ ను ప్రకటించారు. నిజానికి తమిళంలో అయితే సీక్వెల్ రాలేదు. ‘రాక్షసుడు 2’ని మనవాళ్లే తెలుగులో ప్లాన్ నచ్చేస్తున్నారు. దీనికి కావాల్సిన కథ కూడా సిద్ధంగా ఉంది. కానీ ఇందులో ఎవరిని హీరోగా తీసుకోబోతున్నారనే విషయంలో క్లారిటీ లేదు. ముందుగా బెల్లంకొండ శ్రీనివాస్ నే హీరోగా అనుకున్నారు కానీ అతడు సిద్ధంగా లేడని సమాచారం. ఆయన చేతుల్లో హిందీ ‘ఛత్రపతి’ ఉంది. అలానే పెన్ స్టూడియోస్ బ్యానర్ పై మరో సినిమా ఒప్పుకున్నాడు. ఈ సినిమాలను పూర్తి చేయడానికి కాస్త సమయం పడుతుంది. అంతకాలం ఎదురుచూడలేక దర్శకుడు రమేష్ వర్మ మరో హీరోతో సినిమా తీయాలనుకుంటున్నాడు. ముందుగా మీడియం రేంజ్ హీరోలను అనుకున్నప్పటికీ.. ఇప్ప...

ఫ్యామిలీ మ్యాన్ త‌ర్వాత ఫేక్

హిందీలో తాము తీసిన సినిమాల‌ను మించి ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో మంచి పేరు సంపాదించారు ద‌ర్శ‌క ద్వ‌యం రాజ్‌-డీకే. తెలుగు వారే అయిన ఈ ఇద్ద‌రు ద‌ర్శ‌కులు.. బాలీవుడ్లో క‌ష్ట‌ప‌డి ఎదిగారు. త‌మ‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వాళ్ల పేర్లు ఇప్పుడు ఒక బ్రాండ్ అంటే అతిశ‌యోక్తి కాదు. రాజ్-డీకే సొంతంగా తీసే సినిమాలైనా.. వాళ్లు నిర్మించే చిత్రాలైనా చాలా ప్ర‌త్యేకంగా ఉంటాయ‌న్న పేరుంది. ఇక ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో వాళ్ల‌కొచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. ఇండియాలో అత్యంత ఆద‌ర‌ణ పొంది, అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌నూ అల‌రించిన సిరీస్‌గా ఇది నిలిచిపోయింది. ఇటీవ‌లే వ‌చ్చిన సీజ‌న్ 2 కూడా సూప‌ర్ హిట్ కావ‌డం తెలిసిందే. దీని త‌ర్వాత రాజ్-డీకే.. షాహిద్ క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌లో ఓ సిరీస్ తీయ‌బోతున్న‌ట్లు వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ వార్త‌లు నిజ‌మే అని రూఢి అయింది. షాహిద్ ప్ర‌ధాన పాత్ర‌లో ఫేక్ అనే సిరీస్ తీయ‌బోతున్నార‌ట ఈ ద‌ర్శ‌క ద్వ‌యం. ఫేక్ క‌రెన్సీ రాకెట్ నేప‌థ్యంలో ఈ సిరీస్ న‌డుస్తుంద‌ట‌. వ‌చ్చే ఏడాది ఓ ప్ర‌ముఖ ఓటీటీ కోసం ఈ సిరీస్‌ను మొద‌లుపెట్ట‌నున్నార‌ట‌. ప్ర‌స్తుతం రాజ్‌-డీకే ఫ్యామిలీ ...

అనుష్క సినిమా క్యాన్సిల్ అయిందా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క చివరిగా నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. ఓటీటీలో విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మూగ, చెవిటి పాత్రలో అనుష్క లీనమై నటించినప్పటికీ సినిమా మాత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా తరువాత ఆమె మరో సినిమా ఒప్పుకోలేదు. అయితే కొన్ని రోజులుగా యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి అనుష్క ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. మహేష్ పి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారు. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తీయాలనుకున్నారు. త్వరలోనే అనౌన్స్మెంట్ వస్తుందని అభిమానులు ఎదురుచూశారు. కానీ ఇప్పుడు ఈ సినిమా పట్టాలెక్కకుండానే ఆగిపోయిందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మేకర్స్ లో పునరాలోచన మొదలైందట. అందుకే ఇప్పటివరకు అఫీషియల్ గా ప్రకటించలేదట. సరైన కారణాలు తెలియనప్పటికీ.. ప్రస్తుతానికైతే ఈ సినిమాను పక్కన పెట్టినట్లు సమాచారం. అనుష్కకి కూడా ఇప్పట్లో సినిమా చేసే ఆలోచన లేదని తెలుస్తోంది. మరింత సమయం గ్యాప్ తీసుకోవాలని అనుకుంటుంది. ఇక నవీన్ పోలిశెట్టి ‘జాతిరత్నాలు’ సినిమాతో ప్రేక్షకులను అలరించి టాక్ ఆఫ్ ది టౌన్ గా ...

గంగూలీపై సినిమా రాబోతోంది

స్పోర్ట్స్ బ‌యోపిక్.. గ‌త ద‌శాబ్ద కాలంలో బాలీవుడ్లో బాగా డిమాండ్ పెరిగిన జాన‌ర్. బాగ్ మిల్కా బాగ్, ఎం.ఎస్.ధోనిః ది అన్ టోల్డ్ స్టోరీ లాంటి చిత్రాలు ఘ‌న‌విజ‌యం సాధించ‌డంతో క్రీడాకారుల జీవితాల ఆధారంగా వ‌రుస‌బెట్టి బ‌యోపిక్స్ తీసేస్తున్నారు. దిగ్గ‌జ క్రికెట‌ర్ స‌చిన్ టెండుల్క‌ర్ మీద కూడా స‌చిన్ః ఎ బిలియ‌న్ డ్రీమ్స్ అనే డాక్యుమెంట‌రీ టైపు సినిమా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక క్రికెట‌ర్ల‌లో అంద‌రూ చూడాల‌నుకునే బ‌యోపిక్స్‌లో సౌర‌భ్ గంగూలీది క‌చ్చితంగా ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. దాదా అభిమానులు అత‌డి సినిమా కోసం ఎంత‌గానో ఎదురు చూస్తున్నారు. ఎట్ట‌కేల‌కు ఈ దిశ‌గా అడుగు పడింది. త‌న బ‌యోపిక్ రాబోతున్న‌ట్లు స్వయంగా గంగూలీనే వెల్ల‌డించ‌డం విశేషం. త‌న బయోపిక్‌కు అంగీకారం తెలిపాన‌ని.. దీని గురించి చాలా రోజులుగా చ‌ర్చ‌లు జ‌రుగ‌తున్నాయ‌ని.. త్వ‌ర‌లోనే ఈ సినిమా మొద‌ల‌వుతుంద‌ని.. దీని ద‌ర్శ‌కుడు, ఇత‌ర వివ‌రాలు త‌ర్వాత వెల్ల‌డవుతాయ‌ని గంగూలీ చెప్పాడు. దాదాపు రూ.250 కోట్ల బ‌డ్జెట్‌తో గంగూలీ బ‌యోపిక్ తీయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌ని.. బాలీవుడ్ స్టార్ ర‌ణ‌బీర్ క‌పూర్ దాదా పాత్ర‌లో న‌టిస్తాడ‌ని బాలీవుడ...

‘రోజా’ కాంబినేషన్.. ఎన్నేళ్లకెన్నేళ్లకు

90ల్లో బాగా సినిమాలు చూసి ఆస్వాదించిన ప్రేక్షకులకు ‘రోజా’ ఒక మరపురాని జ్ఞాపకం. మణిరత్నం ప్రతిభ ఏంటో దేశం మొత్తానికి తెలిసేలా చేసిన చిత్రమిది. ఇందులో టైటిల్ రోల్ పోషించిన మధుబాల, ఆమెకు జోడీగా నటించిన అరవింద్ స్వామిలకు ఎంత పేరొచ్చిందో.. ఆ జోడీ ప్రేక్షకులకు ఎంతగా నచ్చిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వీళ్లిద్దరూ కలిసి చేసింది ఒకే సినిమా. కానీ ఆ సినిమాతో ఎవర్ గ్రీన్ పెయిర్ అనిపించుకున్నారు. వాళ్లిద్దరూ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతారు. మామూలుగా ఒక హిట్, క్లాసిక్ సినిమాలో నటించిన నటీనటుల్ని కలిపి మళ్లీ సినిమాలు తీయడం మామూలే. కానీ ఎందుకోగానీ ఎవ్వరూ అరవింద్, మధులతో మళ్లీ ఓ సినిమా చేయలేదు. కథానాయికగా మధు కెరీర్ ఎక్కువ కాలం కొనసాగకపోవడం.. అరవింద్ స్వామి కూడా మధ్యలో బ్రేక్ తీసుకోవడం ఇందుకు కారణం కావచ్చు. ఐతే ఈ జోడీని దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ కలిసి చూసే అవకాశం దక్కబోతోంది. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఎ.ఎల్.విజయ్ ‘తలైవి’ సినిమా తీసిన సంగతి తెలిసిందే. జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో అరవింద్ స్వామి ఎంజీఆర్ పాత్రలో కనిపించనున్నాడు. ఎంజీఆర్‌గా అతడి ట్రాన్స్‌ఫర్మేషన్ చూసి ...

నెట్ ఫ్లిక్స్‌లో విరాటపర్వం?

ఎగ్జిబిటర్లు తీవ్ర హెచ్చరికలు చేసినా.. అభిమానుల నుంచి కూడా వ్యతిరేకత వచ్చినా అగ్ర నిర్మాత సురేష్ బాబు వెనక్కి తగ్గలేదు. తన నిర్మాణంలో తెరకెక్కిన మూడు చిత్రాల్లో ఒకదాన్ని ఇప్పటికే ఓటీటీ రిలీజ్‌కు రెడీ చేసేశారు. అదే.. నారప్ప. ఈ నెల 20న ఈ సినిమా అమేజాన్ ప్రైమ్ ద్వారా విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు సురేష్ ప్రొడక్షన్స్ భాగస్వామ్యంలో రూపొందించిన ‘దృశ్యం-2’, ‘విరాటపర్వం’ చిత్రాలను కూడా సురేష్ ఓటీటీలకు ఇచ్చేసినట్లుగా వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఐతే వాటి గురించి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ‘దృశ్యం-2’ ప్రైమ్ లేదా హాట్ స్టార్‌లో రావచ్చని అంటున్నారు. కాగా ‘విరాటపర్వం’ మీద ముందు నుంచి ఒక స్పష్టత లేదు. ఆ చిత్రం థియేటర్లలోనే రిలీజవుతుందని కొందరు.. లేదు లేదు ఓటీటీ డీల్ విషయంలో చర్చలు తుది దశలో ఉన్నాయని.. అది కూడా డిజిటల్ రిలీజ్‌కు సిద్ధమవుతోందని కొందరు అంటూ వచ్చారు. కాగా తాజా సమాచారం ప్రకారం ‘విరాటపర్వం’కు కూడా ఓటీటీ డీల్ పూర్తయిందట. దీన్ని స్ట్రీమింగ్ జెయింట్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. నెట్ ఫ్లిక్స్ వాళ్లు ఎక్కువగా క్లాస్ టచ్ ఉన్న సినిమాలను కొంటుంటారు. ‘విరాటపర్వం’ న...

ట్రైలర్ టాక్: డిష్యుం డిష్యుం డిష్యుం

Image
అట్టకత్తి, మద్రాస్ లాంటి వైవిధ్యమైన సినిమాలతో తమిళంలో దర్శకుడిగా బలమైన ముద్ర వేసిన దర్శకుడు పా.రంజిత్. ఈ రెండు చిత్రాలతో అతను సూపర్ స్టార్ రజినీకాంత్ దృష్టిని ఆకర్షించాడు. వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘కబాలి’ చుట్టూ విడుదలకు ముందు ఎంత హైప్ నెలకొందో తెలిసిందే. కానీ ఆ హైప్‌కు తగ్గట్లు సినిమా లేకపోయింది. ఆ సినిమా నిరాశ పరిచినప్పటికీ రజినీ.. మళ్లీ రంజిత్‌తో కలిసి ‘కాలా’ చేశాడు. ఇది కూడా అనుకున్నంతగా ఆడలేదు. ఈ సినిమా తర్వాత రంజిత్ చాలా గ్యాప్ తీసుకుని ఆర్య హీరోగా ‘సర్పాట్ట: పరంపరై’ అనే సినిమా తీశాడు. ఈ చిత్రం ఈ నెల 22న అమేజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో దీని ట్రైలర్ లాంచ్ చేశారు. ‘సర్పాట్ట’ బాక్సింగ్ చుట్టూ తిరిగే ఒక ఎమోషనల్ స్టోరీ. బాక్సర్‌గా ఆర్య పెర్ఫామెన్స్ సినిమాలో మేజర్ హైలైట్ అని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. బ్రిటిష్ కాలంలో వాళ్ల దగ్గర పని చేసే తమిళ వ్యక్తులు బాక్సింగ్ నేర్చుకుని.. తర్వాత బ్రిటిష్ వారితోనే పోటీ పడి గెలవడం.. ఆ తర్వాత ఈ బాక్సింగ్ ఆ వర్గంలో ఒక సంస్కృతిగా మారడం.. ఆపై వారిలో వారికే వర్గాలు రావడం.. గొడవలు పడటం.. ఈ నేపథ్యంలో ‘సర్పాట్ట’ నడుస్తుంది...

మహేష్ హీరోయిన్.. అదరగొట్టిందిగా

Image
మహేష్ బాబు మూవీ ‘1 నేనొక్కడినే’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన భామ కృతి సనన్. ఆ తర్వాత నాగచైతన్యతో ‘దోచేయ్’లోనూ నటించింది. కానీ ఈ రెండు చిత్రాలూ డిజాస్టర్లవడంతో తెలుగులో ఆమె కెరీర్ ముందుకు సాగలేదు. కానీ హిందీ మంచి మంచి అవకాశాలందుకుని అక్కడ సెటిలైపోయింది కృతి. ప్రస్తుతం ‘ఆదిపురుష్’ లాంటి భారీ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా నటిస్తోంది కృతి. దాని కంటే ముందు కృతి నటించిన ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఆ చిత్రమే.. మిమి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. అది ఆద్యంతం హిలేరియస్‌గా ఉండి.. ఇన్‌స్టంట్‌గా ప్రేక్షకులకు ఎక్కేస్తోంది. ‘మిమి’ సరోగసీ (అద్దె గర్భం) చుట్టూ నడిచే సినిమా కావడం విశేషం. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ భలే పాయింట్ పట్టుకుని ఆద్యంతం సినిమాను వినోదాత్మకంగా నడిపిించినట్లున్నాడు. ‘మిమి’ కథ విషయానికి వస్తే.. డబ్బు మీద బాగా ఆశ ఉన్న ఒక మధ్య తరగతి అమ్మాయి ముందుకు ఒక ప్రపోజల్ వస్తుంది. ఒక విదేశీ జంట కోసం ఆమె సరోగసీ ద్వారా బిడ్డను కంటే రూ.20 లక్షలు చెల్లిస్తారన్నదే ఆ ప్రపోజల్. కొన్ని నెలల పాటు తల్లిదండ్రులకు కూడా కనిపించక...

దుల్కర్ సినిమాలో అక్కినేని హీరో!

హీరోగా ఎన్నో సినిమాలు చేసిన సుమంత్ కి ఆ తరువాత అవకాశాలు తగ్గాయి. నాలుగేళ్ల క్రితం ఈ హీరో నటించిన ‘మళ్లీ రావా’ సినిమా సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో సుమంత్ కి వరుస అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలో చాలా సినిమాల్లో నటించాడు. కానీ ఏదీ వర్కవుట్ కాలేదు. దీంతో కొన్నాళ్లుగా సినిమా అవకాశాలు లేక వెండితెరకు దూరమయ్యాడు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ లాంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు హను రాఘవపూడి.. దుల్కర్ సల్మాన్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులో దుల్కర్ లెఫ్టనెంట్ రామ్ అనే పాత్రలో కనిపించనున్నారు. 1964లో జరిగిన పీరియాడిక్ ప్రేమ కథ నేపథ్యంలో ఈ సినిమాను తెరక్కేక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పనులు హైదరాబాద్ లో జరుగుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ సినిమా కోసం స్పెషల్ సెట్ ను నిర్మిస్తున్నారు. ఇందులో దుల్కర్ తో పాటు ఎప్పుడూ ఉండే ఓ క్యారెక్టర్ లో సుమంత్ కనిపించబోతున్నారట. ఫుల్ లెంగ్త్ రో...

స్టార్ రైటర్ చేతికి చరణ్-శంకర్ సినిమా

ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ రైటర్ అంటే సాయిమాధవ్ బుర్రానే. క్రిష్ తీసిన కృష్ణం వందే జగద్గురుం, కంచె లాంటి సినిమాలతో మంచి పేరు సంపాదించిన సాయిమాధవ్.. ఆ తర్వాత చాలామంది పేరున్న దర్శకులు, హీరోలతో పని చేశాడు. రెండేళ్ల కిందట ఆయనకు కెరీర్లోనే అతి పెద్ద అవకాశం దక్కింది. తెలుగులో ప్రతి రచయితా కలలు కనే మెగాస్టార్ చిరంజీవి సినిమాకు పని చేసే అవకాశం ఆయనకు దక్కింది. చిరు కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ‘సైరా: నరసింహారెడ్డి’కి ఆయన సంభాషణలు రాశారు. దిగ్గజ రచయితలు పరుచూరి సోదరులు అందించిన కథకు ఆయన మాటలు రాయడం విశేషం. ఇందులో సాయిమాధవ్ మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ చిత్రానికి సంభాషణలు రాసే అవకాశం దక్కించుకున్నాడు సాయిమాధవ్. ఇందులో చరణ్‌తో పాటు తారక్ కూడా హీరోగా నటిస్తుండగా.. ఇప్పుడు చరణ్ సోలో సినిమాకు కూడా సాయిమాధవ్ మాటలు అందించనున్నాడు. ‘ఆర్ఆర్ార్’ తర్వాత చరణ్ హీరోగా శంకర్ రూపొందించనున్న చిత్రానికి సంభాషణలు రాసే బాధ్యత సాయిమాధవ్‌కే అప్పగించారు. శంకర్ సినిమాల్లో మాటలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఐతే ఇప్పటిదాకా తమిళ వెర్షన్లు చూసి తెలుగులో ...

నిఖిల్ కొత్త టైటిల్.. ‘దైవం మనుష్య రూపేణా’!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ మొదటి నుండి కూడా సరికొత్త కథలను ఎన్నుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఒకానొక సమయంలో వరుస హిట్స్ తో మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యారు. ఇప్పుడు కూడా వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీగా గడుపుతున్నారు. ఇటీవలే ’18 పేజెస్’ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. నిఖిల్ ప్రస్తుతం ‘కార్తికేయ’ సీక్వెల్ లో నటిస్తున్నారు. 2014లో వచ్చిన ‘కార్తికేయ’ సినిమా ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. ఇంతకాలానికి ఈ సినిమాకి సీక్వెల్ రెడీ అవుతోంది. చందు మొండేటి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ ను ఇటీవలే పునః ప్రారంభించారు. ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్ ‘కార్తికేయ 2’. అయితే ఇప్పుడు దర్శక నిర్మాతలు ఈ సినిమాకి టైటిల్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ‘దైవం మనుష్య రూపేణా’ అనే టైటిల్ ను సినిమాకి పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. నిఖిల్ కి కూడా టైటిల్ బాగా నచ్చిందట. కథ ప్రకారం ఈ సినిమాన...

మాస్ రాజా.. ఈ గిల్లుడేంది?

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణకు, మాస్ రాజా రవితేజకు ఒకరంటే ఒకరికి పడదని.. వీళ్లిద్దరి మధ్య ఏదో గొడవ ఉందని సోషల్ మీడియాలో తరచుగా చర్చ జరుగుతూ ఉంటుంది. ఒక హీరోయిన్ విషయమై ఇద్దరికీ ఏదో వివాదం నడిచినట్లుగా చెబుతుంటారు. ఆ సంగతలా వదిలేస్తే.. బాక్సాఫీస్ దగ్గర వీరి మధ్య కొన్ని ఆసక్తికర సమరాలు జరిగాయి. వివిధ సమయాల్లో ఒక్కమగాడు-కృష్ణ.. మిత్రుడ-కిక్.. పరమవీరచక్ర-మిరపకాయ్.. ఇలా ఈ ఇద్దరి చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డాయి. ప్రతిసారీ బాలయ్యపై రవితేజనే పైచేయి సాధించాడు. ఈ ఏడాది మరోసారి బాలయ్య, రవితేజ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడాల్సింది. మే 28న వీరి చిత్రాలు అఖండ, ఖిలాడి విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలనే పంతంతోనే ఒకే రోజు బాక్సాఫీస్ దగ్గర పోటీకి రెడీ అయ్యారంటూ ఆ మధ్య అందరూ ఆసక్తిగా చర్చించుకున్నారు. కానీ ఆ పోటీ సాధ్యపడలేదు. ఐతే ఇప్పుడు రవితేజ కొత్త సినిమా టైటిల్‌ను ప్రకటించిన నేపథ్యంలో మరోసారి బాలయ్య-రవితేజ వైరం తెరపైకి వచ్చింది. కొన్నేళ్ల కిందట బాలయ్య ‘రామారావు’ పేరుతో ఓ సినిమా చేయాలనుకున్నాడు. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్...

నారప్ప ఎటూ కాకుండా వస్తున్నాడే..

మొత్తానికి ‘నారప్ప’ విడుదల విషయంలో ఓ స్పష్టత వచ్చేసింది. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిపోయింది. ఈ చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్‌లో ఈ నెల 20న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. స్వయంగా వెంకటేషే ఈ విషయాన్ని వెల్లడిస్తూ ట్వీట్ కూడా పెట్టాడు. ఐతే ఈ చిత్రం జులై 23 లేదా 24న వస్తుందని ముందు ప్రచారం జరిగింది. మామూలుగా కొత్త చిత్రాలు విడుదలయ్యేది శుక్రవారం రోజే. థియేటర్లలో విడుదల చేసినా.. ఓటీటీలో వదిలినా నిర్మాతలు శుక్రవారం సెంటిమెంటును పాటిస్తుంటారు. పండుగలప్పుడు, ఇంకేమైనా విశేషమైన డేట్లు ఉన్నపుడు రోజులు మారుతుంటాయి కానీ.. అలాంటి ప్రత్యేక సందర్భం లేకుంటే శుక్రవారమే కొత్త చిత్రాలు విడుదలవుతుంటాయి. కానీ ‘నారప్ప’ను మాత్రం మంగళవారం రోజు రిలీజ్ చేస్తున్నారు. పేరుకు మంగళవారం కానీ.. ఎప్పట్లాగే అమేజాన్ ప్రైమ్‌లో ముందు రోజు రాత్రి పది గంటల ప్రాంతంలో సినిమా రిలీజవుతుందని భావిస్తున్నారు. శుక్రవారం సెంటిమెంటు కాదని.. ఇలా ఎటూ కానీ రోజున ‘నారప్ప’ను ఎందుకు రిలీజ్ చేశారో జనాలకు అర్థం కావడం లేదు. బహుశా 23న, శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెర...

రామ్ కి విలన్ గా స్టార్ హీరో..?

టాలీవుడ్ లో ఇప్పటికే చాలా మంది తమిళ నటులు గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏకంగా స్ట్రెయిట్ తెలుగు సినిమాల్లో నటించేస్తున్నారు. దీంతో మన హీరోలు కూడా తెలుగు, తమిళ బైలింగ్యువల్ అని.. పాన్ ఇండియా సినిమాలంటూ హడావిడి మొదలుపెట్టారు. హీరో రామ్ కూడా రీసెంట్ గా ఓ బైలింగ్యువల్ కథను అంగీకరించారు. దర్శకుడు లింగుస్వామి రూపొందించనున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. రామ్ తొలిసారిగా ఈ సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుండడంతో ముందుగానే విలన్ గా తమిళ హీరోని తీసుకోవాలని భావించారు. ఆ లిస్ట్ లో చాలా మంది పేర్లను పరిశీలించారు. ఫైనల్ గా హీరో ఆర్యను తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఆర్యకు తెలుగునాట మంచి పేరే ఉంది. గతంలో ‘వరుడు’ సినిమాలో విలన్ గా కనిపించారు. అలానే ఆయన నటించిన తమిళ సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. ఆ విధంగా ఆర్య తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇప్పుడు రామ్ సినిమాలో విలన్ గా దాదాపుగా ఆర్యనే తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రామ్ పాత్రకు ధీటుగా ఆర్య పాత్ర ఉంటుందట. ఆర్య సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ప్రకటన వస్తుందని అంటున్నారు. ఇ...

మంచు విష్ణు మాస్టర్ స్ట్రోక్

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఎప్పుడు జరుగతాయో ఏమో స్పష్టత లేదు కానీ.. దాని గురించి మీడియాలో, సోషల్ మీడియాలో చర్చ ఆగట్లేదు. ఇప్పటికే ఉన్న కార్యవర్గం.. కొత్తగా పోటీ చేయాలనుకుంటున్న వాళ్లు.. అలాగే మిగతా వాళ్లు తరచుగా మీడియా ముందుకొచ్చి ఆసక్తికర ప్రకటనలు చేస్తున్నారు. సెన్సేషనల్ కామెంట్లూ చేస్తున్నారు. ‘మా’ ఎన్నికలు ఆలస్యమవుతాయన్న ప్రచారం నేపథ్యంలో కొన్ని రోజులుగా స్తబ్దత నెలకొంది కానీ.. ఇప్పుడు మంచు విష్ణు లైన్లోకి వచ్చి ఆసక్తికర స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈసారి అధ్యక్ష పదవికి పోటీలో ఉన్నట్లుగా ఇప్పటికే ప్రకటించిన మంచు విష్ణు.. తాను అధ్యక్షుడిగా గెలిస్తే ‘మా’ భవన నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని హామీ ఇవ్వడం విశేషం. ‘మా’ సభ్యుల్ని ఉద్దేశించి రిలీజ్ చేసిన వీడియోలో విష్ణు ఈ మాట చెప్పాడు. ‘మా’ అధ్యక్షుడిగా పోటీ చేస్తానని ప్రకటించినపుడే.. ‘మా’ భవన నిర్మాణానికి అయ్యే ఖర్చులో 25 శాతం భరిస్తానని గతంలోనే తాను హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశాడు విష్ణు. ఆ హామీకి కట్టుబడి ఉంటాడనుకున్నారు కానీ.. ఏకంగా మొత్తం ఖర్చు మొత్తం భరిస్తానని అనడం ద్వారా విష్ణు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చినట్ల...

ఆ సినిమాను అలా వదిలేశాడేంటి?

తెలుగు తెరకు నటుడిగా పరిచయం అయి.. ఆ తర్వాత రచయితగా మారి.. చివరగా దర్శకుడి అవతారం ఎత్తాడు హర్షవర్ధన్. అతడిలో ఒక రచయిత.. దర్శకుడు ఉన్నాడని చాలా కాలం వరకు తెలియలేదు. బుల్లితెరపై.. వెండి తెరపై చాలా కాలం నటుడిగానే ఉండిపోయాడతను. ఆపై ‘అమృతం’ సీరియల్లో కొన్ని ఎపిసోడ్లు డైరెక్ట్ చేయడం.. రచనలోనూ పాలుపంచుకోవడం ద్వారా తనలోని మరో కోణాన్ని బయటపెట్టాడు. తర్వాత ‘ఇష్క్’.. ‘గుండె జారి గల్లంతయ్యిందే’.. ‘మనం’ లాంటి సినిమాలతో రైటర్‌ గా తన బలాన్ని చూపించాడు. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే సినిమాతో అతను దర్శకుడిగా అరంగేట్రం చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ చిత్రం నాలుగేళ్ల ముందే పూర్తయింది. అప్పట్లో ఈ సినిమాకు సంబంధించి ఒక వెరైటీ ట్రైలర్ కూడా వదిలాడు హర్ష. మధ్యలో ‘గూగ్లీ’ అంటూ ఈ సినిమాకు టైటిల్ కూడా మార్చి విడుదలకు సన్నాహాలు చేశారు. కానీ ఏం జరిగిందో ఏమో.. ఈ సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయింది. ఈ చిత్రం గురించి హర్ష కూడా మాట్లాడట్లేదు రెండేళ్లుగా. ఒకప్పట్లాగే నటుడిగా కొనసాగుతున్న అతను.. ఎట్టకేలకు మళ్లీ తన క్రియేటివ్ టాలెంట్ చూపించడానికి సిద్ధమయ్యాడు. సుధీర్ బాబు హీరోగా ప్రస్తుతం టాలీవుడ్లో హ్యాపెనింగ్ బేనర్...

సూర్య సూపర్ మూవీ హిందీలోకి..

బాలీవుడ్లో కొత్త కథలు పూర్తిగా అడుగంటి పోతున్నట్లే కనిపిస్తోంది పరిస్థితి చూస్తుంటే. సౌత్‌లో ఒక సినిమా హిట్టయిందంటే అది రీమేక్ కావాల్సిందే అన్నట్లుగా కనిపిస్తోంది వ్యవహారం. ఓ మోస్తరు సినిమాలను సైతం బాలీవుడ్ వాళ్లు వదలట్లేదు. ప్రస్తుతం హిందీలో రెండంకెల సంఖ్యలో సౌత్ సినిమాల రీమేక్‌లు తెరకెక్కుతున్నాయి. తాజాగా మరో దక్షిణాది చిత్రం హిందీలోకి వెళ్లబోతోంది. ఆ చిత్రమే.. సూరారై పొట్రు. సూర్య ప్రధాన పాత్రలో తెలుగమ్మాయే అయిన సుధ కొంగర తమిళంలో రూపొందించిన ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో వచ్చింది. గత ఏడాది కొవిడ్ టైంలో థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేస్తూ ఈ భారీ చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన వచ్చింది. చాలా ఏళ్లుగా సరైన విజయం లేని సూర్యకు ఈ చిత్రం మంచి ఫలితాన్నందించింది. గత ఏడాది ఇండియాలో రిలీజైన అత్యుత్తమ చిత్రాల్లో దీన్నొకటిగా చెప్పొచ్చు. విడుదల తర్వాత క్లాసిక్ స్టేటస్ అందుకున్న ‘సూరారై పొట్రు’ను హిందీలోకి సూర్యనే తీసుకెళ్తున్నాడు. సూర్య, ఆయన భార్య జ్యోతిక కలిసి ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి ‘సూరారై పొట్రు’ను రీమేక్ చేయబోత...

క్లాసిక్ కాంబినేషన్ మళ్లీ..

కొన్ని సినిమాలు రిలీజైనపుడు ఓ మోస్తరుగా ఆడుతుంటాయి. కమర్షియల్‌గా మరీ పెద్ద సక్సెస్ ఏమీ సాధించవు. కానీ కాల క్రమంలో అవి క్లాసిక్స్ లాగా నిలిచిపోతాయి. చూడగా చూడగా ప్రేక్షకులకు అవి బాగా నచ్చేస్తాయి. వాటి గొప్పదనం లేటుగా అర్థమవుతుంది. నాని సినిమా ‘జెర్సీ’ ఈ కోవకే చెందుతుంది. ‘మళ్ళీ రావా’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రూపొందించిన ఈ చిత్రం రెండేళ్ల కిందట విడుదలైంది. ఆ సినిమా ఆ సమయానికి హిట్టే అయింది కానీ.. దాని స్థాయికి పెద్ద బ్లాక్‌బస్టర్ కావాల్సిందని అంటారు జనాలు. ఓటీటీలో, టీవీలో ఈ సినిమాకు గొప్ప స్పందనే వచ్చింది. ఈ చిత్రం ఇప్పుడు హిందీలో ‘జెర్సీ’ పేరుతోనే రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ హీరోగా దిల్ రాజు, కరణ్ జోహార్ నిర్మాణంలో గౌతమే ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఐతే దాని తర్వాత గౌతమ్ చేసే సినిమా గురించి ఇప్పటిదాకా రకరకాల ఊహాగాలు వచ్చాయి. కానీ అవేవీ నిజం కాలేదు. ఐతే తాజా సమాచారం ప్రకారం గౌతమ్ మళ్లీ నానితో ఓ సినిమా చేయబోతున్నాడట. త్వరలోనే క్లాసిక్ కాంబినేషన్ రిపీట్ కానున్నట్లు తెలుస్తోంది. నాని హీరోగా ఈసారి ఓ సైనికుడి కథను ఉద్వేగభరితంగా చెప్పడానికి గౌతమ్ సిద్ధమవుతున్నాడట. యుద్ధ రంగం...

పూజా హాట్ నెస్.. తట్టుకోవడం కష్టమే!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది పూజాహెగ్డే. ఆమె చేతిలో క్రేజీ ప్రాజెక్ట్ లు ఎన్నో ఉన్నాయి. బాలీవుడ్ లో కూడా రణవీర్ సింగ్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు ఒప్పుకుంది. అవకాశాల కోసం అందరిలా ఆమె హాట్ ఫోటోషూట్లు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకో ఈ బుట్టబొమ్మ ఇప్పుడు తన హాట్ నెస్ తో అదరగొడుతుంది. వరుస ఫోటోలు షేర్ చేస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. గత రెండు వారాలుగా ఆమె గ్యాప్ లేకుండా ఫోటోషూట్స్ తో ఇన్స్టాగ్రామ్ ను హీటెక్కిస్తోంది. ఇప్పటికే ఆమెకి ఇన్స్టాగ్రామ్ లో 14 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. రోజురోజుకి ఆ నెంబర్ పెరిగిపోతుంది. ఒక్కో కమర్షియల్ పోస్ట్ కి లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకుంటూ బాగా సంపాదిస్తోంది. ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది ఫాలోవర్లు ఉంటే సెలబ్రిటీలకు అంత ఆదాయం. బహుశా అందుకేనేమో పూజాహెగ్డే తన ఫాలోవర్లను పెంచుకునే పనిలో పడింది. వరుస ఫోటోషూట్లలో పాల్గొంటూ వాటిని తన సోషల్ మీద అకౌంట్స్ లో షేర్ చేస్తుంది. తాజాగా అమ్మడు బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని ఓ ఫోటోషూట్ లో పాల్గొంది. ఇందులో పూజా అందాలను చూడడానికి రెండు కళ్లు సరిపోవేమో అన్నట్లుగా ఉంది. ఈ ఫోటోపై నెటిజన్లతో పాటు సె...