నాగ్-ప్ర‌వీణ్ స‌త్తారు సినిమా ఆగిందా?


ఇటీవ‌లే వైల్డ్ డాగ్ సినిమాతో ప‌ల‌క‌రించాడు అక్కినేని నాగార్జున‌. దీని త‌ర్వాత ఆయ‌న గ‌రుడ‌వేగ ఫేమ్ ప్ర‌వీణ్ స‌త్తారుతో ఓ సినిమా చేయాల్సిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు ఘ‌నంగా అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. త‌ర్వాత ప్రారంభోత్స‌వం కూడా జ‌రిగింది. ఈ చిత్రం కోస‌మే నాగ్ కొంచెం గ‌డ్డం పెంచి డిఫ‌రెంట్ లుక్‌లోకి కూడా మారాడు.

ఇందులో స్పెష‌ల్ కాప్ పాత్ర చేయ‌నున్న నాగ్.. విదేశాల్లో ఫేమ‌స్ అయిన మార్ష‌ల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంటున్నాడ‌ని.. ఆన్ లైన్ క్లాసులు కూడా తీసుకుంటున్నాడ‌ని కూడా అప్ డేట్స్ బ‌య‌టికి వ‌చ్చాయి. తీరా ఇప్పుడు చూస్తే ఏమో ఈ సినిమాను ఆపేశార‌ని అంటున్నారు. తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టారా.. లేక మొత్తంగా సినిమానే ఆపేశారా అన్న‌దానిపై స్ప‌ష్ట‌త లేదు కానీ.. నాగ్ త‌ర్వాతి సినిమా అయితే ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో కాద‌ట‌.

ఎప్ప‌ట్నుంచో చ‌ర్చ‌ల్లో ఉన్న బంగార్రాజు సినిమాను అతి త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడ‌ట నాగార్జున‌. క‌రోనా ప్ర‌భావం త‌గ్గి మ‌ళ్లీ షూటింగ్స్ మొద‌లు కాగానే ఈ సినిమాకు నాగ్ శ్రీకారం చుట్టునున్నాడ‌ట‌. ఆఫీస‌ర్‌లో పోలీస్ పాత్ర చేసిన నాగ్.. త‌క్కువ గ్యాప్‌లో వైల్డ్ డాగ్‌లో స్పెష‌ల్ పోలీస్‌గా నటించాడు. ప్ర‌వీణ్ ద‌ర్శ‌క‌త్వంలో చేయాల్సిన సినిమాలోనూ ఆయ‌న కాప్ క్యారెక్ట‌రే అని.. అదొక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ అని వార్త‌లొచ్చాయి. వైల్డ్ డాగ్‌కు థియేట‌ర్ల‌లో స‌రైన రెస్పాన్స్ రాని సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో త‌ర్వాత కూడా అలాంటి సినిమానే చేస్తే ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని భావించి.. అభిమానుల కోరిక మేర‌కు ఒక మాస్ మ‌సాలా సినిమా చేయాల‌న్న ఉద్దేశంతోనే బంగార్రాజును నాగ్ లైన్లో పెట్టి ఉండొచ్చంటున్నారు. మ‌రోవైపేమో ప్ర‌వీణ్‌తో క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ కార‌ణంగా ఈ సినిమా ఆగిపోయింద‌నే ప్ర‌చార‌మూ జ‌రుగుతుండ‌టం గ‌మ‌నార్హం.



https://ift.tt/3nnqUC7 https://ift.tt/eA8V8J

Comments