అల్లు వారి రామాయణం.. హాట్ అప్‌డేట్స్
రామాయణం మీద ఇండియాలో వివిధ భాషల్లో చాలా సినిమాలే వచ్చాయి ఇప్పటిదాకా. ఐతే వాటన్నింటినీ తలదన్నేలా భారీ స్థాయిలో రామాయణ గాథకు వెండితెర దూరం ఇవ్వాలని కొన్నేళ్ల కిందట టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్, తెలుగువాడే అయిన బాలీవుడ్ ప్రొడ్యూసర్ మధు మంతెన తలపోశారు. వీరి నిర్మాణంలో దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్లో రామాయణం మీద సినిమా తెరకెక్కబోతున్నట్లు అధికారిక ప్రకటనే వచ్చింది. కానీ ఆ సినిమా పట్టాలెక్కడంలో ఆలస్యం జరుగుతోంది. మధ్యలో చాలా కాలం పాటు ఈ సినిమా గురించి చప్పుడు లేకపోవడంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఆ ప్రచారాన్ని ఖండిస్తూ మళ్లీ అప్ డేట్స్ ఇస్తున్నారు. ఇందులో కాస్టింగ్ గురించి ఇప్పటికే కొన్ని ఊహాగానాలు నడిచాయి. ఐతే నిర్మాతల్లో ఒకరైన మధు మంతెన తాజాగా తమ చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో ఇప్పటిదాకా ఎన్నడూ చూడనంత భారీ స్థాయిలో ఈ సినిమాను తీర్చిదిద్దుతామని.. అలాగే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోని అత్యంత పెద్ద స్టార్లు ఈ సినిమాలో నటిస్తారని మధు చెప్పాడు. ఈ ఏడాది దీపావళి నాడు తమ రామాయణంలో ముఖ్య పా...