పవన్ నుంచి నానీకి పడిపోయాడా?
ఒక పెద్ద హీరోతో హిట్టు కొట్టాక ఆ దర్శకుడు తర్వాత అదే స్థాయి హీరోల కోసమే చూస్తారు. స్థాయి తగ్గించుకోవడానికి ఇష్టపడరు. టాప్ లీగ్‌లో ఉండే అవకాశాన్ని దూరం చేసుకోవాలనుకోరు. అయితే స్టార్ హీరోలు మరీ బిజీగా ఉండి, కమిట్మెంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నపుడు కొంచెం రేంజ్ తగ్గంచుకోక తప్పదు. వేణు శ్రీరామ్ ఇప్పుడు అదే పని చేయబోతున్నట్లు సమాచారం.
ఓ మై ఫ్రెండ్, ఎంసీఏ లాంటి మీడియం రేంజ్ సినిమాలు చేసిన వేణు.. అనూహ్యంగా మూడో సినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో తీసిన సంగతి తెలిసిందే. వీరి కలయికలో వచ్చిన వకీల్ సాబ్ మంచి విజయాన్నే అందుకుంది. రీమేక్ మూవీ అయినప్పటికీ.. దానికి తనదైన టచ్ ఇచ్చి, పవన్‌ను అభిమానులు మెచ్చేలా చూపించి మంచి మార్కులు వేయించుకున్నాడు వేణు. బడా హీరోలతో కమర్షియల్ సినిమాలు బాగా డీల్ చేయగలడనే పేరొచ్చింది.
వకీల్ సాబ్ తర్వాత అతను ఏదో ఒక పెద్ద హీరోతోనే సినిమా చేస్తాడన్న అంచనాలు ఏర్పడ్డాయి. అల్లు అర్జున్‌తో ఐకాన్ పెండింగ్‌లో ఉండటంతో దాన్నే టేకప్ చేస్తాడనే వార్తలు కూడా వచ్చాయి. కానీ బన్నీ కమిట్మెంట్ ఇవ్వలేదు. మరే స్టార్ హీరో కూడా అందుబాటులో లేడు. అలాగని పెద్ద హీరోతోనే సినిమా చేయాలని కూర్చుంటే టైం వేస్ట్ అయిపోతుందనే ఉద్దేశంతో వేణు ప్రత్యామ్నాయాలు ఆలోచించాడు.
ఈ క్రమంలోనే తనకు తొలి విజయాన్నందించిన ఎంసీఏ సినిమాలో హీరోగా నటించిన నానీని అతను సంప్రదించినట్లు తెలుస్తోంది. వీరి కలయికలో ఒక కమర్షియల్ మూవీ రాబోతున్నట్లు సమాచారం. వేణు కథకు నాని పచ్చ జెండా కూడా ఊపేశాడని.. త్వరలోనే ఈ సినిమా గురించి ప్రకటన వస్తుందని అంటున్నారు. ఐతే తన మాతృ సంస్థ అయిన వేంకటేశ్వర క్రియేషన్స్‌లోనే ఈ సినిమా చేస్తాడా.. ఇంకో బేనర్ వైపు వేణు చూస్తాడా అన్నదే క్లారిటీ లేదు.
https://ift.tt/3nnqUC7 https://ift.tt/eA8V8J
Comments
Post a Comment