‘రాజుగారి గది 4’ స్క్రిప్ట్ రెడీ : ఓంకార్
బుల్లితెరపై యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి దర్శకుడిగా ఎదిగారు ఓంకార్. తన క్రియేటివ్ ఐడియాలతో ఎన్నో రియాలిటీ షోలను విజయవంతంగా నడిపించారు. ప్రస్తుతం ఆయన ‘సిక్స్త్ సెన్స్’ నాల్గో సీజన్ తో మళ్లీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ‘జీనియస్’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఓంకార్ ఆ తరువాత ‘రాజు గారి గది’ ఫ్రాంచైజీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన మొదటి రెండు పార్ట్ లు ప్రేక్షకులను అలరించాయి.
ఓంకార్ తమ్ముడు అశ్విన్, అవికా గోర్ కాంబినేషన్ లో వచ్చిన ‘రాజు గారి గది 3’ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో ఇక ఈ ఫ్రాంచైజీలో సినిమాలు రావేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు ‘రాజు గారి గది 4’ కథ సిద్ధంగా ఉందని చెబుతున్నారు ఓంకార్. కరోనా కారణంగా ఏడాదిన్నర నుండి సినిమాలు చేయలేదని.. ఇప్పుడు షూటింగ్ చేసినా.. ఎప్పుడు విడుదలవుతుందో ఎవరికీ తెలియదని అన్నారు. మునుపటిలా థియేటర్లలో సినిమాలు విడుదలయ్యే రోజులు వచ్చినప్పుడు సినిమా మొదలుపెట్టాలని చూస్తున్నట్లు వెల్లడించారు.
‘రాజు గారి గది 4’ స్క్రిప్ట్ తో పాటు మరో థ్రిల్లర్ సబ్జెక్ట్ అలానే క్రీడా నేపథ్యంలో ఓ కథ రాసుకున్నానని చెప్పారు. మొత్తం ఈ మూడు కథలతో పాటు గ్రామీణ నేపథ్యంలో ఓ కథ సిద్ధం చేయాలనే ఆలోచన ఉందని స్పష్టం చేశారు. ‘రాజు గారి గది’ కంటే ముందు మరో సినిమా చేద్దామనుకున్నానని.. కానీ కరోనా వలన రెండేళ్ల విరామం వచ్చిందని అన్నారు. ప్రస్తుతం మరో రియాలిటీ షో చేస్తున్నట్లు చెప్పారు. అది ఓటీటీకి చేస్తానా లేక టీవీ కోసమా అనేది త్వరలోనే చెబుతానని వెల్లడించారు. ఓటీటీల నుండి కూడా తనకు అవకాశాలు వస్తున్నట్లు చెప్పారు.
https://ift.tt/3nnqUC7 https://ift.tt/eA8V8J
Comments
Post a Comment